కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ (73) సోమవారం అర్ధరాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అక్టోబర్ 1 మంగళవారం నాడు ఆయనకు పలు వైద్య పరీక్షలను చేయనున్నారు. ఈ క్రమంలో ఎలెక్టివ్ ప్రొసీజర్ ట్రీట్మెంట్ ఆయనకు అందించనున్నట్లు తెలుస్తోంది. గుండెకు సంబంధించిన పరీక్షలు ఆయనకు చేయనున్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఉదయం 8 గంటలకు హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు. రొటీన్ చెకప్ కోసం అడ్మిట్ అయ్యారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సతీమణి లతా రజనీకాంత్ వెళ్లడించారు.
జైలర్ సినిమా తర్వాత రజనీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అక్టోబర్ 10న దర్శకుడు జ్ఞానవేల్ రాజా తెరకెక్కించిన వేట్టైయన్ విడుదల కానుంది. ఇటీవలే లోకేష్ కనగరాజ్ చిత్రం కూలీ షూటింగ్ షెడ్యూల్ ముగించుకుని రజనీ చెన్నై వచ్చారు. ఇంతలో ఆయన ఆరోగ్యంపై ఇలాంటి వార్తలు రావడంతో అభిమానులు ఆందోళనలో ఉన్నారు. సుమారు పదేళ్ల క్రితం సింగపూర్‌లో రజనీకాంత్ కిడ్నీ మార్పిడి చేయించుకున్న విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: 'హీరోతో విడాకులు.. నన్ను తప్పుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం'
Comments
Please login to add a commentAdd a comment