చో రామస్వామికి తీవ్ర అస్వస్థత
చెన్నై: సీనియర్ నటుడు, పత్రికా సంపాదకుడు, రాజకీయ విశ్లేషకుడు చో రామస్వామి మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థాని క అపో ఆస్పత్రిలో చేర్చి న ఆయనకు వైద్యులు అత్యవసర వైద్య చికిత్సలు అందిస్తున్నారు. చో రామస్వామి గత ఏడాది పాటు అనారోగ్యంతో బాధ పడుతూ వైద్య చికిత్సలు పొందుతున్నారు. గత ఏడాది జూన్ మూడో తేదీన అనారోగ్యానికి గురవడంలో స్థానిక గ్రీమ్స్ రోడ్డులో గల అపోలో ఆస్పత్రిలో చేరారు.
వైద్య చికిత్సలనంతరం ఆరోగ్యం మెరుగుపడడంతో తిరిగి ఇంటికి చేరుకున్నారు.అయితే అదేనెల 19వ తేదీన అనారోగ్యం కారణంగా మళ్లీ ఆస్పత్రిలో చేరారు. ఆయన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు కనుగొన్నారు. తీవ్ర చికిత్స అనంతరం కోలుకు న్న చో రామస్వామి బుధవారం తిరిగి అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో ఆయనకు వైద్యులు అత్యవసరచికిత్స అందిస్తున్నారు.