
కర్నూలు(హాస్పిటల్): అమెరికాలోని ఈగన్ ప్రాంతంలో స్విమ్మింగ్‌పూల్‌లో మునిగిపోతున్న 34 ఏళ్ల వ్యక్తిని కాపాడిన 11 ఏళ్ల బాలుడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతని సాహసానికి మెచ్చిన అమెరికా పోలీసులు ‘లైఫ్ సేవింగ్ అవార్డు’ కోసం అక్కడి ప్రభుత్వానికి సిఫారసు చేశారు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన రఘు ఎన్. నటరాజ్, లలిత దంపతులు మూడేళ్ల క్రితం వారు ఉద్యోగరీత్యా అమెరికాలోని ఈగన్‌కు వెళ్లి..అక్కడున్న ఆక్వా టాట్స్ ప్రాంతంలోని టౌన్ సెంటర్ అపార్ట్‌మెంట్ హోమ్స్‌లో నివాసం ఉంటున్నారు.
అదే అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న బంధువులను చూసేందుకు డిసెంబర్‌లో శ్రీనివాస ఆర్.ఎల్లావర్తి(34) అనే వ్యక్తి వచ్చాడు. అక్కడే ఉన్న ఇండోర్ స్విమ్మింగ్‌పూల్‌లో గత డిసెంబర్ 31న దూకాడు. ఈత రాక అతను మునిగిపోతుండటాన్ని చూసిన రఘు నటరాజ్ కుమారుడు అద్వైక్ ఎన్. విశ్వామిత్ర(11) స్విమ్మింగ్‌పూల్‌లోకి దూకి 8 అడుగుల లోతులో మునిగిపోయి ఉన్న శ్రీనివాస ఆర్.ఎల్లావర్తిని బయటకు తీసుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment