సినిమా నటుడు, సినిమా స్క్రిప్టు రచయిత, న్యాయవాది, నాటక రచయిత, పత్రికా రచయిత... ఇలా చెప్పుకొంటూ పోతే చో రామస్వామి గురించి బోలెడన్ని అంశాలున్నాయి. ఎప్పుడూ నున్నగా గీసిన గుండు, పెద్ద కళ్లజోడు, నుదుటన విభూది బొట్టు.. ఇదీ ఆయన స్వరూపం. 1934 అక్టోబర్ 5వ తేదీన జన్మించిన ఈయన.. 'తుగ్లక్' అనే పత్రికను స్థాపించడంతో దాని సంపాదకుడిగానే ఎక్కువ ప్రసిద్ధి చెందారు. మహ్మద్ బిన్ తుగ్లక్ పేరును ఆయన రాజకీయ వ్యంగ్యాస్త్రంగానే ఉపయోగించారు గానీ.. దానికి, చో రామస్వామికి మధ్య విడదీయలేని బంధం ఉంది.