
సాక్షి, అమరావతి: కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రకాశం బ్యారేజీ ఎగువన నిర్మించిన అక్రమ కట్టడాలపై మరోసారి సీఆర్‌డీఏ కొరడా ఝుళిపించింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన శైవ క్షేత్రానికి 2014 నుంచి నోటీసులు ఇస్తున్నామని... వాటిపై యజమానులు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో అధికారులు గురువారం అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు శ్రీకారం చుట్టారు. నదీ గర్భంలో నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు ప్రొక్లెయిన్ల సహాయంతో కూల్చి వేస్తున్నారు. త్వరలోనే మిగిలిన కట్టడాలను ఇదే రీతిలో తొలగిస్తామని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment