స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి ప్రమాదవశాత్తు ఓ బాలుడు చనిపోయాడు.
హైదరాబాద్: స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి ప్రమాదవశాత్తు ఓ బాలుడు చనిపోయాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఉప్పర్‌పల్లి హ్యాపీహోమ్స్‌లో జీబీఆర్ స్విమింగ్‌పూల్ ఉంది. శుక్రవారం సాయంత్రం అత్తాపూర్ ఎంఎంపహాడీ ప్రాంతానికి చెందిన హసన్‌అలీ కుమారుడు రిజ్వాన్‌అలీ(12) స్నేహితులతో కలసి ఈత కొట్టేందుకు స్విమింగ్‌పూల్‌కు వచ్చాడు. నీటిలోకి దిగి ఈత కొడుతూనే ఒక్కసారిగా రిజ్వాన్ మునిగిపోయాడు. వెంటనే పైకి తీయడం ఆలస్యం కావడంతో అతడు మృతి చెందాడు. ఈత కొలను వద్ద సరైన ముందు జాగ్రత్తలు లేకపోవడంతో చనిపోయాడా? ఈత రాక మృతిచెందాడా? అన్నది తమ దర్యాప్తులో తేలుతుందని ఎస్సై నారాయణరెడ్డి తెలిపారు.
(అత్తాపూర్)