ముంబై : కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో జనాలు ఇళ్లకే పరిమితం కావడంతో ఎప్పుడు అడవుల్లో కనిపించే జంతువులు జనసంచారంలోకి వచ్చేస్తున్నాయి. రోడ్లపై మనుషులెవరు కనిపించకపోవడంతో ఈ జనాలకు ఏమైయుంటదబ్బా అని బహుశా జంతువులు అనుకొని ఉంటుండొచ్చు. అయినా లాక్‌డౌన్ మనుషులకే కానీ మాకు కాదన్నట్లు అడవుల్లో ఉండాల్సిన జంతువులు జనావాసంలోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న నొయిడాలోని ఒక ప్రాంతంలో ఆహార అన్వేషణకు నీల్‌గాయ్ రోడ్డుమీదకు రావడం, ఉత్తారఖండ్‌లో సాంబార్ డీర్‌లు యదేచ్చగా సంచరిస్తున్న వీడియోలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. తాజాగా ముంబైలోని ఒక అపార్ట్‌మెంట్ జలకాలటలు ఆడుతున్న కోతుల వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబైకి చెందిన తిస్కా చోప్రా అనే అమ్మాయి కోతులు స్విమ్మింగ్ ఫూల్‌లో దిగి ఈత కొడుతున్న వీడియోనూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
'లాక్‌డౌన్ నేపథ్యంలో జనాలు ఇళ్లకే పరిమితమవడంతో జంతువులు యదేచ్చగా తిరుగుతున్నాయి. కోతులు స్విమ్మింగ్ ఫూల్‌లో ఎంజాయ్ చేసిన విధానం చూసి చాలా సంతోషించాను. ఈరోజు ఆ కోతులకు ఒక ప్రత్యేక రోజుగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. నేను మాత్రం కోతుల స్విమ్మింగ్‌ను చూస్తూ ఉండిపోయానంటూ ' క్యాప్షన్ షేర్ చేశారు. అయితే ఆ వీడియోలో మొదట ఒక కోతి బాల్కని నుంచి కిటికి రెయిలింగ్ వద్దకు చేరుకొని అమాతంగా స్విమ్మింగ్ ఫూల్‌లోకి దూకేసి సరదాగా కొద్దిసేపు ఈత కొట్టింది. ఆ తర్వాత అటు ఇటూ కలియతిరుగుతూ ..చివరకు స్విమ్మింగ్ ఫూల్ ఒడ్డుకు చేరుకుని అక్కడ కాసేపు కూర్చొంది. అనంతరం మిగతా కోతులు కూడా స్విమ్మింగ్ ఫూల్‌లోకి దూకి జలకాలాడుతూ ఎంజాయ్ చేశాయి. కాగా ఈ వీడియో షేర్ చేసిన కాసేపటికే లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment