Cho Ramaswamy
-
అక్క చెప్పినట్టే అన్నీ ఆచరించా: శశికళ
దివంగత నటుడు, పత్రికా సంపాదకులు చో రామస్వామి కారణంగా తాను పోయెస్ గార్డెన్‌కు దూరంగా కొంత కాలం గడపాల్సి వచ్చిందని ప్రమాణ పత్రంలో చిన్నమ్మ శశికళ వివరించారు. అక్క జయలలిత చెప్పినట్టే నడుచుకున్నానని, తానెప్పుడూ ఏ విషయాల్లోనూ జోక్యం చేసుకోలేదని స్పష్టంచేశారు. విచారణ కమిషన్‌కు సమర్పించిన ప్రమాణ పత్రంలోని కొన్ని వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. సాక్షి, చెన్నై : దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం మిస్టరీని నిగ్గు తేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి కమిషన్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ విచారణకు శశికళ స్వయంగా రాలేని పరిస్థితి. ఆమె పరప్పన అగ్రహార చెరలో అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తుండడమే ఇందుకు కారణం. తన న్యాయమూర్తి రాజ చెందూర్ పాండియన్ ద్వారా వాంగ్మూలాన్ని ప్రమాణ పత్రం రూపంలో ఆమె కమిషన్‌కు సమర్పించి ఉన్నారు. ఆమె నివేదించిన అంశాలు ఇప్పటికే అధికారంలో ఉన్న అన్నాడీఎంకే మంత్రుల్లో గుబులు రేకెత్తించాయి. జయలలితకు జ్వరం వచ్చిన రోజు నుంచి ఆస్పత్రిలో సాగిన చికిత్స, మరణం వరకు శశికళ ప్రమాణ పత్రంలో వివరించారు. అలాగే, ఎవరెవరు జయలలితను పరామర్శించారో తదితర వివరాలను కమిషన్ ముందుంచారు. ప్రస్తుతం శశికళ తరఫున న్యాయవాది రాజ చెందూర్ పాండియన్ విచారణకు హాజరయ్యే వారిని క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శశికళను పోయెస్ గార్డెన్ నుంచి జయలలిత గతంలో గెంటి వేయడానికి గల కారణాలు సైతం ప్రమాణ పత్రంలో పొందుపరిచి ఉండడం వెలుగులోకి వచ్చింది. 2011లో ప్రకంపనలు 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయంతో జయలలిత సీఎం పగ్గాలు చేపట్టిన కొన్ని నెలల్లో పోయెస్ గార్డెన్లో ప్రకంపన బయలు దేరింది. శశికళను గార్డెన్ నుంచి బయటకు సాగనంపడమే కాదు, ఆమె కుటుంబీకుల మీద కేసుల మోత మోగడం అప్పట్లో చర్చకు దారి తీసింది. జయలలితకు వ్యతిరేకంగా శశికళ కుటుంబం వ్యవహరించడంతోనే ఈ గెంటివేత అన్న చర్చ సాగింది. కొన్నాళ్లకు మళ్లీ శశికళ గార్డెన్ మెట్లు ఎక్కడం ట్విస్టుగా మారింది. అయితే, ఈ తతంగం వెనుక కారణాలేమిటో అనేది ప్రశ్నగానే మిగిలింది. దీనికి సమాధానం ఇచ్చే రీతిలో శశికళ తన ప్రమాణ పత్రంలో పేర్కొని ఉండడం గమనార్హం. 2011లో మళ్లీ అన్నాడీఎంకే అధికారంలోకి రాగానే, ఓ రోజున అక్క జయలలిత తనను పిలిచి ఇక్కడ ఉండొద్దు.. టీ నగర్‌లోని ఇంటికి వెళ్లి పో.. అని సూచించారని తెలిపారు. అక్క ఆజ్ఞను శిరసా వహించి గార్డెన్ నుంచి బయటకు వచ్చామన్నారు. ఈ హఠాత్ నిర్ణయంతో తొలుత తాను అయోమయంలో పడ్డానని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే, అక్క భరోసా ఇచ్చి మరీ పంపినట్టు పేర్కొన్నారు. తాను గార్డెన్ నుంచి బయటకు రావడంలో తుగ్లక్ పత్రిక సంపాదకులుగా ఉన్న నటుడు చో రామస్వామి కీలక భూమిక పోషించినట్టు వివరించారు. తనకు వ్యతిరేకంగా ఏదో జరుగుతోందనే సమాచారం ఆ సమయంలో జయలలితను షాక్‌కు గురి చేసిందన్నారు. ఈ విషయంపై సమగ్రంగా ఆరా తీసిన చో రామస్వామి అన్ని వివరాలను అక్క దృష్టికి తీసుకు వచ్చినట్టు తెలిపారు. దానిపై రహస్య విచారణ సైతం సాగినట్టు పేర్కొన్నారు. . అక్క చెప్పినట్టే.. ఆ సమయంలో అక్క(జయలలిత) చెప్పినట్టే తాను విన్నానని పేర్కొన్నారు. తన కుటుంబీకులందరినీ సాగనంపిన అనంతరం ఓ రోజున అక్కే తనకు సమాచారం పంపించారని పేర్కొన్నారు. ‘నీ మీద ఏ తప్పు లేదు.. ఇక, వచ్చేయి..’ అని అక్క పిలవడంతో గార్డెన్‌లోకి మళ్లీ వచ్చానన్నారు. ఈ సమయంలో చో రామస్వామి మరో ఆలోచన ఇచ్చారన్నారు. ఆయన ఆలోచన మేరకు తాను జయలలితకు ఓ లేఖను రాశానని తెలిపారు. ‘నేను ఏ తప్పూ చేయలేదు, రాజకీయం వ్యవహారాల్లో జోక్యం చేసుకోను, నా కుటుంబంతో సంబంధాలు కల్గి ఉండను.. నీ (జయలలిత)సంక్షేమమే ముఖ్యం’ అని ఆ లేఖలో వివరించి గార్డెన్లో చేరినట్టు పేర్కొన్నారు. తాను ఎప్పుడూ అన్నాడీఎంకే వ్యవహారాల్లో గానీ, అధికార విషయాల్లో గానీ జోక్యం చేసుకోవడం లేదన్న విషయం అక్కకు తెలుసు అని తెలిపారు. అయితే, కొన్ని సందర్భాల్లో అక్క ఆజ్ఞ మేరకు అనేక వివరాలను , ఇచ్చే సూచనల్ని, ఆదేశాలను ద్వితీయ శ్రేణి నేతల దృష్టికి తాను తీసుకెళ్లాని తెలిపారు. ఆ పయనం సాగిస్తూ ఉన్న సమయంలో సెప్టెంబరు 19న జయలలిత జ్వరం బారిన పడటం, ఆ తదుపరి వివరాలను ఆమె ప్రమాణ పత్రంలో వివరించి ఉండడం గమనార్హం. -
రెండు పాత్రల నిష్క్రమణ
అక్షర తూణీరం డెబ్బయ్ నాలుగు రోజులు ఆమె మృత్యువుతో పోరాడారు. ప్రపంచంలో అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్యం, వైద్యసేవలు తమ శాయశక్తులా ఆమెను బతి కించడానికి శ్రమించాయి. అయినా జయలలిత తిరిగి మామూలు మనిషి కాలేకపోయారు. ఎన్ని మానవ ప్రయత్నాలున్నా, అత్యధిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా ‘ఆ కొర్రగింజంతా ఉంటే తప్ప’ మనిషికి మనుగడ ఉండదని నిర్ధారణ అయింది. చివరిరోజు వైద్యులు కూడా భగవంతుడి మీద భారం వేశారు. జయలలిత అంతిమ ఘడియలు ఒక సందేశం ఇచ్చి ముగిశాయి. యాభై ఏళ్ల పాటు జయ జనంలో ఉన్నారు. తెలుగు, తమిళ వెండితెరలకు వెలుగులందించారు. నేపథ్యగాయనిగా ప్రసిద్ధికెక్కారు. ఎంజీఆర్ సాహచర్యంలో రాజకీయాలలో రాటు తేలారు. ఇంగ్లిష్, తమిళం, తెలుగు భాషలలో అనర్గళంగా, మాటల కల్తీ లేకుండా స్వచ్ఛంగా మాట్లా డేవారు. ఇష్టాయిష్టాలు రెండూ ఘాటు గానే ఉండేవి. గుచ్చుకున్న ముల్లుని తీసి, భస్మం చేసి పానీయంలో కలిపి సేవించే నైజం జయలలితది. అపర చాణక్యం. ఒక దశలో ఘన చరిత్రగల హిందూ పత్రికని కట్టడి చేయాలని ఆమె ప్రయ త్నించింది. గొప్ప రాజనీతిజ్ఞురాలు. కిందటి ఎన్నికలలో ఆమె గెలుపొందడం ఒక అసాధారణ విషయం. ప్రత్యర్థుల అంచనాలు తలక్రిందులయాయి. ముందస్తు సర్వేలు ఉల్టాపల్టాలైనాయి. తమిళ నాట ఒక వర్గానికి ఆమె ఆరాధ్యదేవత. బడుగు బలహీన వర్గాలకు అమ్మ పథ కాలు వరాలుగా దోహదపడ్డాయి. జయలలిత అంతిమ సంస్కారాలను చూసేందుకే ఉన్నట్టు, అవికాగానే కడశ్వాస వదిలారు చో రామసామి. రామసామి బహుముఖ ప్రజ్ఞావంతుడు. మంచి రచయిత, నాటక రచయిత. ప్రయోక్త, పత్రికా రచయిత. అన్నిటికీ మించి గొప్ప సృజనశీలి. ఒక నాటకంలో ఆయన ధరించిన చో పాత్ర ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. అదే రామసామి పేరు ముందు చేరిపోయింది. ‘మహమ్మద్ బిన్ తుగ్లక్’ ఆయన రచించిన నాటకం. దాన్నే తరువాత సినిమాగా తీశారు. దాన్నే తెలుగులో నాగభూషణం టైటిల్ రోల్ పోషిస్తూ సినిమా తీశారు. చో కారుకి మూడు టైర్లు. నాలుగోది ఆయన సెటైరు. దాంతో సాగుతారని సరదాగా అంటుంటారు. ‘తుగ్లక్’ పత్రికను ప్రారంభించి సమకాలీన రాజకీయ, సాంఘిక అంశాల మీద వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ తమిళ ప్రజలకు చేరువయ్యారు. నిర్భ యంగా, నిష్పక్షపాతంగా, నిర్మొగమాటంగా తన కలం గళంతో మాట్లాడగలరు. ఆయన ఏ పార్టీకి చెందరు. అన్ని పార్టీలు ఆయనకు చెందుతాయి. ఆరోజుల్లో జయలలిత ఇంట జరిగిన వివాహం పెద్ద విశేషం, విచిత్రం. మద్రాసు ప్రజలు నెల్లాళ్లపాటు సీరియల్‌గా ఈ పెళ్లిని చూశారు. అప్పుడే చోని మీకు పెళ్లిసందడి చూస్తుంటే ఏమనిపిస్తోందని ఒక చానల్ వారడిగారు. ‘‘నిండా సంతోషంగా ఉంది. ఆ తల్లులు (జయ, శశికళ) ఒంటి మీద ధరించిన నగలను చూస్తుంటే నాకెంతో ధైర్యం వస్తోంది. ఆ నగలతో దేశం ప్రపంచ బ్యాంకు రుణాన్ని అవలీలగా తీర్చేయవచ్చనిపిస్తోంది.’’ అని జవాబిచ్చారు రామసామి. ఆయనకు పుట్టుకతో వచ్చిన లోపం దేహం మీద ఎక్కడా వెంట్రుక మొలవక పోవడం. ఈ లోపం వల్ల ఎన్నో సమస్యలని చెప్పేవారు. దేశంలో తొమ్మిది మందిమి లెక్కతేలాం. మాదో క్లబ్ ఉందని చెప్పేవారు. చో ప్రసిద్ధ నటి రమ్య కృష్ణ మేనమామ. రమ్యకృష్ణ తల్లి చో రామసామి సోదరి. మంచి చిత్రకారిణి. తమిళనాడు ఏకకాలంలో ఇద్దరు గొప్ప వ్యక్తుల్ని కోల్పోయింది. అందుకు ప్రగాఢ సానుభూతి. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
చో రామస్వామి గురి తప్పని వ్యంగ్యాస్త్రం
-
ఎవరీ చో.. ఏమిటా తుగ్లక్?
-
వ్యంగ్య ప్రహారం ‘చో’
హాస్యాన్నీ, వ్యంగ్యాన్నీ మేళవించి రాజకీయ నేతలపై అక్షరాస్త్రాలు సంధించిన జర్నలిస్టు ప్రముఖులలో ‘తుగ్లక్’ వారపత్రిక సంపాద కుడు చోరామస్వామి అగ్రగణ్యుడు. బుధవారం తెల్లవారుజామున కన్నుమూసిన చో బడుగువర్గాలకు అండగా నిలిచి అక్రమార్కుల గుండెల్లో నిద్రించిన అక్షరయోధుడు. కొంతకాలం కింద చెన్నైలో జరిగిన ఒక సభలో ప్రధాని నరేంద్రమోదీని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తూ, ‘నేను ఇప్పుడు మృత్యుబేహారి (మర్చంట్ ఆఫ్ డెత్)ని మాట్లాడవలసిం దిగా కోరుతున్నాను’ అని చో అన్నప్పుడు మోదీ సహా సభికులం దరూ ఫక్కున నవ్వారు. కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ ఎన్నికల ప్రచారంలో మోదీనీ ‘మౌత్ కీ సౌదాగర్’ అనడం విన్నాం. గుజ రాత్ అల్లర్లలో ముస్లింలపై జరిగిన హత్యాకాండని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాంశం చేసింది. సోనియా ప్రచారాన్ని పరోక్షంగా తిప్పికొట్టడానికి చో వ్యంగ్యాన్ని వినియోగించారు. ‘ఉగ్రవాదం పట్ల మృత్యుబేహారినీ, అవినీతి పట్ల మృత్యుబేహారినీ, బంధుప్రీతి పట్ల మృత్యుబేహారినీ...’ అంటూ, ‘సకల అరిష్టాలపట్ల మృత్యు బేహారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను’ అన్నారు. ఆత్యయిక పరిస్థితిలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చో ధీరో దాత్తంగా పోరాడారనీ, తాము కూడా ఆ పోరాటంలో పాలు పంచుకున్నామనీ, అప్పుడే చో పేరు విన్నాననీ ప్రధాని చెప్పారు. చో నూటికి నూరుపాళ్ళు ప్రజాతంత్రవాది అనీ, ఎవరైనా తప్పు చేస్తే నిర్భయంగా విమర్శించగలరనీ; నీతీ, నిజాయితీ కలిగిన జర్నలిస్టు అనీ అన్నారు. తాను ‘రాజగురు’ అని అంటూ తనకు పరిచయం చేసుకున్నారని మోదీ గుర్తు చేశారు. గుజరాత్ ముఖ్య మంత్రిగా రెండోసారి గెలిచిన తర్వాత మోదీని జయలలిత పోయెజ్గార్డెన్కు ఆహ్వానించడం వెనుక ఈ ‘రాజగురు’ ప్రేరణ ఉంది. చో మరణవార్త తెలిసిన వెంటనే మోదీ ఇచ్చిన ట్వీట్లో ‘చో బహుముఖ ప్రజ్ఞాశాలి. శిఖరసమానుడైన మేధావి. గొప్ప జాతీయ వాది. అందరూ గౌరవించి, అభిమానించే సాహసోపేతమైన వాణి,’ అంటూ ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఎంజీఆర్ మరణించిన తర్వాత శవపేటిక ఉన్న వాహనం నుంచి ఎంజీఆర్ భార్య జానకి వర్గంవారు కిందికి తోసివేయగా నేలమీద పడి అవమానభారంతో మెరీనాబీచ్కి వెళ్ళకుండా ఇంటికి తిరిగి వెళ్ళిన జయలలితను ఏఐఏడిఎంకె అధినేత (జనరల్ సెక్రటరీ)గా ప్రతిష్ఠించడంలో చో పాత్ర నిర్ణాయకమైనది. అంతకు ముందు సినిమారంగంలో సైతం జయలలితకు హితైషిగా ఉండే వారు. ఎంజీఆర్‌కు రాజకీయ వారసురాలు జయలలిత మాత్రమే నని విశ్వసించి ఆమెకు తోడూనీడగా నిలిచి, రాజకీయ వ్యూహాలు రచించి, మార్గనిర్దేశనం చేసిన వ్యక్తి చో. ఆ దక్షత కారణంగానే ఏఐఏడిఎంకె 29 సంవత్సరాలు నిలబడటమే కాకుండా నాలుగు విడతల అధికారంలోకి వచ్చింది. లేకపోతే కుక్కలు చింపిన విస్తరి అయ్యేది. వైద్యం చేయించుకుంటున్నవారిని ఆస్పత్రికి వెళ్ళి పరా మర్శించే ఆనవాయితీ జయలలితకు లేదు. కొన్ని మాసాల కిందట ఊపిరితిత్తుల వ్యాధి ప్రబలి ఆస్పత్రిలో చేరిన చోను పరామర్శిం చేందుకు జయ వెళ్ళారు. స్నేహభావాన్ని చాటుకునే పద్ధతి అది. మోదీ కూడా చెన్నై వచ్చినప్పుడు చోని ఆస్పత్రిలో పరామ ర్శించారు. జయ మరణించిన రెండు రోజులకే చో కూడా ఈ లోకం వీడి వెళ్ళిపోయారు. సాధారణంగా గురువును శిష్యులు అనుసరి స్తారు. చో విషయంలో శిష్యురాలు ముందు వెళ్ళిపోతే ఆమె వెంటే గురువు వెళ్ళాడు. చో అసాధారణ రచయిత. మైసూరులో న్యాయవాదుల వంశంలో 1934 అక్టోబర్ 5న పుట్టిన శ్రీనివాస్ అయ్యర్ రామ స్వామి మద్రాసులో లా చదివి కొంతకాలం ప్రాక్టీసు చేశారు. టీటీకే సంస్థల గ్రూప్ న్యాయసలహాదారుగా పనిచేశారు. కానీ చదువు కునే రోజుల్లోనే రంగస్థలంపైన మోజు మొదలై అది వ్యామో హంగా ముదిరింది. నాటకాలు రాయడం, నటించడం, దర్శకత్వం వహించడంలో తలమునకలైనారు. అనంతరం సినిమా రంగంలో హాస్యపాత్రలలోనూ, తండ్రి పాత్రలలోనూ జీవించారు. సుమారు రెండు వందల సినిమాలలో నటించారు. నాలుగు సిని మాలకు దర్శకత్వం వహించారు. 14 సినిమాలకు మాటలు రాశారు. 23 నాటకాలు రాశారు. టీవీ సీరియళ్ళకు లెక్కలేదు. తన జీవిత చరిత్రను ‘ఎక్స్ప్రెషన్స్ గివెన్ బై ఫార్ట్యూన్’ (అదృష్టం అందించిన అనుభవాలు) పేరుతో వెలువరించారు. తనకు ప్రతిభ కంటే అదృష్టం అధికమంటూ చమత్కరించేవారు. 1970లో ‘తుగ్లక్’ పత్రికను స్థాపించారు. తన పత్రిక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని ప్రకటించారు. ఇందిరాగాంధీ, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత లపైన కూడా నిశితమైన విమర్శలు ప్రచురించే వారు. అందరినీ సమభావంతో ఉతికి ఆరవేయడమే విధానం. రాజకీయ వ్యాఖ్యాత గానే కాకుండా రాజకీయ సూత్రధారిగా కూడా చో పని చేసిన సందర్భాలు ఉన్నాయి. తనకు ఇష్టుడైన కామరాజ్ నాడార్ నాయ కత్వంలోని పాత కాంగ్రెస్‌ను ఇందిరా కాంగ్రెస్‌లో విలీనం చేసే సంకల్పంతో ఇందిర, కామరాజ్‌లతో మాట్లాడి మధ్య వర్తిత్వం నెరపారు. ‘దెన్మొళియల్’పేరుతో ఒక నాటకం రచించి, అందులో చో పాత్ర పోషించి, రక్తికట్టించి ప్రేక్షకులను మెప్పించడంతో ఆయన పేరులో శ్రీనివాస్ అయ్యర్ ఎగిరిపోయి ‘చో’ వచ్చి చేరింది (జానకి ఇంటిపేరు షావుకారు అయినట్టు). చో రచించిన నాటకాలలో మొహమ్మద్ బిన్ తుగ్లక్ అత్యంత జయప్రదమైనది. ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. తుగ్లక్ గోరీ నుంచి లేచి వచ్చి దేశానికి ప్రధాని కావడం నాటక ఇతివృత్తం. ఫిరాయింపు రాజకీయాలపైన కొరడా. ఈ నాటకంలో వ్యంగ్యం అద్భుతంగా పండింది. దీన్ని సినిమా తీయడానికి ప్రయత్నించినప్పుడు డిఎంకె ప్రభుత్వం గట్టిగా అడ్డుకున్నది. కానీ చో వెనకడుగు వేయలేదు. ఆ తుగ్లక్ పేరుతోనే పత్రిక వచ్చింది. ఇప్పుడు ఆ పత్రిక సుమారు 60 వేల కాపీలు అమ్ముతోంది. వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చోని రాజ్య సభకు నామినేట్ చేసింది. జర్నలిజంలో శిఖర స్థాయికి ఎదిగి నందుకు భగవాన్‌దాస్ గోయెంకా అవార్డు ప్రదానం చేశారు. ‘శంకర్స్ వీక్లీ’లో వ్యంగ్య చిత్రాలూ, శీర్షికలూ ఉండేవి. అవి చురకలు అంటించేవి. జయప్రకాశ్ నారాయణ్, ఆరెస్సెస్ అధినేత బాలాసాహెబ్ దేవరస్, ఆడ్వాణీ, చంద్రశేఖర్ వంటి జాతీయ నాయకులతో సాన్నిహిత్యం ఉండేది. దేశవ్యాప్తంగా వెతికినా అటు వంటి మేధావి మరొకరు కనిపించరు. సాటిలేని వ్యక్తిత్వం ఆయ నది. ఆయనకిదే అక్షరాంజలి. - కె. రామచంద్రమూర్తి -
మరో విషాదం
► కానరాని లోకానికి చోరామస్వామి ► అశ్రునయనాలతో అంతిమవీడ్కోలు ► వరుసగా శోకాలే రాజధాని నగరం చెన్నైలో వరుస విషాదాలు ప్రజలను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నారుు. మొన్నటికి మొన్న సంగీత గాన గంధర్వుడి మరణం. నిన్నటికి నిన్న అందరి అమ్మ జయలలిత అనంత లోకాలకు చేరడం యావత్ తమిళావని గుండెల్ని బరువెక్కించింది. ఈ సమయంలో బుధవారం వేకువ జామున మరో విషాదం. అమ్మ జయలలితకు గురువుగా, సలహాదారుడిగా వ్యవహరించిన చో రామస్వామి(82) ఇక లేరన్న సమాచారం సర్వత్రా విషాదంలోకి నెట్టింది. - సాక్షి, చెన్నై రాష్ట్రంలో రెండు, మూడు వారాలుగా తీవ్ర ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. అమ్మ జయలలిత ఆసుపత్రిలో ఉన్న నేపథ్యంలో తరచూ పుకార్లు షికార్లు చేస్తుండడం ఓ వైపు ఆందోళనకు దారి తీస్తూ వచ్చింది. ఈ సమయంలో అన్నాడీఎంకే సీనియర్ నాయకురాలు, ఆ పార్టీ నిర్వాహక కార్యదర్శి విశాలక్షి నెడుంజెలియన్ ఇక లేరన్న సమాచారం అన్నాడీఎంకే వర్గాల్లో విషాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో అమ్మ ఆరోగ్యంపై ఆందోళన సర్వత్రా పెరిగింది. తదుపరి ప్రఖ్యాత కర్ణాటక సంగీత విధ్వాంసుడు బాలమురళీ కృష్ణ ఇక లేరన్న సమాచారం తెలుగు, తమిళ, కర్ణాటక సినీ, సంగీత ప్రపంచాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ ఘటన తదుపరి డీఎంకేలో విషాదం ఆవహించే విధంగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు కోశిమణి మరణం కలవరాన్ని రేపింది. అలాగే, డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఆసుపత్రిలో చేరడం ఉత్కంటకు దారి తీసింది. ఈ నేపథ్యంలో యావత్ తమిళ ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టే రీతిలో అందరి అమ్మ జయలలిత కానరాని లోకాలకు చేరడం ప్రతి గుండెల్ని బరువెక్కింది. అమ్మ మరణం, అంత్యక్రియలు ముగిసిన మరుసటి రోజే నటులు , విశ్లేషకులు, తుగ్లక్ సంపాదకులు చో రామస్వామి ఇక లేరన్న సమాచారం తీవ్ర విషాదంలోకి నెట్టింది. మరో విషాదం: రంగస్థలం, సినీ, పత్రికా రాజకీయ రంగాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న చో రామస్వామి బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న విషయం తెలిసిందే. శ్రీనివాస అయ్యర్ రామసామి అన్న సొంత పేరు మరుగున పడి తెర మీదకు చో రామస్వామిగా, తుగ్లక్ రామస్వామిగా చివరకు ’చో’ అంటే గుర్తు పట్టే విధంగా మారిందని చెప్పవచ్చు. 1934లో చెన్నైలో జన్మించి ’చో’ న్యాయ శాస్త్రంలో పట్టభద్రుడై, నాటక రంగంలో రాణించి, నటుడిగా ఎదిగి, రచరుుతగా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. అనేక చిత్రాలలో హీరోగా, మరెన్నో చిత్రాల్లో విలక్షణ నటుడిగా తనదైన శైలిలో నటించి అందరి మదిలో సుస్తిర స్థానాన్ని సంపాదించుకున్న చో రామ స్వామి తుగ్లక్ నాటకంలో ఔరంగ జేబు పాత్ర పోషించి రక్తికట్టించారు. ఆ నాటకం పేరుతోనే తదుపరి తుగ్లక్ పత్రికను స్థాపించి ఎన్ని ఒడిదొడుగులు ఎదురైనా నిర్విరామంగా ఈ రాజకీయ వార పత్రికను ముందుకు నడిపించారు. ముక్కుసూటిగా, నిష్పక్షపాతంగా విమర్శలను ఎత్తి చూపించడంలో చో వెనక్కు తగ్గిన సందర్భాలే లేవు. ఇక, అందరూ అమ్మ జయలలిత ఆశీస్సుల కోసం ఎదురు చూసే రోజుల్లో, చో ఆశీర్వచనం కోసం అదే అమ్మ ఆయన ఇంటి గడప తొక్కిన సందర్భాలు అనేకం. అందుకే ఆయన్ను జయలలితకు మరో గురువుగాను, రాజకీయ సలహదారుడిగాను సర్వత్రా భావిస్తుంటారు. అదే సమయంలో ఏదేని నిర్ణయం తీసుకునే సమయంలో తప్పనిసరిగా చోతో చర్చించడం జరిగేది. గతంలో చో అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంటే, స్వయంగా అమ్మ జయలలిత వెళ్లి పరామర్శించడమే కాకుండా ఆయన ఆరోగ్యం మెరుగు పడేందుకు తగ్గట్టు అత్యాధునిక వైద్యసేవలు సాగే రీతిలో చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు. అమ్మ జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో చో మళ్లీ అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం అదే అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో సోమవారం రాత్రి అమ్మ జయలలిత అనంత లోకాలకు చేరడం యావత్ తమిళావనిని కన్నీటి రోదనలో ముంచింది. అమ్మ అంత్యక్రియలు ముగిసిన మరుసటి రోజు ఉదయాన్నే చో కూడా ఇక లేరంటూ వచ్చిన సమాచారం మరో విషాదాన్ని నింపింది. అశ్రునయనాలతో వీడ్కోలు: అపోలో ఆసుపత్రిలో బుధవారం ఉదయాన్నే చో మరణ సమాచారం రాజకీయ వర్గాల్నే కాదు, తమిళ సినీ ప్రపంచంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చెన్నై రాజా అన్నామలైపురం ఎంఆర్సీ నగర్ వసంత అవెన్యూరోడ్డులోని ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో రాజకీయ, సినీ వర్గాలు తరలి వచ్చారుు. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్, ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంతో పాటుగా పలువురు మంత్రులు, డీఎంకే కోశాధికారి, ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్, ఆ పార్టీ ఎంపీ కనిమొళి, ఆ పార్టీ బహిష్కృత నేత అళగిరి, బీజేపీ రాష్ట్ర కార్శదర్శి తమిళిసై సౌందర్‌రాజన్, ఎండీఎంకే నేత వైగో, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, వీసీకే నేత తిరుమావళన్, సీపీఐ నేత ముత్తరసన్, పీఎంకే యువజన నేత, ఎంపీ అన్భుమణి రాందాసు, తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్, కాంగ్రెస్ సీనియర్ నేత కుమరి ఆనందన్, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ చో పార్తీవ దేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. రజనీకాంత్, నటులు శివకుమార్, సూర్య, కార్తీ, రాధారవి, ఎస్వీ.శేఖర్, వైజీ.మహేంద్రన్ తమ నివాళులర్పించారు. రాజకీయ విశ్లేషకుడిగా చో సంధించిన ప్రశ్నలు, ఎత్తి చూపిన అంశాలు, విమర్శలను గుర్తు చేస్తూ ఆయనతో తమ అనుబంధాన్ని రాజకీయ వర్గాలు మీడియాతో పంచుకున్నారుు. ఇక, సీనీ, నాటక రంగంలో చో సహకారం, ఆయన నటన , అభిమానాన్ని గుర్తు చేస్తూ ఆ రంగాలకు చెందిన ప్రముఖులు, దక్షిణ భారత నటీ నటుల సంఘం ప్రతినిధులు, తమిళ నిర్మాతల మండలి, దక్షిణ భారత సినీ వాణిజ్య మండలి వర్గాలు తమ సానుభూతి తెలియజేశారుు. ఇక, అశ్రునయనాల నడుమ బుధవారం సాయంత్రం బీసెంట్ నగర్‌లోని స్మశాన వాటికలో చో పార్తీవ దేహానికి అంత్యక్రియలు జరిగారుు. -
గురితప్పని వ్యంగ్యాస్త్రం
- శ్రీనివాస అయ్యర్ రామస్వామి (చో రామస్వామి) 1934 అక్టోబరు 5న ప్రముఖ లాయర్ శ్రీనివాస అయ్యర్- రాజమ్మాళ్ దంపతులకు జన్మించారు. మద్రాసులోని మైలాపూర్ ప్రాంతంలో పెరిగిన ఆయన లా చదివారు. నాటక రంగంపై ఆసక్తితో ఓ నాటకగ్రూపులో చేరారు. తల్లి సంధ్యతో కలిసి రిహార్సల్స్‌కు వచ్చే జయలలిత తొలినాళ్ల నుంచే రామస్వామికి తెలుసు. వీరిద్దరూ కలిసి సినిమాల్లోనూ నటించారు. ఆరేళ్లపాటు మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసి... తర్వాత టీటీకే గ్రూపులో లీగల్ అడ్వైజర్‌గా చేరారు. మరోవైపు నాటికలు రాస్తూ నటించేవారు. మొత్తం 23 నాటికలు రాశారు. ఇందులో ‘మహ్మద్ బిన్ తుగ్లక్’ ప్రముఖంగా చెప్పుకోదగ్గది. తుగ్లక్ మళ్లీ పుట్టి భారతదేశానికి ప్రధానమంత్రి కావడం దీని ఇతివృత్తం. ఇది బాగా జనాదరణ పొంది సినిమాగానూ వచ్చింది. దాదాపు రెండు వందల సినిమాల్లో రామస్వామి నటించారు. 14 సినిమాలకు స్క్రీన్‌ప్లే రాశారు... నాలుగింటికి దర్శకత్వం వహించారు. కామెడీ బాగా చేసేవారు. తెన్మోజియాల్ అనే నాటకంలో ‘చో’ పేరుతో ఉన్న పాత్రను చేసినప్పటి నుంచి ఆయన పేరు చో రామస్వామిగా మారింది. ఎంజీఆర్, రజనీకాంత్, జయలలిత లాంటి హేమాహేమీలతో కలిసి నటించారు. 1970లో రాజకీయ వారపత్రిక ‘తుగ్లక్’ను ప్రారంభించారు. రాజకీయ వ్యంగ్యాస్త్రాలతో ప్రభుత్వాలను నిలదీయడంలో చో రామస్వామి సుప్రసిద్ధుడు. సమకాలీన రాజకీయ పరిణామాలపై నిశిత పరిశీలనా దృష్టి, ఎంతటి వారినైనా నిర్మొహమాటంగా విమర్శించే తెగువ, సందర్భోచితంగా వ్యంగ్యాస్త్రాలు... చో రామస్వామిని విలక్షణ సంపాదకుడిగా నిలబెట్టాయి. ప్రభుత్వాలు సుపరిపాలన అందించాలని... ఆ దిశగా తుగ్లక్ వారపత్రిక బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరించాలని నమ్మేవారాయన. మతపరమైన విశ్వాసాలు బలంగా ఉన్నప్పటికీ... హిందూత్వవాదులకు, వామపక్ష భావజాలమున్న వారినీ... అందరినీ సమదృష్టితో కడిగేసేవారు. తమిళనాడులో పౌరహక్కుల ఉద్యమంలోనూ చో రామస్వామి చురుకుగా పనిచేశారు. సీపీఐ (ఎంఎల్) కార్యకర్త శ్రీలన్ ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ జరిగిన ఉద్యమానికీ సారథ్యం వహించారు. ఎంజీఆర్ ప్రభుత్వం జర్నలిస్టులపై ఆంక్షలు విధించడానికి ప్రయత్నిస్తే గట్టిగా వ్యతిరేకించారు. నక్సలైట్ల హింసను వ్యతిరేకించి... పీయూసీఎల్తో విబేధించారు. ప్రతి సంవత్సరం జనవరి 14న తుగ్లక్ వ్యవస్థాపక దినోత్సవం రోజున తన పాఠకులను కలుసుకోవడం, సిబ్బందిని సన్మానించడాన్ని వార్షిక కార్యక్రమంగా చేపట్టారు. ఈ సందర్భంగా పాఠకుల ప్రశ్నలకు తనదైన శైలిలో వ్యంగ్యంగా, చలోక్తులతో జవాబులిచ్చేవారు. ఈ వార్షిక కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులెందరో అతిథులుగా హాజరయ్యారు. వీరిలో మోదీ కూడా ఒకరు. 1999లో రాష్ట్రపతితో రాజ్యసభకు నామినేట్ అయిన చో రామస్వామి 2005దాకా పెద్దల సభ సభ్యుడిగా పనిచేశారు. ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించిన చోకు ఇందిరాగాంధీతో పాటు వాజ్‌పేయి, ఎల్.కె.అద్వానీలతో మంచి పరిచయడం ఉండేది. ఎంత తీవ్రంగా విమర్శించినా... పార్టీలకతీతంగా చో అగ్రనేతలతో సంబంధాలు నెరిపారు. జయలలిత గౌరవించే కొద్దిమందిలో చో రామస్వామి ఒకరు. చిన్నతనం నుంచే ఆయనతో కలిసి నటించిన జయలలిత రాజకీయంగా కష్టకాలంలో ఉన్నపుడు పలుమార్లు చో సలహాలు తీసుకున్నారు. అయితే ఆయన జయలలితనూ వదల్లేదు. ముఖ్యమంత్రిగా ఆమె పదవీకాలంలో పలు అవినీతి ఆరోపణలు రావడం, శశికళతో ఆమె సాన్నిహిత్యం... వీటిపై చో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. చో రాజకీయ ఎత్తుగడలు కూడా వీరి మధ్య విబేధాలను పెంచాయి. 1996లో జీకే ముపనార్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్ (టీఎంసీ)కి డీఎంకేతో పొత్తు కుదుర్చడంలో చో ముఖ్యభూమిక పోషించారు. అలాగే రాజకీయంగా ఏనాడూ పెద్దగా బయటపడని తన మిత్రుడు సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ఎన్నికలకు ముందు పిలుపు ఇప్పించారు. ‘జయలలిత మళ్లీ అధికారంలోకి వస్తే తమిళనాడును దేవుడు కూడా రక్షించలేడు’ అని రజనీ విసిరిన పంచ్ డైలాగ్‌తో కరుణానిధి అధికారంలోకి వచ్చారు. తర్వాతికాలంలో చో, జయలలిత మళ్లీ దగ్గరయ్యారు. అన్నాడీఎంకే అధినేత్రిగా సలహాదారు పాత్రను పోషించారు. 2010లో విజయ్‌కాంత్ నాయకత్వంలోని డీఎండీకేకు అన్నాడీఎంకేతో పొత్తు కుదరడంలోనూ కీలకంగా పనిచేశారు. 2011లో జయ అధికారం చేపట్టిన వెంటనే శశికళను దూరం పెట్టాలని సలహా ఇచ్చారు. కానీ కొద్దినెలల్లోనే శశికళ మళ్లీ పోయెస్‌గార్డెన్‌లో అడుగుపెట్టారు. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీతో అన్నాడీఎంకేకు పొత్తు కుదుర్చాలని చో గట్టిగానే ప్రయత్నించినా... కార్యరూపం దాల్చలేదు. కిందటేడాది చో రామస్వామి ఊపిరితిత్తుల సమస్యతో ఆసుపత్రిలో ఉన్నపుడు జయలలిత వచ్చి పరామర్శించారు. నరేంద్ర మోదీతోనూ చో రామస్వామికి మంచి సంబంధాలుండేవి. 2014 ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పుడే ... మోదీని ప్రధాని అభ్యర్థిని చేయాలని తొలుత మాట్లాడింది చో రామస్వామియే. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను చెన్నై వచ్చినపుడు ప్రధాని ఇంటికి వెళ్లి మరీ పరామర్శించారు. ఈ ఏడాది జనవరి 14 తుగ్లక్ పత్రిక వార్షికోత్సవానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యే పి.కరుపయ్యను చో ఆహ్వానించారు. శశికళకు బద్ధ వ్యతిరేకి అయిన కరుపయ్య... జయలలిత హయాంలో పెరిగిపోయిన అవినీతి గురించి ఆ కార్యక్రమంలో విమర్శలు గుప్పించారు. అప్పటి నుంచి చోతో జయ మాట్లాడటం మానేశారని అంటారు. తుగ్లక్ వారపత్రికకు తమిళనాడు ప్రభుత్వం ప్రకటనలు కూడా ఆగిపోయాయి. గురుశిష్య సంబంధం నెరిపిన వీరిలో జయలలిత సోమవారం రాత్రి మరణించగా... అదే అపోలో ఆసుపత్రిలో చో బుధవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పోస్టల్ శాఖను తప్పుదోవ పట్టించిన చో
తుగ్లక్ వారపత్రికను చో రామస్వామి 1970 జనవరి 14న ‘తమిళ సంక్రాంతి’ రోజు ప్రారంభించారు. వ్యవస్థాపక సంపాదకుడిగా ఉన్న చో ఎన్నో సంఘటనల మీద పదునైన కాలమ్స్ రాశారు. ముఖచిత్రంగా పొలిటికల్ కార్టూన్ ఉండే ఈ పత్రిక సర్క్యులేషన్ 75,000. నలబై ఆరేళ్లుగా నిరాటంకంగా వస్తున్న తుగ్లక్ ఎమర్జెన్సీ సమయంలో మాత్రం రెండు వారాల పాటు నిలిచిపోయింది. అత్యవసర పరిస్థితికి నిరసనగా, తర్వాతి వారం పూర్తి నల్లటి ముఖచిత్రంతో సంచికను విడదుల చేశారు చో. ఎమర్జెన్సీ సమయంలో తుగ్లక్లోని వాణిజ్య ప్రకటనలు కూడా సెన్సార్ కావడం గమనార్హం. బాబ్రీ మసీదు ధ్వంసానంతరం కూడా ముఖచిత్రాన్ని నలుపు రంగులో ముద్రించారు. పత్రిక వార్షికోత్సవం రోజున వివిధ రంగాల్లోని ప్రముఖులు సహా, తుగ్లక్ అభిమానులందరూ ఒకచోట చేరతారు. అభిమానులు అడిగే ప్రశ్నలకు చో ఇచ్చే చురుకైన సమాధానాలు ఈ ఉత్సవంలోని హైలైట్! మహమ్మద్ బిన్ తుగ్లక్ 1968లో ‘మహ్మద్ బిన్ తుగ్లక్’ పేరుతో తమిళంలో నాటకం రాశారు చో. రాజకీయ అనౌచిత్యాల మీద వ్యంగ్యాస్త్రం ఇది. మూడేళ్ల తర్వాత దాన్నే సినిమాగా తీశారు. రచన, దర్శకత్వ బాధ్యతలతో పాటు, తుగ్లక్ పాత్రను కూడా చో పోషించారు. 14వ శతాబ్దానికి చెందిన తుగ్లక్ 1968లో ఉన్నట్టుండి ఒక మూలికవల్ల శవపేటికలోంచి నిద్ర లేస్తాడు. దేశవ్యాప్తంగా ఆ సంఘటన సంచలనం సృష్టిస్తుంది. ప్రధానమంత్రి కావాలనే లక్ష్యంతో తుగ్లక్ ఎన్నికల్లో పోటీ చేస్తాడు. ఎన్నికల్లో గెలిచి ప్రధాని అవుతాడు. తన పార్టీలో చేరిన 450 మందిని ఉపప్రధానులను చేస్తాడు. ఇలా సాగే ఈ చిత్రం బెస్ట్ పొలిటికల్ సెటైర్‌గా నిలిచింది. నాగభూషణం ప్రధాన పాత్రధారిగా ఈ సినిమా తెలుగులోనూ వచ్చింది. పోస్టల్ శాఖను తప్పుదోవ పట్టించిన చో 1981లో సంజయ్ గాంధీ స్మృత్యర్థం ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించగానే కోపోద్రిక్తుడయ్యారు చో. సంజయ్‌గాంధీతో పాటు విమాన ప్రమాదంలో మరణించిన పైలట్ సుభాష్ సక్సేనా కూడా అలాంటి స్టాంపునకు అర్హుడే అని భావించారు. తుగ్లక్ పత్రికలో అచ్చమైన పోస్టల్ స్టాంపుల్లాగా పూర్తిపేజీ సక్సేనా స్టాంపులు ముద్రించారు. చిత్రంగా, చాలామంది పాఠకులు వాటిని చించి కవర్ల మీద అంటించడమే కాదు, పోస్టల్ శాఖ కూడా వాటిని నిజమైనవిగా నమ్మి స్టాంపులు కొట్టింది. -
రెండు రోజుల్లో రెండు షాక్‌లు తగిలాయి
-
ఎవరీ చో.. ఏమిటా తుగ్లక్?
సినిమా నటుడు, సినిమా స్క్రిప్టు రచయిత, న్యాయవాది, నాటక రచయిత, పత్రికా రచయిత... ఇలా చెప్పుకొంటూ పోతే చో రామస్వామి గురించి బోలెడన్ని అంశాలున్నాయి. ఎప్పుడూ నున్నగా గీసిన గుండు, పెద్ద కళ్లజోడు, నుదుటన విభూది బొట్టు.. ఇదీ ఆయన స్వరూపం. 1934 అక్టోబర్ 5వ తేదీన జన్మించిన ఈయన.. 'తుగ్లక్' అనే పత్రికను స్థాపించడంతో దాని సంపాదకుడిగానే ఎక్కువ ప్రసిద్ధి చెందారు. మహ్మద్ బిన్ తుగ్లక్ పేరును ఆయన రాజకీయ వ్యంగ్యాస్త్రంగానే ఉపయోగించారు గానీ.. దానికి, చో రామస్వామికి మధ్య విడదీయలేని బంధం ఉంది. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ మీద విమర్శ కోసం రాసిన మహ్మద్ బిన్ తుగ్లక్ నాటకాన్ని తొలిసారి 1968లో.. ఆ తర్వాత దాదాపు రెండు వేల సార్లు ఆయన ప్రదర్శించారు. అది ఇప్పటి కాలమాన పరిస్థితులకు కూడా సరిపోతుందని అందరూ అంటారు. నాటకం బాగా విజయవంతం కావడం, అది ఒక బ్రాండ్‌గా స్థిరపడటంతో 1970లో తుగ్లక్ పత్రికను ఆయన స్థాపించారు. పత్రిక ముఖ చిత్రం మీద ఎప్పుడూ రాజకీయ కార్టూన్లే ఉంటాయి. చో రామస్వామి 12 నాటకాలు రాశారు, 57 సినిమాల్లో నటించారు, 37 సినిమాలకు స్క్రీన్‌ప్లే అందించారు. ఆయన మాటలు సూటిగా, వాడిగా ఉంటాయి. జయలలితను నిశితంగా విమర్శించే ఈయన.. ఆమెకు మంచి సలహాదారు. నిజానికి జయలలిత ఎవరి మాటలు వినరు, ఎవరి సలహా తీసుకోరు. కానీ, ఒక్క చో రామస్వామి సలహాలు మాత్రం తీసుకుంటారు. అసలు ఆమెకన్నా ముఖ్యమంత్రి పదవికి రజనీకాంత్ సరైన వ్యక్తన్నది ఆయన అభిప్రాయం. జయలలిత అవినీతిని కూడా ఆయన ఎండగట్టారు. అయినా ఆయన మాటలంటే 'అమ్మ'కు ఎక్కడలేని గురి. ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలుకొట్టి మాట్లాడటం, నిజాలు నిష్కర్షగా చెప్పడం వల్లే ఆయన అంటే జయలలితకు నమ్మకం అంటారు. ప్రముఖ సినీనటి రమ్యకృష్ణకు స్వయానా పెదనాన్న అయిన చో రామస్వామి.. రిజర్వేషన్లకు బద్ధ వ్యతిరేకి. రాజకీయాల్లో ఆయన ఎవరికి మద్దతిస్తారంటే చెప్పడం కష్టమే గానీ, ఎవరిని వ్యతిరేకిస్తారంటే.. కమ్యూనిస్టులను అని గట్టిగా చెప్పొచ్చు. అటు తుగ్లక్ పత్రికతోను, ఇటు ప్రత్యక్షంగా కూడా నిశిత రాజకీయ విమర్శలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే చో రామస్వామి.. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, జయలలిత మరణించిన మూడోరోజే మరణించారు. -
నటుడు చో రామస్వామి కన్నుమూత
-
చో రామస్వామి కన్నుమూత
- ప్రధాని మోదీతో సహా పలువురు ప్రముఖుల సంతాపం చెన్నై: తమిళుల్ని తీవ్ర విషాదంలో ముంచెత్తిన అమ్మ మరణం నుంచి అక్కడి ప్రజలు కోలుకోకముందే... తమిళ ప్రజలు విపరీతంగా అభిమానించే రాజకీయ విశ్లేషకుడు, సీనియర్ నటుడు, పత్రికా సంపాదకుడు, చో రామస్వామి కన్నుమూశారు. 82 ఏళ్ల ఈ కురు వృద్ధుడు బుధవారం ఉదయం 4.40 గంటల ప్రాంతంలో స్థానిక అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొద్ది కాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. గత నెల 29వ తేదీన తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆయన్ను స్థానిక అన్నాశాలై రోడ్డు, గ్రీమ్స్ రోడ్డులో గల అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఆ సమయంలో దివంగత ముఖ్యమంత్రి, ఆయన్ని రాజకీయ గురువుగా భావించే జయలలిత అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె తుది శ్వాస విడిచిన సంగతి చో రామస్వామికి తెలియదు. తనకు అత్యంత ఆప్తురాలైన జయలలిత కన్ను మూసిన మూడవ రోజే చో రామస్వామి వైద్య చికిత్స పొందుతూ కన్ను మూయడం గమనార్హం. రాష్ట్ర ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగరరావు, ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం, డీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంకే.స్టాలిన్, కనిమొళి, అళగిరి, ఎండీఎంకే నేత వైగో, డీఎండీకే పార్టీ అధ్యక్షుడు విజయకాంత్, సూపర్‌స్టార్ రజనీకాంత్, అజిత్, సూర్య, కార్తీ, తదితర ప్రముఖులు చో రామస్వామి భౌతిక కాయానికి నివాళులర్పించారు. చో రామస్వామి పార్థివ దేహానికి బుధవారం సాయంత్రం 4.30 ప్రాంతంలో స్థానిక బీసెంట్ నగర్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. రామస్వామి ప్రముఖ నటి రమ్యకృష్ణకు మేనమామ కూడా. జయలలితతో పాటు ఎంజీఆర్, శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్ తదితరులతో కలసి పలు సినిమాల్లో నటించారు.14 చిత్రాల్లో హీరోగాను, మరికొన్ని చిత్రాల్లో ప్రతినాయకుడిగాను నటించారు. పలు నాటకాలు వేశారు. మహాభారతం, వాల్మీకి రామాయణం, నానేరాజా రచనలు ఆణిముత్యాలుగా నిలిచిపోయాయి. వి.కృపలానీ, ఇందిరాగాంధీ, మొరార్జీదేశాయ్, కరుణానిధి, చరణ్ సింగ్, కామరాజర్, ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్, వాజ్‌పేయి, అద్వానీ, మోదీ వంటి రాజకీయ నేతలతోనూ చో కు సత్సంబంధాలున్నాయి. ప్రముఖుల సంతాపం: ‘చో రామస్వామి బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎవ్వరికీ భయపడని వ్యక్తి. ఆయన కుటుంబ సభ్యులకు, తుగ్లక్ పాఠకులకు నా ప్రగాఢ సంతాపం’అని ప్రధాని మోదీ ట్వీటర్లో పేర్కొన్నారు. చో రామస్వామి మృతికి జగన్ సంతాపం సాక్షి, హైదరాబాద్ : ప్రఖ్యాత జర్నలిస్టు చో రామస్వామి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సంతాపాన్ని ప్రకటించారు. అవినీతికి వ్యతిరేకంగా రామస్వామి చేసిన రాజీలేని పోరాటం, నాటక రచనలో ఆయన ప్రతిభ, జర్నలిస్టుగా పదునైన వ్యంగ్యపూరిత వ్యాఖ్యలు ఆయన జీవితంలో కలికి తురారుు వంటివని జగన్ నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. చో గురించి సంక్షిప్తంగా.. పేరు: శ్రీనివాస అయ్యర్ రామస్వామి జన్మస్థలం: చెన్నైలోని మైలాపూర్ పుట్టిన తేదీ: అక్టోబర్ 5, 1934 విద్యాభ్యాసం: మద్రాస్ యూనివర్సిటీ భార్య: సౌందర్య సంతానం: శ్రీరామ్, సింధుజ తొలి వృత్తి: న్యాయవాది (1957-1962) బహుముఖ ప్రజ్ఞ: రచన, నటన, దర్శకత్వం, జర్నలిజంలలో ప్రతిభ పేరు ప్రతిష్టలు తెచ్చిన నాటకం: తుగ్లక్ స్థాపించిన పత్రిక: తుగ్లక్ (1970) అవార్డులు: భగవాన్‌దాస్ గొయెంకా రాజ్యసభ సభ్యత్వం: 2005-2009 -
చో రామస్వామికి తీవ్ర అస్వస్థత
చెన్నై: సీనియర్ నటుడు, పత్రికా సంపాదకుడు, రాజకీయ విశ్లేషకుడు చో రామస్వామి మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థాని క అపో ఆస్పత్రిలో చేర్చి న ఆయనకు వైద్యులు అత్యవసర వైద్య చికిత్సలు అందిస్తున్నారు. చో రామస్వామి గత ఏడాది పాటు అనారోగ్యంతో బాధ పడుతూ వైద్య చికిత్సలు పొందుతున్నారు. గత ఏడాది జూన్ మూడో తేదీన అనారోగ్యానికి గురవడంలో స్థానిక గ్రీమ్స్ రోడ్డులో గల అపోలో ఆస్పత్రిలో చేరారు. వైద్య చికిత్సలనంతరం ఆరోగ్యం మెరుగుపడడంతో తిరిగి ఇంటికి చేరుకున్నారు.అయితే అదేనెల 19వ తేదీన అనారోగ్యం కారణంగా మళ్లీ ఆస్పత్రిలో చేరారు. ఆయన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు కనుగొన్నారు. తీవ్ర చికిత్స అనంతరం కోలుకు న్న చో రామస్వామి బుధవారం తిరిగి అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో ఆయనకు వైద్యులు అత్యవసరచికిత్స అందిస్తున్నారు. -
'చో' ఆరోగ్య పరిస్థితి విషమం..
చెన్నై: ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ వ్యాఖ్యాత చో రామస్వామి ఆరోగ్యపరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. తీవ్ర శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చోకు చికిత్స అందిస్తున్నామని, అయితే పరిస్థితి విషమించిందని అపోలో వైద్యులు చెప్పారు. గడిచిన కొద్ది నెలలుగా చో రామస్వామి ఆరోగ్యం క్షీణిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. గత ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చెన్నైకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. అపోలో ఆసుపత్రికి వెళ్లి రామస్వామిని పరామర్శించారు. ఇటు తమిళనాడు సీఎం జయలలితకు అత్యంత ఆప్తుల్లో చో కూడా ఒకరు. -
చో రామస్వామికి జయ పరామర్శ
టీనగర్: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చో రామస్వామిని ముఖ్యమంత్రి జయలలిత గురువారం నేరుగా కలిసి పరామర్శించారు. సీనియర్ పాత్రికేయులు, తుగ్లక్ వారపత్రిక సంపాదకులు అయిన చో రామస్వామి శ్వాసకోశ సమస్యతో కొన్ని రోజులుగా ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొంది ఆపై డిశ్చార్జి అయ్యారు. చెన్నై రాజా అన్నామలైపురంలోగల తన నివాసంలో వైద్య చికిత్సలు అందుకుంటూ వచ్చారు. చెన్నైకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ చో రామస్వామి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఇలావుండగా చో రామస్వామికి మళ్లీ అస్వస్థత ఏర్పడింది. దీంతో ఆయనను గ్రీమ్స్రోడ్డులోగల అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ముఖ్యమంత్రి జయలలిత గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అపోలో ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న చో రామస్వామిని కలిసి పరామర్శించారు. ఆయనకు అందిస్తున్న చికిత్సల గురించి వైద్యుల వద్ద అడిగి తెలుసుకున్నారు. -
రజనీ కోసం..!
* రంగంలోకి దిగిన చో * మోడీ పక్కన కూచోబెట్టే యత్నం * సూపర్ స్టార్ పెదవి విప్పేనా? చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో ప్రఖ్యాత నటుడు సూపర్‌స్టార్ రజనీ కాంత్ వాయిస్‌ను దక్కించుకునేందుకు కమలనాథులు కుస్తీలు పడుతున్నారు. మోడీ, రజనీ కాంత్‌ల భేటీకి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రజనీతో సన్నిహితంగా ఉండే, బీజేపీ వాది, తుగ్లక్ పత్రిక సంపాదకుడు చో రామస్వామిని రంగంలోకి దించారు. దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న అశేష అభిమాన లోకం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ కథానాయకుడిని రాజకీయ అరంగేట్రం చేయించేందుకు అభిమానులు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఓ దశలో ఏకంగా రజనీకాంత్ పేరిట పార్టీని, జెండాను ప్రకటించి సంచలనానికి తెరదీశారు. అభిమానుల అత్యుత్సాహానికి ఉలిక్కిపడ్డ సూపర్ స్టార్ 'దేవుడు ఆదేశిస్తే...రాజకీయాల్లోకి వస్తాను' అంటూ అందరి నోళ్లను మూయించారు. ఆ రత్వాత కొన్నాళ్లకు రజనీ రాజకీయ ప్రస్తావన గురించిన ఊసేలేదు. ఈ పరిస్థితుల్లో తాజాగా మళ్లీ రజనీ రాజకీయ ప్రవేశం, ఆయన గళం ఎవరికి చిక్కేనో అన్న ప్రస్తావనలు తెర మీదకు వస్తున్నాయి. ఇందుకు కారణం బీజేపీ పవనాలు దేశంలో వీస్తుండటమే. బీజేపీ వర్గాలతో సన్నిహితంగా రజనీకాంత్ ఉండేవారని చెప్పవచ్చు. ఇందుకు గతంలో ఆయన ఇచ్చిన 'వాయిస్' ఓ నిదర్శనం. ఆ తర్వాత కొన్నాళ్లకు రజనీ రాజకీయ ప్రస్తావన గురించిన ఊసేలేదు. ఈ పరిస్థితుల్లో తాజాగా మళ్లీ రజనీ రాజకీయ ప్రవేశం, ఆయన గళం ఎవరికి చిక్కేనో అన్న ప్రస్తావనలు తెర మీదకు వస్తున్నాయి. ఇందుకు కారణం బీజేపీ పవనాలు దేశంలో వీస్తుండటమే. బీజేపీ వర్గాలతో సన్నిహితంగా రజనీకాంత్ ఉండే వారని చెప్పవచ్చు. ఇందుకు గతంలో ఆయన ఇచ్చిన ‘వాయిస్’ ఓ నిదర్శనం. వాయిస్: తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానప్పటికీ తన వాయిస్‌ను మాత్రం ఏదో ఒక పార్టీకి పరోక్షంగా రజనీ కాంత్ ఇస్తూనే ఉన్నారు. ఎన్నికల వేళ ఆయన ఈ పరోక్ష వ్యాఖ్యలు సంధించి, తద్వారా తన అభిమానులను ఆ పార్టీకి ఓట్లు వేసే రీతిలో సంకేతం ఇస్తున్నారు. 1996 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, దివంగత నేత మూపనార్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్‌కు మద్దతుగా, 1998లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, డీఎంకే కూటమికి, 2004 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అన్నాడీఎంకే కూటమికి మద్దతుగా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 1996,1998 ఎన్నికల్లో తన వాయిస్ పనిచేసినా, 2004లో చతికిల బడటంతో రజనీ ఖంగు తిన్నారు. దీంతో 2009 లోక్ సభ ఎన్నికల్లో మౌనంగానే ఉన్నారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో తన మౌనాన్ని వీడిన రజనీ కాంత్ అన్నాడీఎంకేకు మద్దతుగా వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. అన్నాడీఎంకే అఖండ మెజారిటీ సాధించడంతో మళ్లీ రజనీ వాయిస్‌కు డిమాండ్ ఏర్పడింది. రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో మెగా కూటమి ఆవిర్భవించనున్న దృష్ట్యా, తమకు మద్దతుగా రజనీ గళాన్ని సొంతం చేసుకునే పనిలో పడ్డాయి. భేటీకి ప్రయత్నం: రజనీ వాయిస్ తమకు అనుకూలంగా మలచుకోవాలంటే తమ పార్టీ ప్రధాని అభ్యర్ధి మోడీ ద్వారా సంప్రదింపులు జరపాలన్న నిర్ణయానికి రాష్ట్ర పార్టీ వర్గాలు వచ్చాయి. గతంలో రజనీ అనారోగ్యంతో ఉన్న సమయంలో మోడీ పరామర్శించి ఉండటం, గుజరాత్లో జరుగుతున్న అభివృద్ధి, నదుల అనుసంధానం గురించి రజనీ కాంత్ కితాబు ఇచ్చిన సందర్భాలు ఉన్నారుు. నదుల అనుసంధానానికి తన వంతుగా గతంలో రూ. కోటి విరాళాన్ని సైతం ప్రకటించిన సందర్భం ఉంది. దీంతో మోడీని పీఎం చేయడానికి రజనీ కాంత్ తప్పకుండా తమకు సహకరిస్తారన్న ధీమాను కమలనాథులు వ్యక్తం చేస్తున్నారు. రజనీ కాంత్, మోడీల భేటీకి తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. రంగంలోకి చో: రజనీ కాంత్, మోడీల భేటీ ప్రయత్నాల అమలుకు చో రామస్వామిని రంగంలోకి దించారు. బీజేపీ వాదిగా, సీఎం జయలలితకు సన్నిహితుడిగా, తుగ్లక్ పత్రిక సంపాదకుడిగా, రజనీ కాంత్‌కు మంచి మిత్రుడిగా చో రామస్వామి వ్యవహరిస్తున్నారు. చో తన తొలి మద్దతును మోడీకి ప్రకటించడంతో, ఆయన ద్వారా రజనీ కాంత్ అపాయింట్ మెంట్ చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నారుు. ఈనెల ఎనిమిదో తేదీన ‘నమో’ మహానాడుకు నరేంద్ర మోడీ చెన్నై వస్తున్న దృష్ట్యా, అదే రోజు ఎలాగైనా వారి మధ్య భేటీకి ముహూర్తం కుదిర్చే పనిలో ఉన్నారు. ఎనిమిదో తేదీ మిస్సయిన పక్షంలో రజనీకాంత్ మరి కొద్దిరోజులు చెన్నైలో ఉండరు. కోచ్చడయాన్ చిత్ర వ్యవహారం నిమిత్తం ఆయన ఈనెల పదిన చైనా వెళ్లేందుకు నిర్ణయించినట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. రజనీ తమకు అనుకూలంగా వాయిస్ ఇచ్చిన పక్షంలో, అధికార పగ్గాలు చేపట్టాక, ఆయనకు రాజ్యసభ పదవి ఇవ్వడం ఖాయం అంటూ బీజేపీ సీనియర్ నేత ఒకరు ఆఫర్ ప్రకటించడం గమనార్హం. అయితే ఈ కథా నాయకుడు కమలనాథులకు చిక్కేనా అన్నది వేచి చూడాల్సిందే.!