ఒంగోలు : తీర్థయాత్రలకు వెళ్లి కోల్కతాలో అస్వస్థతకు గురైన ఒంగోలు వాసుల కోసం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో హెల్ప్లైన్ ఏర్పాటు చేశారు. బాధితుల బంధువులు తమవారి సమాచారం కోసం 88866 16005 హెల్ప్లైన్ నెంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. పుణ్యక్షేత్రాల సందర్శనార్థం ఉత్తర భారతదేశ యాత్రకు వెళ్లిన 48 మంది రాష్ట్రవాసులు రెండు రోజుల క్రితం కోల్‌కతాలో విషాహారం తిని తీవ్ర అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
బాధితులంతా ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలకు చెందిన వారు. వీరిలో 27 మంది నెల్లూరు, కావలికి చెందిన వారు కాగా, ఒంగోలువాసులు 21 మంది ఉన్నారు. ఒక ప్రైవేటు పర్యాటక ఏజెన్సీ ప్యాకేజీలో వీరంతా గత నెల 29వ తేదీన ఒంగోలు నుంచి తీర్థయాత్రలకు వెళ్లారు. మరోవైపు తమవారి యోగక్షేమాల కోసం బంధువులు ఆత్రతగా ఎదురు చూస్తున్నారు.
ఒంగోలు వాసుల కోసం హెల్ప్లైన్ ఏర్పాటు
Published Mon, Aug 4 2014 8:54 AM | Last Updated on Fri, Oct 5 2018 6:48 PM
Advertisement