‘ఎంఐజీ లే అవుట్‌ పనులు వేగవంతం చేయాలి’ | CRDA Commissioner Vijayakrishnan ordered the officers on MIG Lay Out works | Sakshi
Sakshi News home page

‘ఎంఐజీ లే అవుట్‌ పనులు వేగవంతం చేయాలి’

Published Wed, Feb 9 2022 5:38 AM | Last Updated on Wed, Feb 9 2022 5:38 AM

CRDA Commissioner Vijayakrishnan ordered the officers on MIG Lay Out works - Sakshi

స్థలాలను పరిశీలిస్తున్న విజయకృష్ణన్‌

మంగళగిరి: జగనన్న స్మార్ట్‌ కాలనీ ఎంఐజీ లే–అవుట్‌లో పనులు మరింత వేగవంతం చేయాలని సీఆర్‌డీఏ కమిషనర్‌ విజయకృష్ణన్‌ అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం పక్కన వేసిన జగనన్న స్మార్ట్‌ కాలనీతో పాటు పక్కనే వున్న పాత టౌన్‌షిప్‌లో చేపట్టిన జంగిల్‌ క్లియరెన్స్‌ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు.

విజయకృష్ణన్‌ మాట్లాడుతూ నగరపాలక సంస్థ అధికారులను సమన్వయం చేసుకుని టౌన్‌షిప్‌ మొత్తం పారిశుధ్య పనులు నిర్వహించాలన్నారు. జగనన్న స్మార్ట్‌ కాలనీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందని ఇప్పటివరకు సుమారు 600 దరఖాస్తులు రాగా 100 మందికిపైగా నగదు చెల్లింపులు చేశారని చెప్పారు. అనుకున్న సమయానికి జగనన్న స్మార్ట్‌ కాలనీని అభివృద్ధి చేసి యజమానులకు ప్లాట్లు అప్పగిస్తామని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement