
ఎండల నుంచి ఉపశమనం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. ఏసీలు, కూలర్లు, ఇంటి పైకప్పుపై కూల్ పెయింటింగ్ ఇలా ఒక్కటేమిటి.. ఎండాకాలం రాగానే మనలో ఉన్న ఐడియాలన్నీ బయటకు వస్తుంటాయి. మనలాంటి ఓ అర్కిటెక్చర్‌కు కూడా ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఓ చక్కటి ఇంటి డిజైన్‌ను రూపొందించారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇంటి పైకప్పులో స్విమ్మింగ్ పూల్ ఉండేలా డిజైన్ చేశారు. దీంతో ఎండాకాలంలో ఇంటిలోపల చల్లదనంతో పాటు స్విమ్మింగ్‌పూల్‌లో ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. సముద్రపు ఒడ్డున ఇలాంటి ఇల్లు కట్టుకుంటే.. ఉషోదయ వేళ స్విమ్మింగ్ పూల్‌లో నిలబడి ఉంటే భానుడి వెచ్చటి కిరణాలు శరీరాన్ని స్పృశిస్తూ ఉంటే ఆహా.. ఒళ్లు పులకరించకుండా ఉంటుందా చెప్పండి.
ఈ అనుభూతి దక్కాలంటే ‘సమ్మర్ హౌజ్’ను నిర్మించుకోవాల్సిందే. 85 చదరపు మీటర్ల స్థలంలో ఓ పెద్ద రాయిపై ఈ నిర్మాణం ఉంటుందని, ఇంటిపై ఉన్న స్విమ్మింగ్‌పూల్‌లోకి నేరుగా నీరు చేరేందుకు సముద్రపు నీటిలో అనుసంధానం చేసినట్లు ‘యాంటీ రియాలిటీ’ఆర్కిటెక్చర్ సంస్థ వెల్లడించింది. త్రికోణాకృతిలో ఇల్లు ఉంటుందని, ఇంటిలో హాల్, కిచెన్, బాత్రూం ఉంటాయని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇంటికి ఒకవైపు సముద్ర తీరం ఉంటుందని, ఆ అందాలను వీక్షిస్తూ ప్రకృతి ఒడిలో హాయిగా సేదతీరొచ్చని వివరించారు. ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఊహాత్మకమైన ఇంటి డిజైన్ల యాంటీ రియాలిటీ వద్ద ఉన్నాయట.
Comments
Please login to add a commentAdd a comment