
సాక్షి, అమరావతి: అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై రాష్ట్ర హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ముగ్గురు సభ్యుల ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్లను విచారించింది. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే, కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం పది రోజుల గడువు కోరగా కోర్టు అంగీకరించింది. తదుపరి విచారణ ఆగస్టు 14కు వాయిదా వేసిన హైకోర్టు.. ఆగస్టు 14వరకు యథాతధ స్థితి ఉండాలని స్పష్టం చేసింది.
(నాలుగు ముక్కలతో ‘పిల్’లా?)
Comments
Please login to add a commentAdd a comment