ఆ స్విమ్మింగ్ పూల్ను మూసేశారు.. | The Olympic Diving Pool is Closed Because of Its Green Water | Sakshi
Sakshi News home page

ఆ స్విమ్మింగ్ పూల్ను మూసేశారు..

Published Sat, Aug 13 2016 1:12 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM

ఆ స్విమ్మింగ్ పూల్ను మూసేశారు..

ఆ స్విమ్మింగ్ పూల్ను మూసేశారు..

రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్లో ఊసరవెల్లిలా రంగులు మార్చుతున్న స్విమ్మింగ్ పూల్ ను మూసేశారు. సాధారణంగా ఈత కొలను అనేది నీలి రంగులో దర్శనమిస్తూ ఉంటుంది. అయితే రియో ఒలింపిక్స్ ఆరంభమయ్యాక మారియా లెంక్  అక్వాటిక్స్ సెంటర్ లోని ఒక స్విమ్మింగ్ పూల్లోని నీళ్లు ఆకుపచ్చ రంగులో మారడం వివాదస్పదమైంది. అయితే దీన్ని తొలుత తేలిగ్గా తీసుకున్న రియో యాజమాన్యం, ఆ తరువాత నీటిలో నాణ్యత లేకపోవడాన్ని గ్రహించి దాన్ని ఎట్టకేలకు మూసి వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం నీళ్లను నీలి రంగులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.


నీటిని శుద్ధిచేయడానికి, స్విమ్మర్లకు ఆరోగ్య సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా కొన్ని రకాల రసాయనాలు అందులో కలపడంతోనే రంగు మారినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  ఆ స్విమ్మింగ్ పూల్ లో పీహెచ్ స్థాయి సమతౌల్యం దెబ్బతినడం వల్లే నీళ్ల రంగులో మార్పు సంభవించి ఉండొచ్చునని వారు విశ్లేషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement