మాకవరపాలెం, న్యూస్‌లైన్ : పీఏసీఎస్ ద్వారా తెలుగుదేశం పార్టీ రైతులకు రుణాలు పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించడంతో దేశం, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వివాదం తలెత్తింది. డీసీసీబీ ైచైర్మన్ సమక్షంలోనే రెండు పార్టీల మధ్య ఘర్షణ తారస్థాయికి చేరింది. చివరకు చైర్మన్ సర్దిచెప్పడంతో ఇరువర్గాల వారు శాంతించారు. స్థానిక పీఏసీఎస్‌కు ఇటీవల రూ. 50 లక్షలు మంజూరయ్యాయి. దీంతో ఖరీఫ్ కావడంతో రైతులు రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవడం ప్రారంభించారు. వచ్చిన నిధులను దేశంపార్టీకి చెందిన రైతులకు మాత్రమే రుణాలు ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, రైతులు గత కొంతకాలంగా ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పీఏఎస్‌కు సోమవారం డీసీసీబీ చైర్మన్ సుకుమారవర్మ రావడంతో ఇరు పార్టీలకు చెందిన వారు అక్కడకు చేరుకున్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్ మండలశాఖ అధ్యక్షుడు రుత్తల జమీందారుతోపాటు వివిధ గ్రామాల మాజీ సర్పంచ్‌లు, నాయకులు డీసీసీబీ చైర్మన్‌కు సమస్యపై ఫిర్యాదు చేశారు. రూ. 50 లక్షలు వస్తే కేవలం రూ.4 లక్షలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన డెరైక్టర్లకు కేటాయించారన్నారు.
పీఏసీఎస్ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కావడంతో ఆ పార్టీ రైతుల నుంచి బ్యాంకు సిబ్బందితోపాటు డెరైక్టర్లు రుణాలు అందించేందుకు పాసుపుస్తకాల జెరాక్స్‌లు తదితర పత్రాలను సేకరిస్తున్నారని తెలిపారు. ఈసందర్భంగా పీఏసీఎస్ అధ్యక్షుడు అల్లు రామునాయుడుతో కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. దీంతో రెండు పార్టీలకు చెందినవారి మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఒకానొక దశలో కొట్లాటకు దారితీసింది. పోలీసులు, చైర్మన్ జోక్యం చేసుకున్నా వారు శాంతించకపోవడంతో అసహనానికి గురైన వర్మ కుర్చీలోనుంచి లేచిపోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంపార్టీ వారికే రుణాలు ఇచ్చి మిగిలిన వారికి ఇవ్వమని ఎవరు చెప్పినా సహించేది లేదని సీఈఓ శెట్టి గోవిందను హెచ్చరించారు. బుధవారం సాయంత్రానికి అర్హులైన రైతులంతా తమ దరఖాస్తులను బ్యాంకు అధ్యక్షుడు లేదా సీఈఓకు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో తూటిపాల సర్పంచ్ గవిరెడ్డి ప్రసాద్, శెట్టిపాలెం, కొండలఅగ్రహారం మాజీ సర్పంచ్‌లు వర్రిపాత్రుడు, చిటికెల రమణ పాల్గొన్నారు.
పీఏసీఎస్‌లో ఇరు పార్టీల సభ్యుల మధ్య ఘర్షణ
Published Tue, Sep 24 2013 2:56 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement