ఆ వార్తలను నమ్మకండి : స్టార్‌ హీరో | Vishal Condemns Hospitalized Rumours | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 27 2018 11:06 AM | Last Updated on Tue, Feb 27 2018 11:06 AM

Vishal Condemns Hospitalized Rumours - Sakshi

సాక్షి, చెన్నై : తన ఆరోగ్య విషయంలో వస్తున్న వార్తలపై స్టార్‌ హీరో విశాల్‌ స్పందించాడు. తాను ఆస్పత్రిలో చేరినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని ట్విట్టర్‌లో తెలియజేశాడు. 

‘నేను ఫిట్‌గానే ఉన్నానని అందరికీ తెలియజేస్తున్నా. మైగ్రేన్‌ సమస్య కోసం చికిత్స తీసుకోవటానికి వచ్చా. అది ముగిసిపోయింది కూడా . కంగారుపడాల్సిన అవసరం లేదు. మార్చి మొదటి వారంలో ఇండియాకు వచ్చేస్తా. వదంతులు నమ్మకండి’ అని ఈ ఉదయం విశాల్‌ ఓ ట్వీట్‌ చేశాడు. 

కాగా, అవన్‌ ఇవన్‌(తెలుగులో వాడు-వీడు) చిత్రీకరణ సమయంలో విశాల్‌కు తలనొప్పి ప్రారంభమైంది. దీనికి తోడు తుప్పరివాలన్‌(డిటెక్టివ్‌) సమయంలో గాయపడటంతో కీళ్లనొప్పులు మొదలయ్యాయి. ఈ క్రమంలో విశాల్‌ చికిత్సల అమెరికా వెళ్లి ఆస్పత్రిలో చేరాడంటూ కథనాలు వెలువడ్డాయి. ఇక సినిమాల పరంగా చూసుకుంటే విశాల్‌ నటించిన ఇరుంబు తిరై(తెలుగులో అభిమన్యుడు) విడుదలకు సిద్ధంగా ఉండగా.. సండైకోళి–2(పందెం కోడి-2) షూటింగ్‌ జరుపుకుంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement