
సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం అక్కిరెడ్డిపాలెంకు చెందిన బాలుడు సింగపూర్‌లో ప్రమాదవశాత్తూ స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతి చెందాడు. వనామాడ శ్రీనివాసరావు సింగపూర్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అక్కడ తన 3 ఏళ్ళ చిన్నకుమారుడు వనామాడ హార్దిక్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ స్విమ్మింగ్ పూల్‌లో జారిపడ్డాడు. తలకు తీవ్రగాయమవ్వడంతో ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. హార్దిక్ పార్థివ దేహాన్ని సోమవారం స్వస్థలానికి బంధువులు తీసుకు వచ్చారు.