
సాక్షి, చెన్నై : సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్రఅనారోగ్యానికి గురయ్యారన్న వార్తల్లో వాస్తవం లేదని రజనీకాంత్ పీఆర్వో రియాజ్ వివరణ ఇచ్చారు. రజనీకాంత్ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారని, వదంతులు నమ్మొద్దని కోరారు.
రజనీకాంత్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారంటూ తమిళనాడు వ్యాప్తంగా వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్ బుక్‌లలో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. రజనీకాంత్ ఆరోగ్యం క్షీణించిందని, ఆసుపత్రిలో చేరినట్టు వస్తున్న వార్తలను రజనీకాంత్ పీఆర్వో కొట్టిపడేశారు. మరోవైపు శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన 2.0 చిత్రం నవంబర్ 29న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. రజనీకాంత్ ప్రస్తుతం పేటా అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
Comments
Please login to add a commentAdd a comment