Mahesh Babu Shirtless Photo Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Mahesh Babu : ఆ సినిమా కోసం మహేశ్‌ సిక్స్‌ ప్యాక్‌? ఫోటోతో లీక్‌ చేసిన నమ్రత

Aug 20 2022 12:39 PM | Updated on Aug 20 2022 1:30 PM

Mahesh Babu Shirtless Photo Goes Viral On Social Media - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చారు.గుబురు గడ్డంతో షర్ట్‌ లేకుండా కనిపించి షాక్‌ ఇచ్చారు. ఈ ఫోటోలను స్వయంగా మహేశ్‌ భార్య నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దీంతో ఈ పోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. సాధారణంగా మహేశ్‌ తన బాడీని ఎక్స్ పోజింగ్ చేయరు. సినిమాల్లోనూ షర్ట్‌లేకుండా కనిపించాలని మేకర్స్‌ కోరినా మహేశ్‌ దాన్ని సున్నితంగా తిరస్కరిస్తారు.

చదవండి: మహేశ్‌ సోదరి మంజులకు పిల్లలను కనడం ఇష్టమే లేదట.. కానీ!

ఇలాంటి లుక్‌లోనూ మహేశ్‌ చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఇటీవలి కాలంలో తన లుక్‌పై ఫుల్‌ ఫోకస్‌ పెట్టారు మహేశ్‌. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్‌ దర్శకత్వంలో SSMB28 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం లుక్‌ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న మహేశ్‌ ఇందులో సిక్స్‌ ప్యాక్‌ బాడీతో కనిపించనున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. తాజాగా స్విమ్మింగ్‌ పూల్‌లో మహేశ్‌ షర్ట్‌ లేకుండా కనిపించడంతో ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. 'ఫైనల్లీ.. మహేశ్‌ బాడీని ఫస్ట్‌ టైమ్‌ చూస్తున్నాం' అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. చదవండి: కొంపముంచిన విజయ్‌ కామెంట్స్‌.. ట్రెండింగ్‌లో బాయ్‌కాట్‌ 'లైగర్‌'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement