
'చో' ఆరోగ్య పరిస్థితి విషమం..
చెన్నై: ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ వ్యాఖ్యాత చో రామస్వామి ఆరోగ్యపరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. తీవ్ర శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చోకు చికిత్స అందిస్తున్నామని, అయితే పరిస్థితి విషమించిందని అపోలో వైద్యులు చెప్పారు.
గడిచిన కొద్ది నెలలుగా చో రామస్వామి ఆరోగ్యం క్షీణిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. గత ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చెన్నైకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. అపోలో ఆసుపత్రికి వెళ్లి రామస్వామిని పరామర్శించారు. ఇటు తమిళనాడు సీఎం జయలలితకు అత్యంత ఆప్తుల్లో చో కూడా ఒకరు.