
పినరయి విజయన్
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అస్వస్థతకు గురయ్యారు.
సాక్షి, చెన్నై: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అస్వస్థతకు గురయ్యారు. శనివారం తెల్లవారుజామున అస్వస్థతకు గురికావడంతో ఆయనను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీఎం విజయన్‌కు ప్రత్యేక వైద్య బృందం పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే విజయన్ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు ఇప్పటి వరకూ ఎలాంటి బులిటెన్ విడుదల చేయలేదు.
కాగా, ఆహారం దొంగిలించాడనే కోపంతో గతనెలలో ఆదివాసీ యువకుడు మధు చిందకి అనే యువకుడిని కొట్టి చంపిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కేరళ పాలక్కాడ్ జిల్లాలోని అత్తపడిలో బియ్యం దొంగిలించినందుకు ఓ గుంపు ఎగబడి మధును దారుణంగా కొట్టి చంపింది. ఈ నేపథ్యంలో అతని కుటుంబసభ్యులను పరామర్శించేందుకు విజయన్ శుక్రవారం చెన్నై వెళ్లారు. ఈ క్రమంలో శనివారం ఆయన అస్వస్థతకు గురయ్యారు.