
సాక్షి, అమరావతి : రాజధాని అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణానికి ప్రాథమికంగా రూ.1,09,023 కోట్ల వ్యయమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ట్రంక్–1, ట్రంక్–2 మౌలిక వసతులతో పాటు ప్రభుత్వ కాంప్లెక్స్ ఇతర సదుపాయాల కల్పనకు ప్రాథమికంగా ఈ మొత్తం అవసరమని ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. అయితే, కేంద్ర ప్రభుత్వానికి రూ.39,937 కోట్లతో సవివరమైన ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమర్పించింది.
రాజధానికి వచ్చే మూడేళ్లలో రూ.39,937 కోట్లు అవసరమని ఆ నివేదికలో పేర్కొంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్, అసెంబ్లీ, హైకోర్టు, రాజ్‌భవన్, ముఖ్యమంత్రి, మంత్రుల బంగ్లాలు.. సచివాలయం, ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయాలకు ఈ మొత్తం అవసరమవుతుందని అంచనా వేసినట్లు డీపీఆర్‌లో పేర్కొంది. వచ్చే మూడేళ్లకు సంబంధించి.. తొలి ఏడాదిలో రూ.10,610 కోట్లు, రెండో ఏడాదిలో రూ.22,578 కోట్లు, మూడో ఏడాదిలో రూ.6,749 కోట్లు అవసరమని నివేదికలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment