shirt off
-
షర్ట్ లేకుండా షాకిచ్చిన మహేశ్ బాబు.. క్షణాల్లో ఫోటో వైరల్
సూపర్ స్టార్ మహేశ్ బాబు సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చారు.గుబురు గడ్డంతో షర్ట్ లేకుండా కనిపించి షాక్ ఇచ్చారు. ఈ ఫోటోలను స్వయంగా మహేశ్ భార్య నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఈ పోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. సాధారణంగా మహేశ్ తన బాడీని ఎక్స్ పోజింగ్ చేయరు. సినిమాల్లోనూ షర్ట్‌లేకుండా కనిపించాలని మేకర్స్ కోరినా మహేశ్ దాన్ని సున్నితంగా తిరస్కరిస్తారు. చదవండి: మహేశ్ సోదరి మంజులకు పిల్లలను కనడం ఇష్టమే లేదట.. కానీ! ఇలాంటి లుక్‌లోనూ మహేశ్ చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఇటీవలి కాలంలో తన లుక్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు మహేశ్. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB28 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం లుక్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న మహేశ్ ఇందులో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. తాజాగా స్విమ్మింగ్ పూల్‌లో మహేశ్ షర్ట్ లేకుండా కనిపించడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 'ఫైనల్లీ.. మహేశ్ బాడీని ఫస్ట్ టైమ్ చూస్తున్నాం' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: కొంపముంచిన విజయ్ కామెంట్స్.. ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ 'లైగర్' View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
షర్ట్ ఆఫ్...
టాలీవుడ్ హీరో హర్షవర్ధన్ రాణె... తన యాన్యువల్ ఈవెంట్ ‘షర్ట్ ఆఫ్’ను వినూత్నంగా నిర్వహించాడు. మాదాపూర్‌లోని తన సన్నిహితుని జిమ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తను నటించిన సినిమాల్లో ధరించిన దుస్తులను విక్రయించారు. దీని ద్వారా సేకరించిన లక్షా పది వేల రూపాయల నిధులను దత్తత తీసుకున్న పాప స్వాతి చదువుకు, మరికొందరు అనాథ పిల్లల శ్రేయస్సుకు వినియోగిస్తానని ఈ సందర్భంగా హర్ష చెప్పాడు.