Jagananna Smart Town
-
అమరావతిలో పేదల ఇళ్లకుసీఆర్డీఏ ఆమోదం
సాక్షి, అమరావతి: నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం మూడో విడత కింద అమరావతి ప్రాంతంలో 48,218 మంది పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించేలా కార్యాచరణ రూపొందించాలని అధికార యంత్రాంగానికి సూచించారు. మే నెల మొదటి వారం నాటికి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. ఇళ్లులేని పేదల చిరకాల వాంఛ నెరవేర్చే ఈ కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ జీవో జారీ చేసిన నేపథ్యంలో సీఎం జగన్ అధ్యక్షతన సోమవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన సీఆర్డీఏ 33వ సమావేశంలో ఈమేరకు ఆమోద ముద్ర వేశారు. 20 లేఅవుట్లు.. అమరావతి ప్రాంతంలో మొత్తం 20 లేఅవుట్లలో 1,134.58 ఎకరాల భూమిని పేదల ఇళ్ల కోసం కేటాయించారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 48,218 మంది పేదలు ఉచితంగా ఇళ్ల పట్టాలు పొందనున్నారు. ఐనవోలు, మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, కురగల్లు, నిడమానూరు ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసింది. సీఆర్డీఏ చట్టం సెక్షన్ 41(3), (4) ప్రకారం ఆర్–5 జోన్ ఏర్పాటు చేసి భూములను ఆ పరిధిలోకి తెచ్చింది. గత ఏడాది అక్టోబరులో అభ్యంతరాలు, సలహాలను స్వీకరించి సీఆర్డీఏ బహిరంగ విచారణ నిర్వహించింది. అనంతరం గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇళ్ల పట్టాల లబ్ధిదారుల జాబితాతో డీపీఆర్‌లు తయారు చేయాలని గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. న్యాయపరమైన చిక్కులను పరిష్కరించి పేదలకు ఇళ్ల పట్టాలు అందించేలా ప్రభుత్వం సన్నద్ధమైంది. సీఎం సమీక్షలో పురపాలక శాఖ మంత్రి సురేష్, సీఎస్ జవహర్‌రెడ్డి, పురపాలక శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్, ఆర్అండ్బీ శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, సీఆర్డీఏ కమిషనర్ వివేక్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రాజెక్టుల్లో ఎక్కడైనా ప్లాట్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. రాష్ట్రంలో ఎక్కడ పనిచేస్తున్నవారైనా.. వారు కోరుకున్నచోట ప్లాట్ తీసుకోవచ్చు. గతంలో ఉద్యోగులు పనిచేస్తున్న ప్రాంతంలో ఉన్న జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌ల్లో మాత్రమే కొనుగోలు చేసేందుకు వీలుండేది. ఉద్యోగుల విజ్ఞప్తుల మేరకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఈ నిబంధనలను సడలించి జీవో నంబరు 38 జారీచేసింది. ఈ కొత్త జీవో ద్వారా ప్లాట్‌ను రాష్ట్రంలో ఎక్కడైనా ఎంపిక చేసుకునే అవకాశం లభించింది. రాష్ట్రంలోని 22 నగరాలు, పట్టణాల్లో అన్ని అనుమతులు, ప్రణాళికలతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేసింది. వీటిని మార్కెట్ ధర కంటే తక్కువకే అందుబాటులో ఉంచింది. ప్రజలతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అన్ని లేఅవుట్లలో ప్రభుత్వ ఉద్యోగులకు 10 ప్లాట్లు రిజర్వ్ చేయడంతోపాటు ధరలో 20 శాతం రిబేట్ సౌకర్యం కూడా కల్పించింది. కొత్త నిబంధనలతో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు మొత్తం 22 జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రాజెక్టుల్లో ఎక్కడైనా ప్లాట్ బుక్ చేసుకోవచ్చు. లేఅవుట్స్ వివరాలను https:// migapdtcp. ap. gov. in/ వెబ్సైట్లో చూడవచ్చు. చదవండి: సముద్రంలో ‘పవన విద్యుత్’ -
పేదలకు గృహవరం.. ఏళ్ల నాటి కల సాకారం
సొంతిల్లు ప్రతిఒక్కరి కల.. ఏమి ఉన్నా లేకున్నా ఇల్లు ఉంటే చాలు.. ఏళ్ల తరబడి సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదలకు సీఎం జగన్ గృహయోగం కల్పించారు. స్థలం మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి ప్రోత్సహిస్తున్నారు. దీంతో పశ్చిమగోదావరి జిల్లాలో గృహనిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణాలు పూర్తిచేసుకున్న లబ్ధిదారులు ఆనందోత్సాహాలతో గృహప్రవేశాలు చేసుకుంటున్నారు. అద్దె ఇంటి కష్టాలు తీర్చిన ముఖ్యమంత్రికి నీరాజనాలు పడుతున్నారు. సొంతింటికి చేరిన భాగ్యలక్ష్మి భీమవరం 8వ వార్డుకు చెందిన బాలం భాగ్యలక్ష్మి సుమారు 30 ఏళ్ల పాటు అద్దె ఇంట్లో జీవనం సాగించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆమెకు భీమవరం విస్సాకోడేరు లేవుట్‌లో ఇంటి స్థలం మంజూరు కాగా నిర్మాణం పూర్తిచేసుకుని ఇటీవల గృహప్రవేశం కూడా చేశారు. సీఎం జగన్మోహన్రెడ్డి తమ సొంతింటి కలను సాకారం చేశారని, అద్దె ఇంటి ఇబ్బందులు తప్పాయని ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి గృహప్రవేశం ఈమె పేరు టి.అప్పాయమ్మ, భీమవరంలోని 6వ వార్డులో 20 ఏళ్లుగా అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆమె కూలీ పనులు చేస్తుండగా కుమారుడు ఆటో నడుపుతున్నాడు. సీఎం జగన్ ఆమెకు విస్సాకోడేరు లేఅవుట్లో ఇంటి స్థలం మంజూరు చేశారు. అప్పాయమ్మ తన కుమారుడితో కలిసి ఇంటి నిర్మాణం పూర్తిచేసుకున్నారు. సంక్రాంతికి గృహప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుంటు న్నారు. సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని ఆమె అంటున్నారు. భీమవరం(ప్రకాశం చౌక్) : జిల్లాలోని 609 జగనన్న లేఅవుట్లతో పాటు సొంత స్థలాల్లోనూ లబ్ధిదారులు గృహనిర్మాణాలను ముమ్మరంగా చేపట్టారు. జిల్లాలో మొత్తం 72,688 ఇళ్లు మంజూరు కాగా లేఅవుట్లలో 55,766 మందికి స్థలాలు కేటాయించారు. మిగిలినవి సొంత స్థలంలో లబ్ధిదారులకు మంజూరుచేశారు. ఇప్పటివరకూ 15,197కు పైగా నిర్మాణాలు పూర్తికాగా మరో 2,800 ఇళ్లు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. వీరు జనవరిలో గృహప్రవేశాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే 50 వేలకుపైగా ఇంటి నిర్మాణాలు పలు దశల్లో ఉన్నాయి. అద్దె కష్టాలు తీరుస్తూ.. లక్షలాది రూపాయలు వెచ్చించి ఇంటి స్థలం కొనలేని వారికి సీఎం జగన్ గృహవరం ఇచ్చారు. దీంతో ఏళ్ల తరబడి అద్దె ఇంటిలో గడుపుతున్న పేదల కష్టాలు తీరుతున్నాయి. ఇంటి స్థలం ఉచితంగా అందించడంతో పాటు నిర్మా ణానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అలాగే లేఅవుట్లలో తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులను కల్పిస్తోంది. నాడు దివంగత వైఎస్సార్ పేదలకు ఇంటి స్థలాలు ఇస్తే నేడు ఆయన తనయుడు సీఎం జగన్ భారీ కాలనీలనే నిర్మిస్తున్నారని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అధికార పార్టీ అనుయాయులకే పథకాలు అందించేవారని, అయితే ప్రస్తుత ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా అన్ని పథకాలు వర్తిస్తున్నాయని అంటున్నారు. వేగంగా నిర్మాణాలు జిల్లావ్యాప్తంగా 609 లేఅవుట్లలో నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణాలు పూర్తయిన వారు గృహప్రవేశాలు చేసుకుంటున్నారు. అన్నిరకాలుగా ఇంటి నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నాం. ఇసుక సరఫరాకు బల్క్ పాయింట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నాం. నిరంతరం లబ్ధిదారులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. హౌసింగ్, మున్సిపాలిటీ, రెవెన్యూ తదితర శాఖల నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. – పి.ప్రశాంతి, కలెక్టర్ కల నిజమాయె.. పెనుగొండ: ఎన్నో ఏళ్ల కల సీఎం జగన్ పాలనతో సాకారం కావడంతో లబ్ధిదారుడి ఆనందానికి అవధులు లేవు. మండలంలోని ఇలపర్రు జగనన్న కాలనీలో స్థలం పొందిన దంపతులు పోలుమూరి రత్నంరాజు, రత్న సురేఖ ఇంటి నిర్మాణం పూర్తి చేసి శనివారం గృహప్రవేశం చేశారు. యోగా అసోషియేషన్ అధ్యక్షుడు చెరుకువాడ నరసింహరాజుతో ప్రారంభోత్సవం చేయించి కృతజ్ఞ త చాటారు. మండల సర్పంచ్ల చాంబర్ అధ్యక్షురాలు దండు పద్మావతి, ఎంపీటీసీ పడపట్ల పద్మనాగేశ్వరి, సొసైటీ చైర్పర్సన్ వేండ్ర వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షుడు పులిదిండి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఎంఐజీ ప్లాట్ల బుకింగ్‌కు గడువు పెంపు
సాక్షి, అమరావతి: మంగళగిరిలోని ‘జగనన్న స్మార్ట్ టౌన్షిప్’లో ప్లాట్ల కొనుగోలు కోసం ఆన్లైన్లో బుకింగ్‌కు డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ఏపీ సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ–వేలంలో ప్లాట్ల కొనుగోలుకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు శనివారంతో ముగిసిందని, అయితే, కొనుగోలుదారుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు గడువు పొడిగించినట్లు వివరించారు. ఇక్కడి ఎంఐజీ లే అవుట్–2లో 200 చ.గ. ప్లాట్లు 68, 240 చ.గ. ప్లాట్లు 199, మొత్తం 267 ఉన్నాయని తెలిపారు. చదరపు గజం ధర రూ.17,499గా నిర్ణయించామని, కొనుగోలుదారులకు రాయితీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానికంగా నివసిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు 10% ప్లాట్లు రిజర్వు చేయడంతోపాటు 20% రాయితీ ఇస్తున్నామని, స్థానిక విశ్రాంత ఉద్యోగులకు 5% ప్లాట్లను రిజర్వు చేసినట్లు తెలిపారు. ఈ–వేలంలో ప్లాట్లు పొందినవారు సులభ వాయిదాల్లో డబ్బులు చెల్లించే సౌకర్యం కూడా ఉందన్నారు. ఆన్లైన్ బుకింగ్ అనంతరం ఈ–వేలం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎంఐజీలో ప్లాట్లు కొనుగోలు చేసేవారికి ప్రభుత్వం మరో మంచి అవకాశం కల్పిస్తోందని, ప్లాట్ నికర అమ్మకపు ధరలో 60% మీద మాత్రమే రిజిస్ట్రేషన్ చార్జీలు ఉంటాయని, మిగిలిన 40 శాతం మీద మినహాయించినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు https://migapdtcp.ap.gov.in, https://crda. ap. gov. in వెబ్సైట్, లేదా 0866– 2527124 నంబర్లో గానీ సంప్రదించవచ్చు. -
మరిన్నిచోట్ల జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లు
సాక్షి, అమరావతి: మధ్య ఆదాయ వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్ల స్థలాలను అందించే జగనన్న స్మార్ట్ టౌన్షిప్లకు మంచి స్పందన లభిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని ప్రాంతాల్లో స్మార్ట్ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేసి ఎంఐజీ లేఅవుట్లను సిద్ధం చేస్తోంది. ప్రతి నియోజకవర్గంలో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ఏర్పాటు చేయాలని గతంలో ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో సీఎం జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే. సీఆర్డీఏ పరిధిలోని ఆరు జిల్లాల్లో జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో అమరావతి ప్రాంతంలోని మంగళగిరిలో 80.46 ఎకరాల్లో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ఎంఐజీ ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చింది. ఇందులో 614 ప్లాట్లు వేశారు. ఇటీవల మొదటి విడతగా 119 ప్లాట్లను ఈ–లాటరీ ద్వారా కొనుగోలుదారులకు కేటాయించారు. ఈ ప్లాట్లకు మంచి డిమాండ్ ఉండడంతో అధికారులు మిగిలిన 495 ప్లాట్లను సిద్ధం చేస్తున్నారు. సీఆర్డీఏ పరిధిలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఏలూరు జిల్లాల్లోని 27 నియోజకవర్గాల్లో ఎంఐజీ ప్లాట్ల ఏర్పాటు ప్రక్రియను కూడా ప్రారంభించారు. గుంటూరు జిల్లా నారాకోడూరులో 97 ఎకరాల సేకరణకు ప్రభుత్వం ఇటీవల రూ.20 కోట్లు మంజూరు చేసింది. గుడివాడ నియోజకవర్గంలో 400 ఎకరాలను గుర్తించి దస్త్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలనకు పంపారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం, గుడివాడ, పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లో, ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల్లో మూడు ప్రాంతాల్లో 776.8 ఎకరాలను గుర్తించారు. గుంటూరు జిల్లాలోని నారాకోడూరు, అంకిరెడ్డిపాలెం, నేలపాడు, జొన్నలగడ్డ, నిడుబ్రోలు సమీపంలో మొత్తం 474.7 ఎకరాలు గుర్తించారు. పల్నాడు జిల్లాలో ఆరు నియోజకవర్గాలకు గాను, మూడింట్లో భూమిని గుర్తించాల్సి ఉంది. బాపట్లలోని రేపల్లె వద్ద 243.86 ఎకరాలను గుర్తించి జిల్లా కలెక్టర్‌కు నివేదించారు. ఏలూరు నియోజకవర్గంలో నూజివీడు వద్ద 40.78 ఎకరాలకు నివేదికను సిద్ధం చేస్తున్నారు. మధ్య తరగతికి మేలు చేసేలా.. తక్కువ, మధ్య ఆదాయ వర్గాల ప్రజలు పట్టణానికి సమీపంలో ఇంటి స్థలం కొనాలని అనుకుంటారు. వీరి అవసరాన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేటు రియల్టర్లు పలువురు మోసాలకు పాల్పడుతున్నారు. వారి వెంచర్లకు అనుమతులు లేకున్నా.. ఉన్నట్టు నమ్మించి అంటగడుతున్నారు. ఈ వెంచర్లలో మాస్టర్ ప్లాన్‌తో సంబంధం లేనివి, రెరా అనుమతులు లేనివే అధికంగా ఉంటున్నాయి. వీటికి అన్ని రకాల అనుమతులు తెచ్చుకోవడం ప్లాట్లు కొన్నవారికి తలకు మించిన భారమే. కొన్నిసార్లు ఈ తరహా ప్లాట్లకు ప్రభుత్వ అనుమతులు మంజూరుకావు. మధ్య తరగతి ప్రజలు ఇటువంటి మోసాల బారిన పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే అన్ని అనుమతులతో, మార్కెట్ ధరకంటే తక్కువలో ఎంఐజీ ప్లాట్లను జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పేరుతోఅందుబాటులోకి తెస్తోంది. క్లియర్ టైటిల్ డీడ్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం అనుమతితో పాటు అన్ని వసతులతో వీటిని అందిస్తోంది. -
సకల సౌకర్యాలతో లేఅవుట్లు.. తక్కువ ధరకే ఉద్యోగులు, మధ్యతరగతి వారికి ప్లాట్లు
సొంతిల్లు...ప్రతి ఒక్కరి కల. నిరుపేదలకు ప్రభుత్వమే ఉచితంగా ఇంటిస్థలం ఇస్తోంది. అర్హత ఆధారంగా ఇల్లు కూడా కట్టిస్తోంది. కానీ ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలకు ఆ అవకాశం లేదు. వీరంతా దాదాపు పట్టణాల్లోనే నివాసం ఉంటున్నారు. సమీపంలో స్థలం కొందామంటే..ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పైగా అనుమతుల తిరకాసులెన్నో...ఇలాంటి వారికీ ప్రభుత్వం అండగా నిలిచింది. ‘జగనన్న స్మార్ట్ టౌన్షిప్’ పేరుతో సకల సౌకర్యాలు, అన్ని అనుమతులతో కూడిన స్థలాన్ని అతితక్కువ ధరకే అందిస్తోంది. హిందూపురం (శ్రీ సత్యసాయి జిల్లా): మధ్యతరగతి వర్గాలు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మిడిల్ ఇన్కమ్ గ్రూప్ (ఎంఐజీ) పేరుతో లేఅవుట్ల రూపొందించి తక్కువ మొత్తానికే పట్టణ పరిధిలో ఇంటి స్థలాలను అందిస్తోంది. న్యాయపర సమస్యలు లేకుండా క్లియర్ టైటిల్‌తో లాభాపేక్ష లేకుండా చర్యలు తీసుకుంటోంది. ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్’ పేరిట పట్టణ సమీప ప్రాంతాల్లోనే వందల ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో లేఅవుట్లు ఏర్పాటు చేస్తోంది. జిల్లాలో రెండు ప్రాంతాల్లో.. జిల్లాలోని ధర్మవరం, హిందూపురం నియోజకవర్గాల్లో ఎంఐజీ లేఅవుట్లు సిద్ధం చేస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గం కుణుతూరులో ఇప్పటికే ప్లాట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయ. మౌలిక వసతుల కల్పన పనులు ముమ్మరమయ్యాయి. సదుపాయాలు ఇలా.. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లేఅవుట్లన్నీ ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ద్వారా రిజిష్టర్ అయి ఉంటాయి. లేఅవుట్లో 60 అడుగుల బీటీ రోడ్డు, 40 అడుగుల సిమెంట్ కాంక్రీట్ రోడ్డు, ఫుట్‌పాత్‌లు, ఈఎల్‌ఎస్‌ఆర్‌లతో నీటి సరఫరా, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, భూగర్భ మురుగు కాల్వలు, వీధి దీపాలు ఉంటాయి. అలాగే వర్షపు నీరు వెళ్లేందుకు కాలువలతో పాటు ఆహ్లాదం పంచేలా పార్కులు అభివృద్ధి చేస్తారు. ఇతర అన్ని రకాల సదుపాయలూ కల్పిస్తారు. అర్హతలు ఇలా.. ఎంఐజీ లేఅవుట్లలో ఒక కుటుంబానికి ఒక ప్లాటు మాత్రమే కేటాయిస్తారు. సంవత్సర ఆదాయం రూ. 