మండి బిర్యానీ రూ.వెయ్యి.. ట్రీట్‌మెంట్‌ రూ.లక్ష! | Family Was Hospitalized After Eating Mandi Biryani | Sakshi
Sakshi News home page

మండి బిర్యానీ రూ.వెయ్యి.. ట్రీట్‌మెంట్‌ రూ.లక్ష!

Published Tue, May 28 2024 1:43 PM | Last Updated on Tue, May 28 2024 1:55 PM

Family Was Hospitalized After Eating Mandi Biryani

షాద్‌ నగర్‌ సాయిబాబా హోటల్‌లో దారుణం చోటుచేసుకుంది. మండి బిర్యానీ తిని కుటుంబం ఆసుపత్రి పాలైంది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా: షాద్‌ నగర్‌ సాయిబాబా హోటల్‌లో దారుణం చోటుచేసుకుంది. మండి బిర్యానీ తిని కుటుంబం ఆసుపత్రి పాలైంది. కలుషిత బిర్యానీ తినడంతో వాంతులు, విరోచనాలతో అనారోగ్యానికి గురైయ్యారు. శంషాబాద్‌ ప్రైవేట్‌ ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. కలుషిత ఆహారం తినడం వల్లనే ఫుడ్‌ పాయిజన్‌  అయ్యిందని వైద్యులు చెబుతున్నారు.

ఖమ్మంలో..
ఖమ్మం నగరంలోని కొన్ని ప్రముఖ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేపట్టారు. బైపాస్ రోడ్డులో ఉన్న ఒక హోటల్‌లో వంటకు ఉపయోగించే కొబ్బరి పొడి, నూడుల్స్ వంటి రా మెటీరియల్‌లో కల్తిని గుర్తించారు.వినియోగదారులకు విక్రయించేందుకు తయారు చేసి నిల్వ ఉంచిన పలు చికెన్ కబాబ్‌లో ఫంగస్‌ను గుర్తించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నఇలాంటి హోటల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement