మైదుకూరు: వైఎస్ఆర్ జిల్లాలో అస్వస్థతకు గురైన 50 మంది విద్యార్థులకు విషజ్వరాలు సోకడంతో ఆస్పత్రికి తరలించారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం వనిపెంట ఆశ్రమ హాస్టల్‌కు చెందిన 50 మంది విద్యార్థులు గత కొన్నిరోజులుగా అస్వస్థతతో బాధపడుతున్నారు. దీంతో హాస్టల్ సిబ్బంది విద్యార్థులను ఆస్పత్రికి తరలించగా.. విషజ్వరాలు సోకాయని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులను ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.