క్రీడలూ ముఖ్యమే..
క్రీడలూ ముఖ్యమే..
Published Sat, Oct 15 2016 8:48 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM
గుంటూరు పీఠాధిపతి చిన్నాబత్తిని భాగ్యయ్య
గుంటూరు రూరల్: విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు చాలా అవసరమని గుంటూరు పీఠాధిపతి చిన్నాబత్తిని భాగ్యయ్య అన్నారు. మండలంలోని నల్లపాడు గ్రామంలో గల లయోలా పబ్లిక్ స్కూల్‌లో స్విమ్మింగ్ పూల్, ప్రథమ చికిత్స కేంద్రాలను శనివారం ఆయన రిబ్బన్ కట్‌చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థుల కోసం స్విమ్మింగ్ పూల్, ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయటం ఎంతో గొప్ప విషయమన్నారు. కేవలం చదువుతోనే కాకుండా క్రీడల ద్వారా కూడా ఉన్నత స్థానాలకు ఎదగాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాలలో చదువుకునే రోజుల్లో తాను విద్యలో సాధారణ విద్యార్థినేనని, క్రీడల్లో మాత్రం ఫుట్‌బాల్, 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెంలో ఎప్పుడూ అసాధారణ ప్రతిభతో ముందుండేవాడినని తెలిపారు. ఎంసెట్ ద్వారా గుంటూరు మెడికల్ కళాశాలలో సీట్లు పొందిన పాఠశాల పూర్వ విద్యార్థులను, తల్లిదండ్రులను సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల సుపీరియర్ రెవరెండ్ ఫాదర్ అమరరావు, ప్రిన్సిపాల్ రెవరెండ్ ఫాదర్‌ఆంథోని తదితరులు పాల్గొన్నారు.
Advertisement