18 లక్షల్లోపు ఉండాలి. దరఖాస్తుదారుల వయస్సు 18 ఏళ్లు నిండి ఉండటంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. ఆధార్ కార్డు ద్వారా మాత్రమే దరఖాస్తు నమోదు సాధ్యమవుతుంది. ఆసక్తి కలిగిన వారు migapdtcp.ap.gov.in వెబ్సైట్ ద్వారా వివరాలు నమోదు చేసి ప్లాటు కేటగిరీ మొత్తం విలువలో 10 శాతం చెల్లించాల్సి ఉంటుంది. లేఅవుట్లలో విక్రయాల అనంతరం పారదర్శకంగా లాటరీ పద్ధతిలో దరఖాస్తుదారులకు ప్లాటు నంబర్లు కేటాయిస్తారు. ఆ తర్వాత నిర్ణీత సమయంలో అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ప్లాటు కేటాయింపు రద్దు చేసి, అర్హత కలిగిన ఇతరులకు కేటాయిస్తారు. అగ్రిమెంట్ చేసుకున్న తేదీ నుంచి దరఖాస్తుదారులు నెలలోపు ప్లాటు మొత్తంలో 30 శాతం చెల్లించాల్సి ఉంటుంది. వందశాతం చెల్లిస్తే 5 శాతం రాయితీ కూడా ఇస్తారు. ఉద్యోగులకు 20 శాతం రాయితీ.. ప్రభుత్వ ఉద్యోగులకు మరికొంత లబ్ధి చేకూరే విధంగా లేవుట్ మొత్తం ప్లాట్లలో పదిశాతం రిజర్వు చేశారు. అంతేకాకుండా లేఅవుట్ ఏర్పాటు చేసిన నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం రాయితీ కూడా ఇస్తున్నారు. ఇంటి స్థలం కావాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ఫాం–16 సమర్పించాల్సి ఉంటుంది. ► హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు మండలం కోడూరు గ్రామ సమీపంలో బెంగళూరు 44 జాతీయ రహదారి పక్కనే 774, 775 సర్వే నంబర్లలో 7 ఎకరాల్లో 98 ప్లాట్లతో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ లేఅవుట్లో సెంటు రూ.3.63 లక్షలుగా ప్రభుత్వం ధర నిర్ణయించింది. ఈ లేవుట్‌లో వివిధ అభివృద్ధి పనుల కోసం పబ్లిక్ హెల్త్ ఎస్ఈ టెండర్లు ఆహ్వానించారు. ► ధర్మవరం నియోజకవర్గంలో కుణుతూరు సర్వే నంబర్లు 498,499, 628 నుంచి 642 వరకు 120 ఎకరాల్లో 1,272 ప్లాట్లతో అతిపెద్ద జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ఏర్పాటు చేశారు. 2021 నవంబర్ 21న రూ.106.00 కోట్లతో పనులు ప్రారంభించారు. ఈ లేఅవుట్లో సెంటు ధర రూ.3 లక్షలుగా నిర్ణయించారు. ఇప్పటికే ప్లాట్లు విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ వివిధ అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అన్ని అనుమతులతో లేఅవుట్లు మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లేఅవుట్ల పథకం వల్ల మధ్యతరగతి వర్గాలు, ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కొంత రాయితీ కూడా ఉంటుంది. అన్ని మౌలిక వసతులతో ఎలాంటి లాభాపేక్ష లేకుండా, వివాదాలు లేని లేఅవుట్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. 150/200/240 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లకు రూ. 3 లక్షల నుంచి రూ.18 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారందరూ అర్హులు. ఆసక్తి గల వారు సచివాలయం, లేదా మున్సిపల్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో సంప్రదించవచ్చు. ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తుచేసుకోవచ్చు. – డాక్టర్ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్, హిందూపురం అన్ని సదుపాయాలతో అభివృద్ధి ఎంఐజీ లేఅవుట్లలో అన్ని సదుపాయాలు కల్పించి ప్రభుత్వమే అభివృద్ధి చేస్తుంది. నిజంగా ఇది మధ్యతరగతి వర్గాలు, ఉద్యోగులకు మంచి అవకాశం. కొడికొండ వద్ద, హైవే పక్కనే లేఅవుట్ సిద్ధం అవుతోంది. హిందూపురం ప్రాంత ప్రజలకు చక్కటి అవకాశం. త్వరలోనే మౌలిక సదుపాయాల కల్పన పనులు ప్రారంభమవుతున్నాయి. ధర్మవరం కుణుతూరు జగనన్న స్మార్ట్ టౌన్ షిప్లో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. త్వరలోనే అది పూర్తవుతుంది. – ఈశ్వరయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అహుడా.అనంతపురం. -
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మధ్య ఆదాయ వర్గాలు (ఎంఐజీ) కోరుకునే ఇంటి నిర్మాణం కోసం అవసరమైన ప్లాట్లను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లను పూర్తి ప్రభుత్వ హామీతో అభివృద్ధి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. వాటిని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. స్మార్ట్ టౌన్‌షిప్‌ల అభివృద్ధి మార్గదర్శకాలు, పాటించాల్సిన నిబంధనలపై చర్చించేందుకు శనివారం సీఆర్డీఏ కార్యాలయంలో రియల్ ఎస్టేట్ డెవలపర్స్‌తో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సీఆర్డీఏ అదనపు కమిషనర్ అలీంబాషా, డెవెలప్మెంట్ ప్రమోషన్ డైరెక్టర్ ఎం.వెంకటసుబ్బయ్య, క్రెడాయ్ అధ్యక్షుడు కె.రాజేంద్ర, సభ్యులు, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నెరెడ్కో) సభ్యులు, వాటి పరిధిలోని రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో కమిషనర్ డెవలపర్స్ సందేహాలకు సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. సీఆర్డీఏ పరిధితో పాటు ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో స్మార్ట్ టౌన్‌షిప్‌లను చేపట్టనున్నామని, ప్రాజెక్టు అమలుకు జిల్లా స్థాయి కమిటీ (డీఎల్సీ) నేతృత్వం వహిస్తుందని వివరిచారు. ప్రాజెక్టుకు 20 ఎకరాలు తప్పనిసరి డెవలపర్ సంస్థ కనీసం 20 ఎకరాల భూమిని లే అవుట్‌గా అభివృద్ధి చేయాలని, యజమాని పేరుతోనే భూమి ఉండాలని కమిషనర్ సూచించారు. లే అవుట్ అభివృద్ధికి ముందుకు వచ్చేవారికి ప్రభుత్వం వేగంగా అన్ని అనుమతులు ఇస్తుందని వివరించారు. లే అవుట్లను మౌలిక సదుపాయాలతో సహా 150, 200, 240 గజాల విస్తీర్ణంలో మూడు రకాల ప్లాట్లను అభివృద్ధి చేయాలని, డెవలపర్ భూమి ఇచ్చినప్పటి నుంచి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు అన్ని అభివృద్ధి పనులపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుందని కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. భూమి యజమానికి, ఎంఐజీల్లో ప్లాట్లు కొనుగోలు చేసేవారికి వారధిగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందన్నారు. ఈ నెల 20 నుంచి ఎంఐజీ లే అవుట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, డెవలపర్స్ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా డెవలప్స్ అడిగిన సందేహాలను వివేక్ యాదవ్‌తో పాటు, ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్సెట్ మేనేజ్మెంట్కు చెందిన డొమైన్ ప్రాజెక్ట్ మేనేజర్ సిద్ధార్థ నివృత్తి చేశారు. అలాగే సీఆర్డీఏ ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలోని పాయకాపురం, తెనాలిలోని చెంచుపేట, మంగళగిరి, ఇబ్రహీంపట్నంలోని ట్రక్ టెర్మినల్ ప్రాంతాల్లో ప్లాట్లను ఈ–వేలం ద్వారా అమ్మకానికి ఉంచామని, రియల్ ఎస్టేట్ డెవలపర్స్ తోడ్పాటునందించాలని కోరారు. ఎంఐజీ నిబంధనలు ఇవీ.. ► రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 88లోని నిబంధనలకు అనుగుణంగా ఎంఐజీ లే అవుట్లు ఉండాలి ► లే అవుట్లో పట్టణాభివృద్ధి సంస్థ (యూడిఏ) వాటాగా 40 శాతం కంటే ఎక్కువ విస్తీర్ణాన్ని ఎంఐజీ దరఖాస్తుదారులకు ఇచ్చేందుకు ప్రాజెక్టు అభివృద్ధి సంస్థ ముందుకొస్తే దాన్ని తిరస్కరణ లేదా అంగీకరించే అధికారం జిల్లాస్థాయి కమిటీకి ఉంటుంది ► దరఖాస్తుదారులకు అనువైన ప్రాంతంలో ఎలాంటి వ్యాజ్యాలు, తాకట్టులు లేని కనీసం 20 ఎకరాల భూమిలో మాత్రమే వీటిని ఏర్పాటు చేయాలి ► ఎంఐజీ ప్లాట్ల అనుమతులు, మార్కెట్ విలువ, అమ్మకం ధర వంటి అంశాలు ఎలా ఉండాలో జిల్లా కమిటీ సూచిస్తుంది. ► ప్రాజెక్టు ఏర్పాటు చేసే ఒక ప్రాంతం నుంచి ఒకటికి మించి దరఖాస్తులు వస్తే మార్గదర్శకాలకు అనుగుణంగా అభివృద్ధి సంస్థలను జిల్లా కమిటీ ఎంపిక చేస్తుంది ► ఎంఐజీ ప్లాట్ల అమ్మకపు ధర ఎప్పుడూ మార్కెట్ ధర కంటే కనీసం 10 నుంచి 20 శాతం తక్కువగా ఉండేలా కమిటీ చూడాలి ► లే అవుట్లలో అంతర్గత రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, పార్కులు, ఫుట్‌పాత్ తదితర ముఖ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి ► ఎంఐజీలో ప్లాట్లు కావాలనుకునేవారు దరఖాస్తుతో పాటు ప్లాట్ ధరలో 10 శాతం, ఒప్పదం చేసుకునే సమయంలో మరో 10 శాతం, ప్రాజెక్టు పూర్తయ్యాక ప్లాట్ల రిజిస్ట్రేషన్ సమయంలో మిగిలిన 80 శాతం మొత్తాన్ని చెల్లించాలి. -
ఇళ్ల నిర్మాణం పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
-
‘ఎంఐజీ లే అవుట్ పనులు వేగవంతం చేయాలి’
మంగళగిరి: జగనన్న స్మార్ట్ కాలనీ ఎంఐజీ లే–అవుట్లో పనులు మరింత వేగవంతం చేయాలని సీఆర్డీఏ కమిషనర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పక్కన వేసిన జగనన్న స్మార్ట్ కాలనీతో పాటు పక్కనే వున్న పాత టౌన్షిప్లో చేపట్టిన జంగిల్ క్లియరెన్స్ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. విజయకృష్ణన్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ అధికారులను సమన్వయం చేసుకుని టౌన్షిప్ మొత్తం పారిశుధ్య పనులు నిర్వహించాలన్నారు. జగనన్న స్మార్ట్ కాలనీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందని ఇప్పటివరకు సుమారు 600 దరఖాస్తులు రాగా 100 మందికిపైగా నగదు చెల్లింపులు చేశారని చెప్పారు. అనుకున్న సమయానికి జగనన్న స్మార్ట్ కాలనీని అభివృద్ధి చేసి యజమానులకు ప్లాట్లు అప్పగిస్తామని తెలిపారు. -
జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్లాట్లకు మంచి స్పందన
సాక్షి, అమరావతి: మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు అన్ని వసతులతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అందుబాటులోకి తెచ్చిన జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్లాట్లకు తొలిరోజు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఆన్లైన్ బుకింగ్ కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెబ్సైట్ ప్రారంభించిన కొద్దిసేపటికే దరఖాస్తులు వచ్చాయని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ వీపనగండ్ల రాముడు తెలిపారు. తొలివిడత ప్రాజెక్టులో భాగంగా అనంతపురం జిల్లా ధర్మవరం, ప్రకాశం జిల్లా కందుకూరు, వైఎస్సార్ జిల్లా రాయచోటి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరు వద్ద వేసిన లేఔట్లలో 150, 200, 240 చదరపు గజాల్లో 3,894 ప్లాట్లను అందుబాటులో ఉంచారు. మంగళవారం సాయంత్రానికి 643 మంది ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించడంతోపాటు మొదటి విడతగా 10% ఫీజును చెల్లించారు. మరో 97 మంది మొత్తం ప్లాట్ ధరను ఆన్లైన్లో చెల్లించి 5 శాతం రాయితీ పొందారు. నవులూరు లేఔట్లో 200, 240 చ.గజాల్లో 538 ప్లాట్లను అందుబాటులో ఉంచగా.. మొదటిరోజు 210 మంది ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించారు. 17 మంది మొత్తం ప్లాట్ ధర చెల్లించారు. భరోసాగా ముందుకొస్తున్నారు సంక్రాంతి సందర్భంగా మరో మంచి కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. పేదలకు 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలిచ్చాం. మధ్య తరగతి ప్రజలకు కూడా అందుబాటు ధరలో లాభాపేక్ష లేకుండా ఇంటి స్థలాలు ఇవ్వాలన్న సీఎం సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. జగనన్న టౌన్‌షిప్స్‌లో ప్రతీ లేఅవుట్ నిబంధనల మేరకు, క్లియర్ టైటిల్‌తో ఉంటుంది. ప్రభుత్వమే ప్లాట్లు ఇవ్వడం వల్ల ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. భరోసాగా ముందుకొస్తున్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఒక టౌన్షిప్ ఉండాలని సీఎం ఆదేశించారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ ప్రాజెక్ట్ చేపడతాం. ప్రజలకు మంచి జరుగుతుంటే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. – బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ మంత్రి -
AP: మిడిల్‌క్లాస్‌కి జాక్'ప్లాట్'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ గూడు ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్న నేపథ్యంలో తాజాగా మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసే కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రతి నియోజకవర్గంలో మిడిల్ క్లాస్ ఇన్కమ్ (ఎంఐజీ) వర్గాలకు మంచి చేయాలనే ఉద్దేశంతో జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా మధ్య తరగతి ఆదాయ వర్గాలకు పారదర్శకంగా, వివాదాలు లేని ఇంటి స్థలాలను సకల సదుపాయాలతో అందచేస్తామని చెప్పారు. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ వెబ్‌సైట్‌ను సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి ప్రారంభించారు. మొదటి దశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు, వైఎస్సార్ జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో లే అవుట్ల నిర్మాణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏమన్నారంటే.. సరసమైన ధర.. క్లియర్ టైటిల్ రాష్ట్రంలో ప్రతి పేదకూ సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఏకంగా 31 లక్షలకుపైగా ఇళ్ల పట్టాలను ఇప్పటికే పంపిణీ చేశాం. తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యాయి. వీటి పనులు చక,చకా జరుగుతున్నాయి. మరోవైపు మధ్య తరగతి కుటుంబాలకు కూడా సరసమైన ధరలకే సొంతింటి కల సాకారం కానుంది. రియల్ ఎస్టేట్ మోసాలకు గురి కాకుండా, లాభాపేక్ష లేకుండా, మార్కెట్ ధర కంటే తక్కువకే వివాద రహిత స్థలాలను క్లియర్ టైటిల్‌తో మధ్య తరగతి కుటుంబాలకు (మిడిల్ ఇన్కమ్ గ్రూపు) అందించాలని నిర్ణయించాం. ప్రభుత్వమే లేఅవుట్ వేసి ఇంటి స్థలాలను అభివృద్ధి చేసి అందుబాటులోకి తేవడం ద్వారా మధ్య తరగతి కుటుంబాలకు మేలు జరుగుతుంది. మూడు కేటగిరీలలో స్ధలాలు ఈ పథకం ద్వారా మూడు కేటగిరీలలో ఇంటి స్ధలాలు అందచేస్తాం. ఎంఐజీ –1 (150 గజాలు), ఎంఐజీ –2 (200 గజాలు), ఎంఐజీ –3 (240 గజాలు) స్థలాలను ప్రతి లేఅవుట్లో అందుబాటులో తెస్తాం. తొలిదశలో ధర్మవరం, నవులూరు, రాయచోటి, కందుకూరు, కావలి, ఏలూరులో లేఅవుట్ల కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఆన్లైన్లో మొదలైన దరఖాస్తుల స్వీకారం జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పథకానికి మంగళవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తున్నాం. తొలిదశలో లేఅవుట్లు వేసిన 6 జిల్లాల్లోనే కాకుండా మిగిలిన అన్ని జిల్లాలతో పాటు ప్రతి నియోజవర్గంలో ఈ పథకం రాబోయే రోజుల్లో విస్తరిస్తుంది. ప్రతి నియోజకవర్గం కేంద్రంలో మధ్యతరగతి కుటుంబాలకు మంచి జరుగుతుంది. ఇదీ వెబ్సైట్ జగనన్న టౌన్‌షిప్స్‌లో ఇంటి స్థలాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన https://migapdtcp.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రూ.18 లక్షల వరకు వార్షికాదాయం ఉన్నవారంతా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. నాలుగు వాయిదాల్లో ఒక ఏడాదిలో డబ్బులు చెల్లించే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. చెల్లింపు పూర్తైన వెంటనే అభివృద్ధి చేసిన ప్లాటును లబ్ధిదారుడి చేతికి అందిస్తాం. ఆన్లైన్ వెబ్‌సైట్‌ను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి బొత్స ముందు 10 శాతం చెల్లించాలి స్మార్ట్ టౌన్స్‌లో ఇంటి స్ధలం కోసం దరఖాస్తు చేసుకునేవారు ప్లాటు నిర్ణీత విలువలో 10 శాతాన్ని ముందుగా చెల్లించాలి. అగ్రిమెంట్ చేసుకున్న నెలలోపు 30 శాతం, 6 నెలల్లోపు మరో 30 శాతం, 12 నెలలు లేదా రిజిస్ట్రేషన్ తేదీ లేదా రెండింటిలో ఏది ముందు అయితే ఆ తేదీలోపు మిగిలిన 30 శాతం డబ్బులు చెల్లిస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి లబ్ధిదారులకు ప్లాటు అప్పగిస్తారు. వాయిదాల్లో కాకుండా ఒకేసారి మొత్తం డబ్బులు చెల్లిస్తే ఐదు రాయితీ కల్పిస్తారు. ఉద్యోగులకు మాట ప్రకారం.. మొన్న పీఆర్సీ ప్రకటన సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు మాట ఇచ్చాం. ఆ ప్రకారం ప్రతి లేఅవుట్లో ప్రభుత్వ ఉద్యోగులకు పది శాతం ప్లాట్లను 20 శాతం రిబేట్‌తో ప్రత్యేకంగా కేటాయిస్తాం. ఆదర్శంగా సమగ్ర లేఅవుట్లు జగనన్న స్మార్ట్ టౌన్స్‌లో పట్టణాభివృద్ధి సంస్ధల ద్వారా పట్టణ ప్రణాళికా విభాగం నియమ, నిబంధనలకు లోబడి ఏడాదిలో సమగ్ర లే అవుట్లను అభివృద్ధి చేస్తాం. నిబంధనలను పక్కాగా పాటిస్తాం. ప్రతి నియోజకవర్గంలో ఇతర రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇవి ఆదర్శప్రాయంగా, మంచి మోడల్ లే అవుట్‌గా నిలుస్తాయి. పారదర్శకంగా కేటాయింపు దరఖాస్తు చేసుకున్న వారికి పూర్తి పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు జరుగుతుంది. ఎక్కడా కులం, మతం, ప్రాంతంతో పాటు ఏ రాజకీయ పార్టీ అని చూడం. అలాంటి వాటికి ఆస్కారం లేకుండా కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు ఉంటుంది. ఇందులో ఎవరి ప్రమేయం ఉండదు. లే అవుట్ల ప్రత్యేకతలు.. స్మార్ట్ టౌన్స్‌లో ప్రభుత్వమే లే అవుట్లు వేస్తోంది. కుటుంబ అవసరాలను బట్టి 150, 200, 240 చదరపు గజాల స్ధలాలను ఎంచుకునే వెసులుబాటు లబ్ధిదారుడికి ఉంటుంది. పర్యావరణహితంగా లేఅవుట్లలో 50 శాతం స్థలాన్ని ఉమ్మడి అవసరాలైన పార్కులు, ప్లే గ్రౌండ్స్, స్కూళ్లు, బ్యాంకులు, షాపింగ్ రిక్రియేషన్ సదుపాయాల కోసం కేటాయిస్తారు. విశాలమైన 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, కలర్ టైల్స్‌తో ఫుట్‌పాత్‌లు, ఎవెన్యూ ప్లాంటేషన్స్ ఉంటాయి. మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వరదనీటి పారుదలకు ఈ కాలనీల్లో అన్ని రకాల ఏర్పాట్లు ఉంటాయి. వీధి దీపాలతో పాటు నాణ్యమైన సదుపాయాలుంటాయి. ఎక్కడా, ఎవరూ వేలెత్తి చూపించలేని తరహాలో లేఅవుట్లను అభివృద్ధి చేస్తాం. నిర్వహణకు కార్పస్ ఫండ్ ఇవాళ మనం అభివృద్ధి చేస్తున్న టౌన్‌షిప్స్ భవిష్యత్తులోనూ బాగుండాలి. వీటి నిర్వహణ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి ప్లాట్ల ఓనర్ల అసోసియేషన్‌కు అప్పగిస్తాం. పట్టణాభివృద్ధి సంస్ధలతో కలిసి సంయుక్తంగా నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశాం. ఇలాంటి జాగ్రత్తల ద్వారా మంచి లేఅవుట్లు రావాలని, మధ్య తరగతి కుటుంబాలకు మేలు జరగాలని కోరుకుంటున్నాం. పోటీతో.. బయ్యర్స్ మార్కెట్ జగనన్న స్టార్ట్ టౌన్‌షిప్స్ ద్వారా సరసమైన ధరలకు ఇంటి స్థలాలు అందుబాటులోకి రావడం ద్వారా మార్కెట్లోనూ అలాంటి వాతావరణం ఏర్పడుతుంది. తద్వారా మిగిలిన లే అవుట్లు వేసేవారు కూడా పోటీగా ధరలు తగ్గించక తప్పని పరిస్థితి నెలకొంటుంది. దీనివల్ల ధరలు తగ్గి నాణ్యమైన లే అవుట్లు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ► ఈ కార్యక్రమంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి ఎంవీ రామమనోహరరావు, ఎంఐజీ లేఅవుట్ స్పెషల్ ఆఫీసర్ బసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పండుగ వేళ.. ‘‘న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేని, అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన, వివాదరహితమైన ఇంటి స్థలాలను జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ పథకం ద్వారా అందిస్తున్నాం. సంక్రాంతి సమయంలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం’’ – సీఎం జగన్ బయట కొంటే ఎన్నో ఇబ్బందులు.. పేదలకే కాకుండా మధ్యతరగతి ప్రజలకు కూడా మేలు చేస్తూ మంచి లొకేషన్లో అతి తక్కువ ధరకే ఇంటి స్థలం ఇవ్వడం మంచి పరిణామం. మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే స్థలం వస్తుంది. బయట కొంటే మౌలిక సదుపాయాల నుంచి అనేక ఇబ్బందులుంటాయి. కందుకూరు లే అవుట్ చాలా బాగుంది. సొంతింటి కల సాకారం అవుతోంది. –వెంకటేశ్వర్లు, రిటైర్డ్ హెడ్ మాస్టర్, ప్రకాశం జిల్లా -
ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా లేఅవుట్లు: మంత్రి బొత్స
-
ఇప్పటికే 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం: సీఎం జగన్
-
ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనేదే మా సంకల్పం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లు(ఎంఐజీ)’లకు ప్రభత్వం శ్రీకారం చుట్టింది. జగనన్న స్మార్ట్ టౌన్‌షిలకు సంబంధించిన లేఅవుట్లు, వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇప్పటికే 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని అన్నారు. ప్రతీ పేదవాడికి సొంతిల్లు ఉండాలని ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఇప్పటికే పేదల ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయని అన్నారు. మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేరనుందని సీఎం జగన్ పేర్కొన్నారు. 150, 200, 240 చదరపు గజాల ప్లాట్లు ఎంచుకునే అవకాశం ఉందని తెలిపారు. తొలిదశలో ధర్మవరం, మంగళగిరి, రాయచోటి, కందుకూరు, కావలి, ఏలూరులో ప్లాట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో జగనన్న టౌన్‌షిప్‌లు ఏర్పాటు సిద్ధం కానున్నాయని సీఎం తెలిపారు. తొలి విడతలో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరు, అనంతపురం జిల్లా ధర్మవరం, ప్రకాశం జిల్లా కందుకూరు, వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి, నెల్లూరు జిల్లాలోని కావలి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వద్ద లేఅవుట్లు సిద్ధం చేశారు. అన్ని అనుమతులు, వసతులతో డిమాండ్‌కు అనుగుణంగా 150, 200, 240 చదరపు గజాల ప్లాట్లను సిద్ధం చేశారు. రూ.18 లక్షలకంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారికి మాత్రమే ఇళ్ల స్థలాల కేటాయింపు జరుగుతుందని సీఎం జగన్ తెలిపారు. https://migapdtcp.ap.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. అన్ని చోట్లా పట్టణ ప్రణాళికా విభాగం నియమాల మేరకు లేఅవుట్లు సిద్ధం చేశామని సీఎం అన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లు, ధరలో 20 శాతం తగ్గింపు ఉంటుందని పేర్కొన్నారు. వెబ్సైట్ ద్వారా నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుందని సీఎం జగన్ తెలిపారు. అత్యంత పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. ప్లాట్ల ధరను నాలుగు వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, నాణ్యమైన మౌలిక సదుపాయాలు ఉంటాయని సీఎం చెప్పారు. వాణిజ్య సముదాయాలు, బ్యాంకులకు స్థలాల కేటాయింపు ఉంటుందని సీఎం జగన్ చెప్పారు. తక్కువ ధరకే అన్ని వసతులతో ప్లాట్లు.. మొదటి విడతలో 3,894 ప్లాట్లను అన్ని వసతులతో సిద్ధం చేశారు. మార్కెట్ ధరకంటే ఈ ప్లాట్ల ధరలు తక్కువగానే నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. వీటికి మంగళవారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మొత్తం ప్లాట్లు, చదరపు గజం ధర ఇలా.. లే అవుట్ల ప్రత్యేకతలు.. న్యాయపరమైన సమస్యలు లేని స్పష్టమైన టైటిల్ డీడ్‌తో ప్రభుత్వమే వేస్తున్న ఈ లే అవుట్లకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. పూర్తి పర్యావరణ హితంగా మొత్తం లే అవుట్లో 50 శాతం స్థలాన్ని మౌలిక వసతులు, సామాజిక అవసరాలకు కేటాయించారు. విశాలమైన 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, కలర్ టైల్స్‌తో ఫుట్‌పాత్‌లు, ఎవెన్యూ ప్లాంటేషన్, తాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, వరద నీటి డ్రెయిన్లు, పూర్తి విద్యుదీకరణ, వీధి దీపాలు వంటి వసతులు కల్పిస్తున్నారు. పార్కులు, ఆట స్థలాలు, సామాజిక భవనాలు, ఆరోగ్య కేంద్రం, వాణిజ్య సముదాయం, బ్యాంకుతో పాటు ఇతర సామాజిక అవసరాల మేరకు ప్రత్యేక స్థలాలు కేటాయిస్తున్నారు. లేఅవుట్ నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్, పట్టణాభివృద్ధి సంస్థల సంయుక్త నిర్వహణలో అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేసే ఏర్పాట్లు చేశారు. భవిష్యత్తులో ఆ ప్రాంతంలో ఎలాంటి వసతులు, అవసరాల కోసమైనా ప్రభుత్వంపై ఆధారపడకుండా ఉండేందుకు ఈ నిధులు వెచ్చించవచ్చు. -
నేడు జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రారంభం
-
మిడిల్ క్లాస్‌కు గుడ్ న్యూస్, సంక్రాంతికి జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లు
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంతాల్లోని మధ్య తరగతి ఆదాయ వర్గాల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న జగనన్న స్మార్ట్ టౌన్షిప్(ఎంఐజీ) లేఅవుట్ల పనులు ప్రారంభమయ్యాయి. మార్కెట్ ధర కంటే తక్కువకు ప్లాట్లను అందించాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ అధికారులు లే అవుట్లను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలోని ధర్మవరం, ప్రకాశం జిల్లాలోని కందుకూరు, వైఎస్సార్ కడప జిల్లాలోని రాయచోటి, నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణాల్లో లే అవుట్లను వేసి, డిమాండ్‌కు అనుగుణంగా 150, 200, 240 చదరపు గజాల్లో అన్ని వసతులతో ప్లాట్లను సిద్ధం చేశారు. వీటితో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కర్నూలు, గుంటూరు, ఏలూరు అర్బన్ అథారిటీ పరిధిలో మరికొన్ని లే అవుట్లను సిద్ధం చేస్తున్నారు. ఇవి వివిధ దశల్లో ఉన్నట్టు ఎంఐజీ ప్రాజెక్టు ఎండీ పి.బసంత్ కుమార్ సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. తొలివిడతలో వీటన్నింటినీ సిద్ధం చేసి..సంక్రాంతి నాటికి ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. అంతకు ముందే ప్లాట్ల బుకింగ్‌కు అనుగుణంగా ఆన్లైన్ పోర్టల్‌ను కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అర్బన్ అథారిటీ పరిధిలో.. ► జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రాజెక్టులకు సంబంధించి సాధ్యమైనంత వరకు ప్రభుత్వ భూముల్లోనే లే అవుట్లు వేస్తున్నారు. అందుకోసం ఆయా జిల్లాల్లోని అర్బన్ అథారిటీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను తీసుకుంటున్నారు. ►ఒక లే అవుట్ వేసేందుకు ఒకేచోట 50 లేదా అంతకంటే ఎక్కువ ఎకరాల భూమి ఉన్నచోట ప్లాట్లు వేసేందుకు అనువుగా ఉంటుందన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ధర్మవరం, కందుకూరు, రాయచోటి, కావలిలో వేగంగా ప్లాట్లు సిద్ధమయ్యాయి. ►ప్రభుత్వ భూములు అందుబాటులో లేనిచోట ప్రభుత్వ పరిశ్రమలకు చెందిన భూములను తీసుకుని, అందుకయ్యే వ్యయాన్ని ఆయా పరిశ్రమలకు చెల్లించనున్నారు. అవసరమైన చోట ప్రైవేటు భూములను సైతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం జీఓ నంబర్ 76 నిబంధనలకు లోబడి తీసుకుంటారు. వాటికి ఒప్పందం కుదిరిన వెంటనే నగదు చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. వచ్చే నెలాఖరుకు మరికొన్ని ప్రాంతాల్లో.. ►మధ్యాదాయ వర్గాలకు ఉద్దేశించిన ప్లాట్లకు ప్రజల్లో బాగా డిమాండ్ ఉండడంతో ప్రాజెక్టులను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని అధికారులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సమీపంలో 150 ఎకరాలు, విజయనగరం జిల్లా డెంకాడ, బొండపల్లి వద్ద 40 ఎకరాలు, విశాఖ జిల్లా పాలవలస వద్ద 93 ఎకరాలు, జీఎస్ అగ్రహారం, రామవరంలో 269 ఎకరాల్లో జనవరి చివరి నాటికి ప్లాట్లు సిద్ధం కానున్నాయి. ►కృష్ణా, గుంటూరు జిల్లాల్లో, ఏలూరు సమీపంలో అధికారులు భూములను పరిశీలించి అంచనాలు రూపొందించారు. కాగా, ఇప్పటికే సేకరించిన భూముల్లో జనవరి చివరి నాటికి రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ అనుమతితో ప్లాట్లు సిద్ధం చేయనున్నారు. ► సేకరించిన భూముల్లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 50% భూమిని అన్ని రకాల మౌలిక వసతులకు కేటాయించి, మిగిలిన స్థలంలో మాత్రమే ప్లాట్లు వేస్తున్నారు. ఈ ప్లాట్లు వేయడానికి అయిన ఖర్చు మేరకే ప్రజలకు అందించనున్నారు. -
Andhra Pradesh: ఇంటిపై సంపూర్ణ హక్కు
ఇళ్ల పట్టాల పంపిణీపై కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసులపై దృష్టి పెట్టాలి. గత వీడియో కాన్ఫరెన్స్ నాటికి 834 కేసులు ఉంటే.. ఇవాళ్టికి ఆ సంఖ్య 758కి తగ్గింది. తద్వారా 8 వేల మందికి మేలు జరిగింది. పెండింగ్‌లో ఉన్న మిగతా కేసుల పరిష్కారంపై కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది, ప్రభుత్వ తరఫు న్యాయవాదులు దృష్టి పెట్టాలి. ఏజీతో నేను రెగ్యులర్‌గా మాట్లాడుతున్నాను. దేవుడి దయవల్ల నెల రోజుల్లో ఈ కేసులన్నీ పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాను. పెండింగ్ కేసుల్లో 395 కేసులపై తాత్కాలిక స్టేలు ఉన్నాయి. వీటిపై కూడా దృష్టి పెడితే, పేదలకు మేలు జరుగుతుంది. సాక్షి, అమరావతి: డిసెంబర్ 21న జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఈ పథకం వల్ల దాదాపు 67 లక్షల మంది పేదలకు మేలు జరుగుతుందని తెలిపారు. ఇళ్లు, స్థలాలు అమ్ముకోవాలన్నా అమ్ముకోలేని పరిస్థితి ఉందని, కనీసం రుణాలు తెచ్చుకోలేని పరిస్థితి కూడా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే 1980 నుంచి 2011 వరకు ఉన్న అన్ని ఇళ్లు, ఇంటి స్థలాలను విడిపించుకునేలా వన్‌టైమ్ సెటిల్మెంట్ అవకాశం ఇస్తున్నామని చెప్పారు. ఆ ఆస్తులపై వారికి పూర్తి హక్కులు వస్తాయని, బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకోవచ్చని, తద్వారా పేదలకు చాలా మంచి జరుగుతుందన్నారు. ఈ పథకంలో రిజిస్ట్రేషన్ పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా డిసెంబర్లో చేయాలని అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జగనన్న సంపూర్ణ గృహ హక్కు, పేదల ఇళ్ల నిర్మాణం, టిడ్కో ఇళ్లు, జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్‌పై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులకు మార్గ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వన్‌టైం సెటిల్మెంట్ పథకానికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంగా పేరు ఖరారు చేశామన్నారు. ఈ పథకం గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో అమలు అవుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన డేటాను అప్లోడ్ చేసేలా చూడాలని, వచ్చే 90 రోజుల్లో ఈ మేరకు అన్ని పనులూ పూర్తి కావాలని ఆదేశించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్)పై ఇటీవలే మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నామని, దీనిపై అందరికీ అవగాహన కలిగించాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఓటీఎస్ వర్తింపు ఇలా.. ► పట్టా తీసుకున్న వారు, ఇల్లు కట్టుకున్న వారు.. హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకున్న వారికి రూరల్ ప్రాంతంలో రూ.10 వేలు, మునిసిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్లలో రూ.20వేలు చెల్లిస్తే ఓటీఎస్ వర్తిస్తుంది. ► పట్టా ఉండి, ఇల్లు కట్టుకుని, హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకుని... ఎవరికై నా ఇంటిని అమ్మేసి ఉంటే.. రూరల్ ప్రాంతంలో రూ.20 వేలు, మునిసిపాలిటీల్లో రూ.30 వేలు, కార్పొరేషన్లలో రూ.40 వేలు జమ చేసి ఓటీఎస్ కింద లబ్ధి పొందవచ్చు. ► పట్టా మాత్రమే తీసుకుని.. రుణాలు తీసుకోకుండా.. వాళ్లే ఆ స్థలంలో ఉంటే.. ఇలాంటి కేటగిరీ వారికి రూ.10తో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. పట్టా తీసుకున్న వారు ఆ స్థలాన్ని వేరే వారికి అమ్మినప్పుడు.. ఆ స్థలంలో ఇతరులు అక్కడ ఇల్లు కట్టుకుని ఉంటే.. అలాంటి వారికి రూరల్ ప్రాంతంలో రూ.10 వేలు, మునిసిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్లో రూ.20 వేలు జమచేస్తే వారికి ఈ పథకం వర్తిస్తుంది. లే–అవుట్లు, ప్లాట్ల వారీగా లబ్ధిదారులు మ్యాపింగ్ ► లే అవుట్లు, ప్లాట్ల వారీగా లబ్ధిదారుల వివరాలను తెలియజేస్తూ మ్యాపింగ్ చేశాం. మనం తయారు చేసిన యాప్‌లో ఈ వివరాలన్నింటినీ ఉంచాలి. లే అవుట్ల వారీగా వివరాలు తెలియజేయాలి. దీనివల్ల మిగిలిన ప్లాట్లను కొత్త లబ్ధిదారులకు కేటాయించడానికి వీలు కలుగుతుంది. ► మిగిలిపోయిన 12.6 శాతం మ్యాపింగ్ పనులను కలెక్టర్లు వెంటనే పూర్తి చేయాలి. విజయనగరం, తూర్పుగోదావరి, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు దీనిపై దృష్టి పెట్టాలి. జూన్–డిసెంబర్లో మంజూరు ► పెన్షన్లు, రేషన్‌కార్డులు, ఇళ్ల పట్టాలతో పాటు మనం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి మిస్ అయిన వారిపై దృష్టి పెట్టాలి. వీరందరికీ ప్రతి ఏడాది జూన్, డిసెంబర్లో ఆ ప్రయోజనాలందిస్తాం. ఈలోగా వెరిఫికేషన్లు పూర్తి చేయాలి. ► ఇళ్ల పట్టాల కోసం పెట్టుకున్న దరఖాస్తుల్లో పెండింగులో ఉన్న వాటి వెరిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలి. వీరికి ఇదివరకే ఉన్న లే అవుట్లలో 45,600 మందికి, ప్రభుత్వ లే అవుట్లలో 10,851 మందికి డిసెంబర్లో పట్టాలు అందించాలి. 1,48,398 మందికి పట్టాలు ఇవ్వడానికి కొత్తగా భూసేకరణ చేయాల్సి ఉంది. తాజాగా విడుదల చేసిన జీవోపై దృష్టి పెట్టండి. ► భూ బదిలీ ద్వారా భూములను సేకరించడంపై దృష్టి పెట్టండి. ఇళ్ల పట్టాలకు అవసరమైన భూమిని వారి దగ్గర తీసుకోవడం, దానికి బదులుగా వేరేచోట ప్రభుత్వ భూమి ఇవ్వగలగడంపై దృష్టి పెట్టాలి. అక్టోబర్ 25కు బేస్‌మెంట్‌లెవల్ పైకి వచ్చేలా చర్యలు ► పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా మొదటి విడతలో 15.6 లక్షల ఇళ్లు కడుతున్నాం. ఇప్పటి వరకు 10.31 లక్షల ఇళ్లు గ్రౌండ్ అయ్యాయి. అక్టోబర్ 25 నాటికల్లా బేస్మెంట్ లెవల్ పైకి తీసుకువచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ► చిత్తూరు, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో ఇళ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆయా కలెక్టర్లకు అభినందనలు. మిగిలిన జిల్లాల కలెక్టర్లు కూడా దృష్టి పెట్టాలి. ఇటుకల తయారీ ► వెయ్యి ప్లాట్ల కన్నా ఎక్కువ ఉన్న చోట... అక్కడే ఇటుకల తయారీని ప్రారంభించాలి. దీనివల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయి. సిమెంటు సబ్సిడీ రేటుపై ఇస్తున్నాం. ఇసుకను ఉచితంగా ఇస్తున్నాం. రీచ్ 40 కి.మీ కన్నా ఎక్కువ దూరం ఉంటే.. మనమే రవాణా ఖర్చులు భరిస్తున్నాం. ► ఇళ్ల నిర్మాణం వల్ల మెటల్ ధరలు పెరగకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే. ధరలను నియంత్రణలో ఉంచితే అనుకున్న ఖర్చుకే ఇళ్లు కట్టవచ్చు. ఆప్షన్ –3 ఎంచుకున్న ప్రాంతాల్లో 1.75 లక్షలకే ఇంటి నిర్మాణం పూర్తవుతుందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. ► ఇళ్ల లబ్ధిదారులైన మహిళలకు రూ.35 వేలు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చేలా మాట్లాడుతున్నాం. బ్యాంకర్లతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని వారికి రుణాలు అందించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. లే అవుట్లు సందర్శించాలి ► కలెక్టర్లు వారానికి ఒకసారి ఇళ్ల నిర్మాణంపై సంబంధిత శాఖలతో కలిసి సమీక్ష చేయాలి. మునిసిపాలిటీ స్థాయిలో, మండలాల స్థాయిలో, పంచాయతీల స్థాయిలో, లే అవుట్ స్థాయిల్లో కూడా సంబంధిత అధికారులు ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సమీక్ష చేయాలి. అప్పుడే ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెరుగుతుంది. ► కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లు ప్రతి వారం ఒక లే అవుట్‌ను పర్యవేక్షించాలి. జాయింట్ కలెక్టర్ హౌసింగ్, సబ్ కలెక్టర్, ఆర్డీఓలు ప్రతి వారంలో నాలుగు సార్లు లే అవుట్లలో క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలి. అప్పుడే సమస్యలు ఏంటో తెలుస్తాయి. ► పెద్ద లే అవుట్లలో నిర్మాణ సామగ్రిని ఉంచడానికి, సైట్ ఆఫీసుల కోసం ఉపాధి హామీ పనుల కింద గోడౌన్లను నిర్మించాలి. లబ్ధిదారులతో గ్రూపుల ఏర్పాటు ► ఆప్షన్–3ని ఎంపిక చేసుకున్న వారి ఇళ్ల పనులు అక్టోబర్ 25 నుంచి మొదలు పెట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. లబ్ధిదారులతో కలిపి గ్రూపులు ఏర్పాటు చేయాలి. స్థానికంగా ఉన్న మేస్త్రీలతో వీరిని అటాచ్ చేయాలి. ► ఇప్పటికే 2.25 లక్షల లబ్ధిదారులతో 18,483 గ్రూపులు ఏర్పాటు చేశారు. ఈ నెలాఖరు కల్లా గ్రూపుల ఏర్పాటు పూర్తి కావాలి. లే అవుట్లలో నీటి వసతిని ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టాలి. మిగిలిపోయిన లే అవుట్లలో విద్యుత్తు, నీటి వసతిని కల్పించడంపై దృష్టి పెట్టాలి. ► సిమెంటు, బ్రిక్స్, ఐరన్, మెటల్.. వీటి వినియోగం విపరీతంగా పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుంది. కోవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న పరిస్థితుల్లో ఇళ్ల నిర్మాణం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్‌పై 3.79 లక్షల మంది ఆసక్తి ► టిడ్కో ఇళ్లకు సంబంధించి కొత్త లబ్ధిదారుల ఎంపిక పూర్తి కావాలి. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్‌లో ఎంఐజీ ప్లాట్లకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలి. 3.79 లక్షల మంది వీటిపై ఆసక్తి చూపారు. అధికారులు ఇప్పటి దాకా 1,001 ఎకరాలను గుర్తించారు. మరో 812 ఎకరాలకు సంబంధించి వెరిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలి. ► మార్గదర్శకాలకు అనుగుణంగా భూములను వెంటనే గుర్తించాలి. రెగ్యులర్‌గా దీనిపై సమీక్ష చేయాలి. అవసరమైన చోట భూసేకరణ, లేదా ల్యాండ్ పూలింగ్ చేయాలి. ప్రభుత్వ భూములను కూడా ఈ పథకం కోసం గుర్తించాలి. మంచి ప్రాంతాల్లో భూములు ఉండేలా చూసుకోవాలి. ► అప్పుడే న్యాయ వివాదాల్లేకుండా, క్లియర్ టైటిల్‌తో సరసమైన ధరలకే మధ్యతరగతి ప్రజలకు ప్లాట్లు అందుబాటులోకి వస్తాయి. అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఈ లే అవుట్లలో ఏర్పాటు చేస్తున్నాం. అండర్ గ్రౌండ్ కేబుల్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్మార్ట్ స్ట్రీట్ లైట్లు తదితర మౌలిక సదుపాయాలతో, మంచి ప్రమాణాలతో లే అవుట్లు వారికి అందుబాటులోకి వస్తాయి. తద్వారా చాలా మందికి ప్రయోజనం ఉంటుంది. -
దశమి నాటికి స్మార్ట్ టౌన్‌షిప్‌లపై కార్యాచరణ
సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లోని మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో ఇళ్ల స్థలాలు సమకూర్చే ‘జగనన్న స్మార్ట్ టౌన్షిప్’ (మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లేఅవుట్ల) నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 150, 200, 240 చదరపు గజాలుగా మూడు కేటగిరీల్లో ప్లాట్లను మధ్య తరగతి కుటుంబాలకు ప్రభుత్వమే సమకూరుస్తుంది. వీటికి మధ్య తరగతి కుటుంబాల నుంచి ఏ మేరకు డిమాండ్ ఉందో తెలుసుకునేందుకు సర్వే నిర్వహించగా.. 3.94 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అనువైన భూములను గుర్తించి మునిసిపల్ శాఖకు అప్పగించాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. కొనసాగుతున్న గుర్తింపు ప్రభుత్వ సంస్థలు, శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థలు, నగర, పురపాలక సంస్థలు ప్రజోపయోగం కోసం గతంలో సేకరించి ఉపయోగించని భూముల్లో ఎంఐజీ లేఅవుట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 124 నగర, పురపాలికలు, నగర పంచాయతీల పరిధిలో భూముల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకూ 4 వేల ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించారు. లేఅవుట్ల ఏర్పాటు, లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను జిల్లా స్థాయి కమిటీలే చేపడతాయి. స్మార్ట్ టౌన్‌షిప్‌ల పథకం కార్యాచరణ, అమలు తేదీలను విజయ దశమి నాటికి ప్రకటించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో విజయదశమి నాటికి కార్యాచరణ ప్రకటించడానికి అధికారులు సిద్ధం అవుతున్నారు. అన్ని వసతులు ఈ లేఅవుట్లలో 60 అడుగుల బీటీ, 40 అడుగుల సీసీ రోడ్లతో పాటు ఫుట్ పాత్‌లు, నీటి నిల్వ, సరఫరాకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, ఎలక్ట్రికల్, కేబుల్, వీధి లైట్లు, పార్క్‌లు, గ్రీనరీ మొదలైన అన్ని వసతులు కల్పిస్తారు. -
Andhra Pradesh: ఇళ్లకు సుముహూర్తం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పేదలకు పెద్ద ఎత్తున ఇంటి పట్టాలు అందచేయడంతోపాటు గృహాలను కూడా నిర్మించి ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలని మూడో ఆప్షన్ కింద కోరుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ పనులను అక్టోబర్ 25వతేదీ నుంచి ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈలోగా అందుకు అవసరమైన సన్నాహాలను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కొత్తగా అర్హులైన పేదలకూ ఇళ్ల పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ ద్వారా పట్టణాలు, నగరాల్లో మధ్య తరగతి ప్రజలకు లాభాపేక్ష లేకుండా సరసమైన ధరలకే ఇళ్ల స్థలాలు (ప్లాట్లు) ఇచ్చేందుకు అవసరమైన భూములను గుర్తించడంతోపాటు సమీకరణ పూర్తి చేసి విజయదశమి నాటికి కార్యాచరణ సిద్ధం చేసి అమలు తేదీని ప్రకటించాలని సీఎం ఆదేశించారు. పేదల ఇళ్ల నిర్మాణాలు, వైఎస్సార్ జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాల మంజూరు, ఎంఐజీ లే అవుట్లు తదితరాలపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. చదవండి: Andhra Pradesh: వెనకబాటు నుంచి వెన్నెముకగా..! లబ్ధిదారులకు నాణ్యమైన సామగ్రి పేదల ఇళ్ల నిర్మాణ సామగ్రిని సమకూర్చడంలో నాణ్యతా ప్రమాదదణాలు తప్పకుండా పాటించాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. విద్యుదీకరణకు కూడా నాణ్యమైన సామగ్రిని అందుబాటులో ఉంచాలని సూచించారు. గ్రూపుల ఏర్పాటు ఆప్షన్ 3 కింద ప్రభుత్వమే గృహాలను నిర్మించి ఇవ్వాలని కోరుకున్న లబ్ధిదారులకు ఇళ్లు కట్టించి ఇచ్చే పనులు అక్టోబరు 25 నుంచి ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్న చోట లబ్ధిదారులతో కలిసి గ్రూపులు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పేదల కాలనీల్లో ఇంటర్నెట్ పేదల