సాక్షి, శ్రీకాకుళం : దసరా సెలవుల్లో చాలామంది సకుటుంబ సపరివారంగా ఊరు వెళ్దామనుకుంటున్నారు. ఇంట్లో విలువైన వస్తువులు, వాటి రక్షణ దృష్ట్యా భయాందోళనతో తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం పరిపాటి. అటువంటి భయాందోళనలు అవసరం లేదంటున్నారు జిల్లా పోలీసులు. ఏపీ పోలీస్ ప్రత్యేకంగా రూపొందించిన లాక్ట్ హౌస్ మానటరింగ్ సిస్టం (ఎల్‌హెచ్‌ఎంఎస్)తో తాళం వేసి ఉన్న మీ ఇంటికి పూర్తి భద్రత కల్పి స్తామని భరోసా ఇస్తున్నారు. ముఖ్యంగా ప్లేస్టోర్‌లో ‘ఎల్‌హెచ్‌ఎంఎస్ ఏపీ పోలీస్’ డౌన్‌లోడ్ చేసుకుని, దాన్ని ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు.
ఎలా పని చేస్తుందంటే..
మీరు ఎల్‌హెచ్‌ఎంఎస్‌లో ఏ రోజు, ఏ సమయం, నుంచి ఎప్పటివరకూ మీ ఇంటిపై పోలీసులు నిఘా ఉంచాలో తదితర విషయాలను అందులో నింపాలి. ఆ తర్వాత రిక్వెస్ట్‌ను సబ్మిట్ చేస్తే చాలు... ఎల్‌హెచ్‌ఎంఎస్ రిక్వెస్ట్ పెట్టగానే పోలీసులు మీ ఇంటికి వస్తారు. ఎల్‌హెచ్‌ఎంఎస్‌లో ప్రధానమైన ఒక చిన్న కెమెరాను మీ పరిసరాల్లోనే రహస్యంగా అమరుస్తారు. ఇంటికి తాళం వేసిన తర్వాత కెమెరా ఆన్ అవుతోంది. ఎవరైనా దొంగలు ఇంట్లోకి ప్రవేశిస్తే చాలు వెంటనే కెమెరాలో నిక్షిప్తమవుతోంది. పోలీసులకు సమాచారం సైరన్ ద్వారా తెలు స్తోంది. క్షణాల్లోనే వారు ఇంటికి చేరుకుంటారు. దొంగలను అదుపులోకి తీసుకుంటారు. శ్రీకాకుళం నగర శివారు ప్రాంతాలే దొంగలకు అడ్డాగా మారుతోంది. ఏటా దసరా, సంక్రాంతి సమయాల్లో దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment