ప్రొద్దుటూరు: కలుషితాహారం తిని ఐదుగురు విద్యార్థులు అస్వస్తతకు గురయ్యారు. ఈ సంఘటన శుక్రవారం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం కేంద్రంలోని జరిగింది. వివరాలు.. వైఎస్సార్ యూనివర్సీటీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు గురువారం రాత్రి తిన్న ఆహారం వికటించడంతో కడుపునొప్పి, వాంతులతో 5 మంది విద్యార్థులు అస్వస్తతకు గురయ్యారు. దీంతో వీరిని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు. ప్రస్తుతానికి వీరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు శుక్రవారం తెల్లవారుజామున తెలిపారు.