ఆరుగురు విద్యార్థులకు అస్వస్థత
Published Wed, Sep 13 2017 12:06 PM | Last Updated on Tue, Sep 19 2017 4:30 PM
వికారాబాద్: వికారాబాద్ జిల్లాలోని కులకచర్ల మండల కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహంలో ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఉదయం అల్పాహారం తీసుకున్న విద్యార్థులు వాంతులు విరోచనాలతో బాధపడుతుండటంతో వారిని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అస్వస్థతకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement