
సాక్షి, విశాఖపట్నం: విశాఖకు త్వరలోనే ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం విశాఖలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. '' త్వరలోనే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నుంచి పరిపాలన చేస్తాము.సీఆర్టీఏ కేసుతో రాజధాని తరలింపునకు సంబంధం లేదు. ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పరిపాలన చేయొచ్చు.
విశాఖలోని పంచ గ్రామాల సమస్యపై కోర్టుకు అఫిడవిట్ ఇచ్చాం. కోర్టు అనుమతి మేరకు ఇళ్ల యజమానులకు పట్టాలిస్తాం. సింహాచలం భూముల చుట్టూ ప్రహారీ గోడ నిర్మిస్తాం. ఏలేరు-తాండవ రిజర్వాయర్ అనుసంధానానికి రూ.500 కోట్లు మంజూరు చేయనున్నాం. విశాఖలో ప్రతి వార్డును అభివృద్ధి చేస్తాం'' అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment