
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి సన్నీలియోన్ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. ఉత్తరాఖండ్‌లోని రామ్ నగర్ జిల్లాలో శుక్రవారం ఉదయం పాపులర్ టీవీ రియాల్టీ షో అయిన ఎంటీవీ స్ప్లిట్స్ విల్లే సీజన్-11 షూటింగ్ జరుగుతుంది. ఆ సమయంలో సన్నిలియోన్‌కు హటాత్తుగా కడుపు నొప్పి రావడంతో హూటాహుటినా ఉత్తరాఖండ్ లోని కాషీపూర్ లో ఉన్న బ్రిజేష్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగ ఉందని వైద్యులు వెల్లడించారు. శనివారం ఉదయం ఆమెను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని సన్నీ మేనేజర్ తెలిపారు. షూటింగ్‌లో సన్నీతోపాటు తన కో-హోస్ట్, స్నేహితుడు రాన్విజయ్ సింగ్ సింఘా ఉన్నారు.