ఆ వార్తలు నమ్మకండి.. ఏవైనా ఉంటే నేనే చెప్తా: మెహ్రీన్‌ | Mehreen Pirzada Busts Rumor On Balakrishna And Shared Tweet | Sakshi
Sakshi News home page

ఆ వార్తలు నమ్మకండి.. ఏవైనా ఉంటే నేనే చెప్తా: మెహ్రీన్‌

Published Mon, Jun 28 2021 6:16 PM | Last Updated on Mon, Jun 28 2021 10:35 PM

Mehreen Pirzada Busts Rumor On Balakrishna And Shared Tweet - Sakshi

నానికి జోడీగా ‘కృష్ణగాడి వీర ప్రేమకథ’లో నటించి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది పంజాబీ భామ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా. మహానుభావుడు, ఎఫ్‌ 2 చిత్రాలతో ఈ ముద్దు గుమ్మ మంచి గుర్తింపు సంపాదించుకుంది. కాగా ఇటీవల దర్శకుడు గోపిచంద్‌ మలినేని తన సినిమాలో హీరోయిన్‌గా మెహ్రీన్‌తో సంప్రదింపులు జరిపినట్లు, ఆ ఆఫర్‌ను ఈ అమ్మడు రిజెక్ట్‌ చేసిందనే వార్తలు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. తాజాగా దీనిపై మెహ్రీన్‌ స్పందించింది. 

ఆ వార్తలను నమ్మకండి..
ప్రస్తుతం ఈ భామ ‘ఎఫ్‌-3’తో పాటు మరో సినిమాలో నటిస్తోంది. నిశ్చితార్థం అనంతరం తన సినిమాల ఎంపికలో సెలక్టివ్‌గా ఉంటున్నట్లు తెలుస్తోంది మెహ్రీన్‌. తనపై వస్తున్న వార్తలకు స్పందిస్తూ.. తెలుగులో కొత్త సినిమాలకు ఇంకా సంతకం చేయలేదని స్పష్టం చేసింది. ఒకవేళ ఏదైనా ప్రాజెక్ట్‌ అంగీకరిస్తే తానే స్వయంగా తెలియజేస్తానంటూ చెప్పుకొచ్చింది.

ఈ సందర్భంగా ఆమె తన ట్విటర్‌లో..  ‘ ప్రస్తుతం నేను మారుతి దాసరి, సంతోష్‌ చిత్రంలో బిజీగా ఉన్నాను. నా తదుపరి సినిమాలకు సంబంధించి వస్తున్న వార్తలను నమ్మకండి. ఏవైనా ఉంటే నేనే స్వయంగా మీతో పంచుకుంటా.. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ ఓ ఫోటోను పోస్ట్‌ చేసింది. 

చదవండి: ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తు పట్టారా?


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement