కోడుమూరు(కర్నూలు): ఉడికి ఉడకని కిచిడి తిని 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ఆమడగుంట్ల బీసీ హాస్టల్‌లో సోమవారం జరిగింది. హాస్టల్‌లో ఉదయం వండిన కిచిడి సరిగా ఉడకకపోవడంతో.. విద్యార్థులకు కడుపు నొప్పి మొదలైంది. దీంతో అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్ధుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.