సమ్మర్ క్యాంపులో అపశ్రుతి
సిమ్మింగ్ పూల్‌లో మునిగి చిన్నారి మృతి
కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు
పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ
మొయినాబాద్: వేసవి సెలవుల్లో సరదాగా గడుపుదామని.. ఆటలో మెలకువలు నేర్చుకుందామని వెళ్లిన చిన్నారి విగతజీవిగా మారాడు. స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి ఒకటో తరగతి చిన్నారి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మొయినాబాద్ మండలం సుజాత స్కూల్‌లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సురంగల్‌కు చెందిన గాండ్ల విక్రమ్ చిన్న కుమారుడు గాండ్ల శివశౌర్య (7) నాగిరెడ్డిగూడ రెవెన్యూ పరిధిలోని సుజాత స్కూల్‌లో ఒకటో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో స్కూల్‌లో సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు క్రికెట్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, యోగాతో పాటు స్విమ్మింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు.
విక్రమ్ తన కుమారుడు శివశౌర్యను బ్యాడ్మింటన్ నేరి్పంచేందుకు క్యాంపులో చేరి్పంచాడు. శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో శివÔౌర్య స్విమ్మింగ్ చేస్తూ నీటిలో మునిగాడు. సిబ్బంది గమనించి విద్యారి్థని బయటకు తీశారు. నీళ్లు మింగి అపస్మారకస్థితిలో ఉండటంతో వెంటనే స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే..
పిల్లలకు, పెద్దలకు వేర్వేరుగా స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. నాలుగు రోజులుగా పిల్లల స్విమ్మింగ్ పూల్ రిపేర్‌లో ఉంది. దీంతో పెద్దల స్విమ్మింగ్ పూల్‌లోనే పిల్లలను స్విమ్మింగ్ చేయిస్తున్నారు. పిల్లలకు సేఫ్టీ బెలూన్స్ లేవని.. అవి తేవాలని కోచర్లు యాజమాన్యానికి సూచించినా వారు పట్టించుకోలేదని తెలిసింది.
గుండెలు బాదుకున్న తల్లిదండ్రులు
సమ్మర్ క్యాంపులో భాగంగా బ్యాడ్మింటన్ శిక్షణకు పంపామని.. స్విమ్మింగ్ చేయిస్తున్నట్లు తమకు తెలియదని చిన్నారి తండ్రి విక్రమ్ రోదించారు. తమ కుమారుడి మరణానికి పాఠశాల యాజమాన్యమే కారణమని వాపోయారు. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment