ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ అక్వాటిక్ అసోసియేషన్ (ఏపీఏఏఏ) ఆధ్వర్యంలో ఈ నెల 19న సబ్-జూనియర్ అంతర్ జిల్లా అక్వాటిక్ చాంపియన్‌షిప్ పోటీలు జరుగనున్నాయి.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ అక్వాటిక్ అసోసియేషన్ (ఏపీఏఏఏ) ఆధ్వర్యంలో ఈ నెల 19న సబ్-జూనియర్ అంతర్ జిల్లా అక్వాటిక్ చాంపియన్‌షిప్ పోటీలు జరుగనున్నాయి. సికింద్రాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్‌పూల్‌లో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు ఏపీఏఏఏ కార్యదర్శి పి. మదన్ మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు.
గ్రూప్-3లో 11 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వయస్సు గలవారు, గ్రూప్-4లో 9 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వయస్సున్న బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు. ఇందులో సత్తాచాటిన వారిని వచ్చే నెలలో జరిగే జాతీయ సబ్-జూనియర్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపిక చేస్తారు. ఈ టోర్నీ జూన్ 26 నుంచి 29 వరకు ఇండోర్ (మధ్యప్రదేశ్)లో జరుగనుంది. సెలక్షన్స్‌లో పాల్గొనాలనుకునే వారు మదన్ మోహన్ (9849547360)ను ఫోన్‌లో సంప్రదించవచ్చు.
26న అంతర్ జిల్లా పోటీలు
అంతర్ జిల్లా జూనియర్ అక్వాటిక్ చాంపియన్‌షిప్ కమ్ సెలక్షన్ ట్రయల్స్ ఈ నెల 26న జరుగనుంది. సికింద్రాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్‌పూల్‌లో బాలబాలికల విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తారు. గ్రూప్-1లో 15 ఏళ్ల నుంచి 17 ఏళ్ల వయస్సున్న బాలబాలికలు, గ్రూప్-2లో 13 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వయస్సున్న బాలబాలికలు పాల్గొనేందుకు అర్హులు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని జాతీయ జూనియర్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపిక చేస్తారు. ఈ పోటీలు భోపాల్‌లో జూలై 12 నుంచి 16 వరకు జరుగుతాయి.