ముంబై: భారత నావికాదళం అమ్ములపొదిలోకి మొట్టమొదటి జలాంతర్గామి సంరక్షణ వాహ నం వచ్చి చేరింది. ‘డీప్ సబ్‌మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్ (డీఎస్‌ఆర్వీ)’గా వ్యవహరించే ఈ వాహనం పాడైపోయిన జలాంతర్గామి, అందులోని సిబ్బందిని రక్షించడంతోపాటు రహస్య మిషన్లను సైతం సమర్థవంతంగా నిర్వహించగలదు.
అతి త్వరలోనే ఇలాంటి మరో వాహనం నేవీలో చేరనుందని, అది విశాఖపట్నంలోని నావల్ బేస్ ఆధారంగా పనిచేయనుంది. ఈ రెండు వాహనాలు హిందూ మహాసముద్ర ప్రాంతంతోపాటు అవతల కూడా తన విధులు నిర్వహిస్తాయి. ఐఎన్‌ఎస్ సబర్మతి నౌకపై మోహరించిన ఈ డీఎస్‌ఆర్వీ ముంబై కేంద్రంగా పనిచేయనుంది. దీనిని స్కాట్‌లాండ్‌లోని జేఎఫ్‌డీ సంస్థ తయారు చేసింది.
నేవీ అమ్ములపొదిలోకి డీఎస్‌ఆర్వీ
Published Thu, Dec 13 2018 4:36 AM | Last Updated on Thu, Dec 13 2018 4:36 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment