ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చో రామస్వామిని ముఖ్యమంత్రి జయలలిత గురువారం నేరుగా కలిసి పరామర్శించారు. సీనియర్ పాత్రికేయులు
టీనగర్: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చో రామస్వామిని ముఖ్యమంత్రి జయలలిత గురువారం నేరుగా కలిసి పరామర్శించారు. సీనియర్ పాత్రికేయులు, తుగ్లక్ వారపత్రిక సంపాదకులు అయిన చో రామస్వామి శ్వాసకోశ సమస్యతో కొన్ని రోజులుగా ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొంది ఆపై డిశ్చార్జి అయ్యారు. చెన్నై రాజా అన్నామలైపురంలోగల తన నివాసంలో వైద్య చికిత్సలు అందుకుంటూ వచ్చారు. చెన్నైకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ చో రామస్వామి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఇలావుండగా చో రామస్వామికి మళ్లీ అస్వస్థత ఏర్పడింది. దీంతో ఆయనను గ్రీమ్స్‌రోడ్డులోగల అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ముఖ్యమంత్రి జయలలిత గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అపోలో ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న చో రామస్వామిని కలిసి పరామర్శించారు. ఆయనకు అందిస్తున్న చికిత్సల గురించి వైద్యుల వద్ద అడిగి తెలుసుకున్నారు.