
పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. తనను ఇంటర్య్వూ చేయడానికి వచ్చిన యాంకర్‌కు అక్తర్ వార్నింగ్ ఇచ్చాడు. పిచ్చి ప్రశ్నలతో సమయం వృధా చేసింది.. వెంటనే ఆమెను స్విమ్మింగ్‌ఫూల్‌లో పడేయండంటూ పేర్కొన్నాడు. అయితే ఇది నిజమైన వార్నింగ్ అనుకుంటే మీరు పొరబడ్డట్టే. విషయంలోకి వెళితే.. ఇండియన్ టెలివిజన్ యాంకర్ షఫాలీ బగ్గా షోయబ్ అక్తర్‌ను ఫన్నీ ఇంటర్య్వూ చేసింది.
చదవండి: కప్పలా నోరు తెరిచాడు.. ఏమైంది గిల్లీ!
ఈ సందర్భంగా ఆమె.. అక్తర్‌ను తన ఫన్నీ ప్రశ్నలతో నవ్విస్తానని చాలెంజ్ చేసింది. షఫాలీ బగ్గా అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా అక్తర్ నవ్వలేదు. అయితే చివరి ప్రశ్నకు మాత్రం అక్తర్ నవ్వేశాడు. దీంతో యాంకర్ బగ్గా మీరు ఓడిపోయారని ఒప్పుకోండి.. అని అడిగింది. దీనికి అక్తర్ నవ్వుతూ.. ''ప్రొడ్యూసర్! ఆమె ప్రశ్నలయిపోయాయిగా.. స్విమ్మింగ్‌ఫూల్‌లో పడేయండి'' అంటూ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియోనూ షఫాలీ బగ్గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: Mohammad Rizwan: రిజ్వాన్ కెప్టెన్ ఇన్నింగ్స్... ముల్తాన్ సుల్తాన్ ఘన విజయం
Comments
Please login to add a commentAdd a comment