కోసం నిర్మిస్తున్న వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉండాలని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి డీపీఆర్‌లు సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు. పేదల ఇళ్ల నిర్మాణాలు, వైఎస్సార్ జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాల మంజూరు, ఎంఐజీ లే అవుట్లు తదితరాలపై క్యాంప్ కార్యాలయంలో సమీక్షిస్తున్న సీఎం వైఎస్ జగన్ కొత్తగా అర్హులైన పేదలకూ ఇళ్ల పట్టాలు కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన పేదలకు 90 రోజుల్లోగా ఇళ్ల పట్టాలపై కూడా ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఆగస్టు 22 వరకు ఇళ్ల పట్టాల కోసం కొత్తగా 3,55,495 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 1,99,201 అర్హత ఉన్నవని అధికారులు పేర్కొన్నారు. మరో 9,216 దరఖాస్తులు వెరిఫికేషన్ కోసం పెండింగ్‌లో ఉన్నట్లు వివరించారు. అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. చదవండి: త్వరలోనే థర్డ్ వేవ్! మధ్య తరగతికి ప్లాట్లపై దసరాకు కార్యాచరణ లాభాపేక్ష లేకుండా పట్టణాలు, నగరాల్లో మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకే జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్‌లో ప్లాట్లు ఇచ్చే పథకంపై కూడా ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. దాదాపు 3.94 లక్షల ప్లాట్లకు డిమాండ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. 150, 200, 250 చదరపు గజాల విస్తీర్ణంలో ప్లాట్ల కోసం వివిధ రకాల భూములను గుర్తించి సమీకరణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విజయదశమి నాటికి కార్యాచరణ సిద్ధం చేసి అమలు తేదీలను ప్రకటించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. టిడ్కో ఇళ్లపైనా సీఎం సమీక్ష ఫేజ్ –1లో భాగంగా 85,888 టిడ్కో ఇళ్ల పనులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కాలనీల్లో మౌలిక వసతుల పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు చెప్పారు. డిసెంబర్ 2021 నాటి కల్లా ఈ ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామన్నారు. ఫేజ్ –2 ఇళ్లు జూన్ 2022 నాటికి, ఫేజ్ –3 ఇళ్లు డిసెంబర్ 2022 నాటికి పూర్తవుతాయని అధికారులు పేర్కొన్నారు. నిర్దేశిత సమయంలోగా ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామన్నారు. రివర్స్ టెండర్లతో నిర్మాణ సామగ్రిలో భారీగా ఆదా తొలి దశ పేదల ఇళ్లకు సంబంధించి నిర్మాణ సామగ్రికి రివర్స్ టెండర్లు నిర్వహించడం ద్వారా రూ.5,120 కోట్లు ఆదా చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఒక్కో ఇంటి నిర్మాణ సామగ్రిలో దాదాపుగా రూ.32 వేల చొప్పున ఆదా అయిందని తెలిపారు. లబ్ధిదారుల కోరిక మేరకే వారికి నిర్మాణ సామగ్రిని పంపిణీ చేస్తున్నామని, దీనికోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించామని చెప్పారు. ప్రజాప్రతినిధుల నుంచి ఫీడ్ బ్యాక్ వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులు, ఇతరత్రా అంశాలపై ముఖ్యమంత్రి ఆదేశించిన విధంగా స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిర్మించనున్న ఇళ్ల మ్యాపింగ్, రిజిస్ట్రేషన్, జాబ్‌కార్డుల జారీ, జియో ట్యాగింగ్ దాదాపుగా పూర్తైందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా కాలనీల్లో 80 శాతానికిపైగా ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని అధికారులు వెల్లడించారు. ప్రతి నగరం, మున్సిపాలిటీ వాటర్ ప్లస్ స్థాయికి చేరాలి రాష్ట్రంలోని మూడు పెద్ద నగరాలైన విజయవాడ, విశాఖ, తిరుపతి మురుగునీరు, వ్యర్థ జలాలను నిర్దేశిత ప్రమాణాల మేరకు శుద్ధి చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వాటర్ ప్లస్ సర్టిఫికెట్లు సాధించడంపై అధికారులను ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. ఉత్తమ తాగునీటి సరఫరా విధానాలు, మురుగునీటి నిర్వహణపై మార్గదర్శకాలను కలెక్టర్లు, కమిషనర్లకు పంపాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీలలో ఇవి అమలయ్యేలా చూడాలని, తద్వారా పట్టణాలు ఉన్నత ప్రమాణాల దిశగా అడుగులు వేయాలన్నారు. ప్రతి నగరం, మున్సిపాల్టీ సర్టిఫికెట్ పొందిన నగరాల స్ధాయిని చేరుకునేలా కృషి చేయాలని సూచించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఏపీ టిడ్కో ఎండీ శ్రీధర్, గృహ నిర్మాణశాఖ కార్యదర్శి రాహుల్ పాండే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ నారాయణ భరత్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ‘వాటర్ ప్లస్’ నగరాల్లో విజయవాడ, విశాఖ, తిరుపతి – దేశవ్యాప్తంగా 9 నగరాల ఎంపిక స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్‌లో భాగంగా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ అందించే వాటర్ ప్లస్ సర్టిఫికేషన్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు నగరాలకు చోటు లభించింది. దేశవ్యాప్తంగా కేవలం 9 నగరాలు మాత్రమే వాటర్‌ప్లస్ సర్టిఫికెట్ పొందగా అందులో 3 నగరాలు రాష్ట్రం నుంచి అర్హత సాధించినట్లు సీఎం నిర్వహించిన సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లు వాటర్ ప్లస్ సర్టిఫికెట్ పొందాయని చెప్పారు. ఇళ్లు, వాణిజ్య సముదాయాల నుంచి డ్రైన్లు, నాలాలతో పాటు ఇతర వ్యర్ధ జలాల శుద్ధి, నిర్వహణ, పునర్వినియోగాన్ని నిర్దేశిత ప్రమాణాల మేరకు సమర్ధవంతంగా నిర్వహించే నగరాలకు వాటర్ ప్లస్ సర్టిఫికెట్‌ను కేంద్ర ప్రభుత్వం అందచేస్తోంది. -
జగనన్న ‘స్మార్ట్ టౌన్’కు వేగంగా అడుగులు
మండపేట: పట్టణాల్లోని మధ్యతరగతి వర్గాల సొంతింటి కల సాకారానికి అడుగులు పడుతున్నాయి. తక్కువ ధరకే స్థలం అందించేందుకు ‘జగనన్న స్మార్ట్ టౌన్’కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి తూర్పు గోదావరి జిల్లాలో 41,504 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్కన వారికి స్థలాల పంపిణీకి 3,215 ఎకరాల భూమి అవసరమని అంచనా. కాకినాడలో 1,284 ఎకరాలు పరిశీలిస్తున్నారు. మిగిలిన పట్టణాల్లో 1,931 ఎకరాల సేకరణకు రూ.2,128 కోట్ల వరకూ వ్యయమవుతుందని అంచనా. పట్టణాల్లో సెంటు భూమి కొనాలన్నా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ పలుకుతోంది. ఈ పరిస్థితుల్లో సొంతింటిపై ఆశలు వదులుకున్న మధ్య తరగతి వర్గాల వారికి ‘జగనన్న స్మార్ట్ టౌన్’ పథకం కొత్త ఉత్సాహం కలిగించింది. మధ్యతరగతి వర్గాలపై భారం పడకుండా సొంతిల్లు సమకూరేలా ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. పట్టణం సమీపంలో భూములు సేకరించి మార్కెట్ ధర కంటే తక్కువకు స్థలాలు అందజేయాలని నిర్ణయించింది. ఈ స్థలాల్లో మౌలిక వసతులు కల్పించనుంది. రూ.3 లక్షల నుంచి రూ.18 లక్షల వరకూ ఆదాయం కలిగిన వారందరూ ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వ ఉద్యోగులకూ అవకాశం కలి్పంచింది. లబి్ధదారుల వార్షికాదాయం మేరకు మూడు, నాలుగు, ఐదు సెంట్ల చొప్పున కేటగిరీలుగా స్థలాలు పొందేందుకు రెండు నెలల క్రితం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలోని రెండు నగరపాలక సంస్థలు, ఏడు మున్సిపాలీ్టలు, మూడు నగర పంచాయతీల పరిధిలో 41,504 మంది దరఖాస్తు చేసుకున్నారు. సిద్ధమైన ప్రతిపాదనలు ఆయా కేటగిరీల్లో వచ్చిన దరఖాస్తుల ప్రకారం ఈ పథకానికి జిల్లాలో 3,215 ఎకరాల భూమి అవసరమవుతుందని అధికారులు గుర్తించారు. కాకినాడ కార్పొరేషన్ పరిధిలో 1,284 ఎకరాలు అవసరమవుతుండగా స్థల పరిశీలన బాధ్యతలను రెవెన్యూ అధికారులకు అప్పగించారు. మిగిలిన పట్టణాల్లో ఇప్పటికే పలు స్థలాలను పరిశీలించిన అధికారులు అక్కడి ధరల వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మున్సిపాలిటీలో ఎకరం భూ సేకరణకు రూ.కోటి నుంచి రూ.1.5 కోట్ల వరకూ అవుతుందని అంచనా. స్థల సేకరణ జరగాలి ఎంఐజీ స్కీంకు జిల్లాలో మూడు కేటగిరీల్లో 41,504 దరఖాస్తులు వచ్చాయి. స్థల పంపిణీకి దాదాపు 3,215 ఎకరాల వరకూ అవసరమవుతుందని ఇప్పటికే టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించారు. స్థల సేకరణ ప్రక్రియ జరగాల్సి ఉంది. - రంగనాయకులు, మున్సిపల్ ఆర్డి, రాజమహేంద్రవరం