ప్రభుత్వ సిఫార్సు నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టులో పిల్
బెంగళూరు: కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమీషన్(కేపీఎస్సీ) అధ్యక్ష, సభ్యుల నియామకానికి సంబంధించి గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ల మధ్య తలెత్తిన వివాదం ఇప్పుడిక హైకోర్టుకు చేరింది. కేపీఎస్సీ అధ్యక్ష స్థానానికి వి.ఆర్.సుదర్శన్‌తో పాటు ఇత ర సభ్యుల నియామకానికి ప్రభుత్వం పంపిన సిఫార్సును ప్రశ్నిస్తూ సామాజిక కార్యకర్త టి.జె.అబ్రహాం హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని(పిల్) దాఖలు చేశా రు.
రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన కేపీఎస్సీ అధ్యక్ష, సభ్యుల నియామకానికి గవర్నర్ ఆధ్వర్యంలో మార్గదర్శకాలను రూపొందించాలని, ఈ మార్గదర్శకాలు వె లువడే వరకు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన జాబితా ను పక్కన పెడుతూ గవర్నర్ ఆదేశాలు జారీ చేయాల్సిందిగా సూచించాలని ఈ వ్యాజ్యంలో కోరారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రానుంది.
కోర్టుకెక్కిన ‘కేపీఎస్సీ’ వివాదం
Published Thu, Jan 15 2015 2:42 AM | Last Updated on Tue, Oct 30 2018 5:51 PM
Advertisement