శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం అడపాకలో మంగళవారం రాత్రి ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది.
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం అడపాకలో మంగళవారం రాత్రి ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. దసరా మామూళ్ల విషయమై గ్రామంలోని రెండు కులాల వారు కొట్టుకున్నారు. దీంతో పోలీసులు అడపాకలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. రెండు వర్గాలకు చెందిన దాదాపు 30 మందిపై కేసులు నమోదు చేశారు. డీఎస్పీ, సీఐ గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.