ఓ టీచర్ చేసిన పనికి.. ఊళ్లో ఏకంగా మంచి నీటికి ఇబ్బంది ఏర్పడడంతో పాటు స్కూల్ నల్లా బిల్లు యాజమాన్యానికి దిమ్మ తిరిగిపోయేలా చేసింది. ఇంతకీ అంత బిల్లు ఎందుకు వచ్చిందో తెలుసా? ఎప్పుడూ మంచి నీటి నల్లాలను ఆన్ చేసి ఉంచడం మూలంగా!
స్విమ్మింగ్ పూల్ నిర్వాహణను చూసుకునే ఆ టీచర్.. గతేడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య నిరంతరం మంచి నీటి ట్యాప్‌లను కట్టేయకుండా ఉంచింది. ఆ నీటిని స్విమ్మింగ్‌పూల్‌లోకి మళ్లించింది. తద్వారా నిరంతరం ప్రవాహంతో ఆ పూల్ ఉండిపోగా.. ఇప్పుడు బిల్లు రూపంలో మోత మోగిపోయింది. ఈ విషయం అధికారుల దృష్టికి రావడంతో.. నీటి కొరత ఏర్పడినందుకుగానూ పౌరులకు క్షమాణపణ చెప్పారు. ఇక ఈ బిల్లుకు తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో అధికారులు విస్తుపోయారు.
కరోనా టైంలో ఇన్‌ఫెక్షన్‌లు సోకకుండా ముందు జాగ్రత్త కోసమే తాను స్విమ్మింగ్‌పూల్‌లో మంచి నీటి ప్రవాహాన్ని అలా ఉంచానని, తద్వారా స్టూడెంట్స్ కరోనా బారిన పడకుండా ఉంటారన్న ఆలోచనతోనే ఆ పని చేశానని ఆమె వివరణ ఇచ్చుకుంది. కేవలం రెండు నెలల కాలంలోనే పదులు సంఖ్యలో స్విమ్మింగ్‌పూల్‌లకు సరిపడా నీటిని ఆ టీచరమ్మ వేస్ట్ చేసిందట. సాధారణంగా పూల్స్‌కు సపరేట్‌గా క్లోరిన్, ఫిల్టరింగ్ మెషిన్స్ ఉంటాయి. కానీ, వాటికి బదులుగా మంచి నీటితో ఇలా నింపి పడేసింది ఆమె.
అయితే మధ్యలో కొందరు స్కూల్ సిబ్బంది అది గుర్తించినా.. ఆమె మళ్లీ వెళ్లి ఆ ట్యాప్‌లను ఆన్ చేయడం, నీళ్లు వృథాగా పోవడం జరిగిందన్నమాట. ఈ ఘటన జపాన్ యోకోసుకాలో జరిగింది. బిల్లు 3.5 మిలియన్ యెన్(27,000 డాలర్లు.. మన కరెన్సీలో 20 లక్షల 60 వేల రూపాయలకు పైనే) రాగా.. అందులో సగమైనా కట్టాలంటూ ఆ టీచర్‌కు ఇరిగేషన్ అధికారులు నోటీసులు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment