Deep Dive Dubai Pool, Dubai Unvelis World's Deepest 60 Meter Pool With Aa Underwater City - Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్ ప్రారంభం

Published Fri, Jul 9 2021 5:54 PM | Last Updated on Sat, Jul 10 2021 9:20 AM

Deep Dive Dubai: Worlds Deepest 60 Meter Pool Unveiled in Dubai - Sakshi

మీకు ఈత కొట్టడం అంటే ఇష్టమా.. అయితే ఇప్పుడు మీరు ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్ చేయండి. ఇందులో ఈత కొడితే మాత్రం మీకు పాతాళలోకానికి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. ఈ స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడితే వేరే సరికొత్త లోకంలో అడుగు పెట్టినట్లు అనిపిస్తుంది. ఈ స్విమ్మింగ్ పూల్‌ అడుగు భాగంలో గేమ్స్ ఆడుకోవడానికి, కూర్చొడానికి తగిన ఏర్పాట్లు చేశారు. ‘డీప్‌ డైవ్‌ దుబాయ్‌’ పేరుతో ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్‌ పూల్‌ను దుబాయ్‌ ప్రభుత్వం నిర్మించింది. అంతేగాకుండా ఈ పూల్ గిన్నిస్‌ రికార్డ్‌ సైతం సొంతం చేసుకుంది.

60 మీటర్ల లోతు
నాడ్‌ అల్‌ షెబా ప్రాంతంలో నిర్మితమైన ఈ స్విమ్మింగ్‌పూల్‌ను దుబాయ్‌ యువరాజు హమ్‌దాన్‌ బిన్‌ మొహమ్మద్‌ బుధవారం ప్రారంభించారు. ఈ పూల్ కి సంబంధించిన వీడియోలను మొహమ్మద్‌ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘60 మీటర్ల లోతున్న (196 అడుగులు) ప్రపంచంలో కెల్లా అత్యంత లోతైన పూల్‌ ‘డీప్‌ డైవ్‌ దుబాయ్‌’ మీ కోసం ఎదురుచూస్తోందని’’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో లక్షల కొద్ది వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ పూల్‌లో ఇండోర్ స్కూబా డైవింగ్ సదుపాయంతో పాటు విద్య, వినోదం కోసం ఇతర సౌకర్యాలు కూడా ఉన్నాయి.

ఈ ఇండోర్ పూల్ 1,500 చదరపు మీటర్ల పరిమాణంలో ఓయిస్టర్ ఆకారంలో ఉన్న నిర్మాణం లోపల ఉంది. ఈ పూల్‌ను ముఖ్యంగా డైవింగ్‌లో శిక్షణ తీసుకునే వారికోసం, నీటి లోతట్టు ప్రాంతాల్లో డైవింగ్‌ చేసే ఆసక్తి కలిగిన వాళ్ల కోసం ఏర్పాటు చేసినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. దీనిలో పాడుబడిన నగరం ఆకృతులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ పూల్‌లో ఉన్న అండర్ వాటర్ 56 కెమెరాలు డైవింగ్‌ చేస్తున్న వారిని నిరంతం పర్యవేక్షిస్తుంటాయి. ఇందులోని నీటిని 6 గంటలకు ఒకసారి శుద్ధి చేస్తారు. దీన్ని నింపడానికి 1.4 కోట్ల లీటర్ల నీటిని వినియోగించారు. ఈ నీటి కొలను అడుగున చదరంగం, టేబుల్ ఫుట్ బాల్ కూడా అడుకోవచ్చు. చాలా మంది ఈ పూల్ విషయంలో ఫాంటసీ సినిమాలో పూల్ ఎలా కనిపిస్తుందో అలా ఉంది అని చాలా మంది వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement