Public litigation
-
AP: ఎంపీ రఘురామకృష్ణరాజుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
సాక్షి, అమరావతి: ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్‌కు చెల్లించే పన్నులను ఆదాయంగా చూపి ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఇప్పటికే ఒకసారి తలంటిన హైకోర్టు తాజాగా మరోసారి తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసింది. రుణం పొందకుండా ప్రభుత్వ యత్నాలను అడ్డుకోవాలన్న రఘురామకృష్ణరాజు అభ్యర్థనను తోసిపుచ్చింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను శాసించేందుకు మీరెవరంటూ నిలదీసింది. అసలు ఈ వ్యాజ్యం నిరర్థకమైందని, ఈ వ్యాజ్యాన్ని తామెందుకు విచారించాలని న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని రఘురామకృష్ణరాజును ఉద్దేశించి.. ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆపేందుకే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు అనిపిస్తోందని మండిపడింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని పునరుద్ఘాటించింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు ఎలా సాగాలో చూసేందుకు తామేమీ కంపెనీ సెక్రటరీలం కాదని, హైకోర్టు జడ్జీలమని వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులుగా తామేం చేయాలో రాజ్యాంగం స్పష్టంగా చెప్పిందని, దాని ప్రకారమే నడుచుకుంటామని తేల్చి చెప్పింది. ప్రభుత్వాలను తాము నడపడం లేదని, ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కోర్టుల పని కాదని పేర్కొంది. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వం నుంచి కనీస వివరణ కూడా కోరబోమని స్పష్టం చేసిన ధర్మాసనం దీనిపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాము జారీ చేయబోయే ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని ధర్మాసనం ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజుకు తేల్చి చెప్పింది. చట్ట సవరణలపై పిల్... ఏపీ (విదేశీ మద్యం, దేశీయ తయారీ విదేశీ మద్యం వ్యాపార నియంత్రణ) చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఇటీవల తెచ్చిన రెండు చట్టాలను సవాలు చేస్తూ రఘురామకష్ణరాజు హైకోర్టులో పిల్ దాఖలు చేయడం తెలిసిందే. కొత్త సవరణ చట్టాల ద్వారా సంచిత నిధికి చెందిన మొత్తాలను ప్రభుత్వం ఆదాయంగా చూపి రుణాలను పొందేందుకు ప్రయత్నిస్తోందని, స్పెషల్ మార్జిన్ మనీని తాకట్టు పెట్టి బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఎలాంటి రుణం పొందకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై గత వారం విచారణ జరిపిన సీజే ధర్మాసనం తాజాగా మరోసారి విచారించింది. రుణాలపై మీరెలా నిర్దేశిస్తారు..? పిటిషనర్ తరఫు న్యాయవాది అంబటి సుధాకరరావు వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. సంచిత నిధికి వెళ్లాల్సిన మొత్తాలను ఆదాయంగా చూపుతూ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందుతోందన్నారు. స్పెషల్ మార్జిన్ మనీని తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటుందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను మీరెలా శాసిస్తారంటూ రఘురామకృష్ణరాజును ప్రశ్నించింది. ప్రభుత్వం రుణాలు ఎలా తీసుకోవాలో మీరు నిర్దేశిస్తారా? అంటూ అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను శాసించేందుకు అసలు మీరెవరంటూ నిలదీసింది. తన ఆర్థిక వ్యవహారాలను ఎలా చక్కబెట్టుకోవాలో ప్రభుత్వానికి బాగా తెలుసని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో సుధాకరరావు స్పందిస్తూ రాష్ట్ర సంచిత నిధికి చెందిన మొత్తాలను ప్రభుత్వం ఇష్టానుసారంగా వాడేస్తోందని, ఈ నిధిపై ఆర్బీఐకి మాత్రమే నియంత్రణ ఉంటుందని చెప్పారు. సంచిత నిధికి వెళ్లాల్సిన మొత్తాలను ఏపీ బెవరేజ్ కార్పొరేషన్‌కు మళ్లిస్తున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలు వద్దంటారా? దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయవద్దంటారా? అంటూ ప్రశ్నించింది. పేదలు, సామాన్యులకు రాజ్యాంగం అర్థం కాదని, వారికి కావాల్సింది సంక్షేమ పథకాల ద్వారా ఆదుకోవడం మాత్రమేనని ధర్మాసనం తెలిపింది. అసలు పిటిషనర్ ఎవరంటూ ధర్మాసనం ఆరా తీసింది. పిటిషనర్ ఎంపీ అంటూ సుధాకరరావు వాదనలు కొనసాగించారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు జారీ చేసి ప్రభుత్వం పెద్ద మొత్తంలో రుణం పొందిందని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలతో పిటిషనర్‌కు ఏం పని? అని ప్రశ్నించింది. దీనిపై సుధాకరరావు స్పందిస్తూ సంచిత నిధికి వెళ్లాల్సిన మొత్తాలో కాదో కావాలంటే ప్రభుత్వాన్నే అడగాలన్నారు. దీంతో ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. మేమెందుకు ప్రభుత్వాన్ని వివరణ కోరాలి..? ప్రభుత్వాన్ని ఏం ఎందుకు వివరణ అడగాలి? మేం ఎలాంటి వివరణ అడిగేది లేదు. ప్రభుత్వం నుంచి అఫిడవిట్ కూడా కోరం. ఇదో నిరర్థక వ్యాజ్యం. ఇందులో ఎలాంటి ప్రజా ప్రయోజనాలు లేవు. ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కోర్టుల పని కాదు. ఈ వ్యాజ్యంలో మేం ఉత్తర్వులు జారీ చేస్తాం. కావాలంటే మేం ఇచ్చే ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకెళ్లొచ్చు. ఆర్థిక సంస్థలు సంతృప్తి చెందితేనే రుణం ఇస్తాయి. లేకుంటే లేదు. ఆర్థిక సంస్థలకు లేని ఇబ్బంది మీకెందుకు? మీరు, నేను ఓ ఆర్థిక సంస్థ వద్దకు అప్పు కోసం వెళితే ముందుగా మనకు అప్పు చెల్లించే స్థోమత ఉందా? లేదా? అనేది చూస్తారు. దాన్ని బట్టి రుణం ఇస్తారు. ఇది పూర్తిగా అప్పు ఇచ్చే వ్యక్తి, తీసుకునే వ్యక్తికి సంబంధించిన వ్యవహారం. ఇందులో మూడో వ్యక్తి జోక్యానికి ఆస్కారం ఎక్కడుంది? రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండాలని మీరు అనుకుంటున్నారు (ఈ సందర్భంగా ధర్మాసనం రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌లోని ఓ పేరాను చదివి వినిపించింది). ప్రభుత్వాన్ని తన వ్యవహారాలను తాను చక్కబెట్టుకోనివ్వండి. ప్రభుత్వాలను మేం నడపడం లేదు. మేమేం చేయాలో రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. మీ తీరు చూస్తుంటే కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లను కూడా సవాలు చేసేలా ఉన్నారు. ప్రభుత్వం రుణాలు తీసుకుంటే ప్రజలు ఎలా ప్రభావితం అవుతారు? ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎవరు దాఖలు చేస్తారో మీకు తెలుసు కదా. అణగారిన వర్గాలు, కోర్టుకు రాలేని స్థితిలో ఉన్న వ్యక్తులు పిల్ వేయాలి. మరి మీరెందుకు ఈ వ్యాజ్యం వేశారు? సంక్షేమ పథకాలను ఆపేందుకు ఈ వ్యాజ్యం దాఖలు చేసినట్లుగా ఉంది. ఈ ప్రభుత్వమే కాదు, చాలా ప్రభుత్వాలు చాలా చేస్తున్నాయి. ప్రతీ దాంట్లోనూ జోక్యం చేసుకోవడం కోర్టుల పని కాదు. ఈ వ్యాజ్యాన్ని అసలు మేమెందుకు విచారించాలి? ఈ వ్యాజ్యంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తాం’ అంటూ ధర్మాసనం రఘురామకృష్ణరాజును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ సమయంలో సుధాకరరావు జోక్యం చేసుకుంటూ ఏదో చెప్పబోగా.. ‘మేమేం కంపెనీ సెక్రటరీలం కాదు. హైకోర్టు జడ్జీలం. మీకు మరోసారి చెబుతున్నాం మేం ప్రభుత్వాలను నడపడం లేదు’ అని ధర్మాసనం తేల్చి చెప్పింది. శాసించేందుకు మీరెవరు? ‘‘తన ఆర్థిక వ్యవహారాలు ఎలా నిర్వహించుకోవాలో ప్రభుత్వానికి బాగా తెలుసు. సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వం రుణాలు తెస్తే ప్రజలు ఎలా ప్రభావితం అవుతారు? ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను శాసించేందుకు మీరెవరు? ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు ఎలా సాగాలో మీరెలా చెబుతారు? ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆపేందుకే మీరు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినట్లుంది. ప్రభుత్వానికి రుణం ఇచ్చే వారికి లేని ఇబ్బంది మీకెందుకు? ఈ వ్యవహారంలో మేం ప్రభుత్వం నుంచి వివరణ కూడా కోరబోం. ఈ వ్యాజ్యంలో మేం తగిన ఉత్తర్వులు వెలువరిస్తాం. ఆ ఉత్తర్వులపై మీరు కావాలనుకుంటే సుప్రీంకోర్టు కూడా వెళ్లొచ్చు’’ – ఎంపీ రఘురామకృష్ణరాజునుద్దేశించి హైకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు -
రఘురామ వేసిన పిటిషన్లో ఎటువంటి విషయం లేదు: సజ్జల
-
సంక్షేమ పాలనను పక్కదోవ పట్టించేందుకే కేసులు: సజ్జల
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న సంక్షేమ పాలనను పక్కదోవ పట్టించేందుకే రఘురామకృష్ణంరాజు కేసులు వేశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఇలాంటి దురుద్దేశపూరితమైన కేసులను కోర్టులు కూడా స్వీకరించకూడదని అన్నారు. సుప్రీంకోర్డు కూడా పిల్లు దుర్వినియోగం కాకుండా చూడాలని సూచించిందని గుర్తుచేశారు. చదవండి: మంత్రి కేటీఆర్ మత్తులో ఉండి ట్వీట్ చేశారా? : రేవంత్‌రెడ్డి ఈ కేసును అడ్డు పెట్టుకుని వాళ్లు చేసిన విషప్రచారం అంతాఇంతా కాదని పేర్కొన్నారు. ఎల్లో మీడియా అసంబద్ధమైన చర్చలు పెట్టిందని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వారి పైత్యం పతాక స్థాయికి చేరింది.. చివరకు న్యాయమే గెలిచింది’ అని ఆయన బుధవారం నాటి మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. ఇలాంటి దుష్ప్రచారాలపై కోర్టులు కూడా దృష్టి సారించాలని సజ్జల విజ్ఞప్తి చేశారు. దురుద్దేశపూరితమైన ప్రచారాలను సూమోటోగా తీసుకోవాలని కోరారు. చదవండి: నాకు లవర్‌ను వెతికి పెట్టండి: ఎమ్మెల్యేకు యువకుడి లేఖ వైరల్ -
తప్పుడు కథనం ఆధారంగా ‘పిల్’ ఏమిటి?
ట్యాపింగ్‌కు సంబంధించి ఆంధ్రజ్యోతి కథనంలో ఎలాంటి ఆధారాలు చూపలేదు. ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందనేందుకు ఆధారాలు ఏమిటో ఆ పత్రికను అడగాలి. గాలి పోగేసి రాసిన వార్తా కథనం ఆధారంగా దాఖలు చేసిన ఈ వ్యాజ్యంలో ఆ పత్రికను ప్రతివాదిగా చేర్చి తీరాలి. అప్పుడే వాస్తవాలు, కుట్ర బయటకు వస్తాయి. ఆ కథనానికి ఆధారాలు ఏమిటో చూపించాల్సిన బాధ్యత ఆ పత్రికపై ఉంది. – అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి సాక్షి, అమరావతి: న్యాయమూర్తుల ఫోన్లను తాము ట్యాపింగ్ చేస్తున్నామంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన తప్పుడు కథనం ఆధారంగా దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారించడంపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందనడానికి ఆ కథనంలో ఎలాంటి రుజువులు చూపలేదని హైకోర్టుకు నివేదించింది. తప్పుడు ఆరోపణలతో ప్రభుత్వంపై బురదజల్లుతున్న ఆ పత్రికను ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చి తీరాలని పట్టుబట్టింది. ట్యాపింగ్ విషయంలో ఆ పత్రికను వివరణ కోరడంతో పాటు ఆధారాలు చూపేలా ఆదేశించాలని కోరింది. ఆధారాలు లేకుండా కథనం రాసి, దాని ఆధారంగా దాఖలైన వ్యాజ్యాన్ని విచారించడం న్యాయసమ్మతం కాదని పేర్కొంది. అయితే ఆ పత్రికను ప్రతివాదిగా చేయబోమని తొలుత చెప్పిన హైకోర్టు, ఆ తరువాత సందర్భాన్ని బట్టి దీనిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. న్యాయమూర్తులపై నిఘాకు ప్రత్యేకంగా ఓ ఐపీఎస్ అధికారి నియమితులయ్యారని పిటిషనర్ ఆరోపించిన నేపథ్యంలో ఆయన పేరుతో సహా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాదిని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ దొనాడి రమేష్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ► న్యాయమూర్తుల ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం ఆధారంగా విశాఖపట్నంకు చెందిన నిమ్మి గ్రేస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. రాజకీయ పెద్దల ప్రోత్సాహంతో ఫోన్లను పోలీసులు ట్యాపింగ్ చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాదిశ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. పత్రికా కథనం ఆధారంగా పిల్ ఎలా వేస్తారని ధర్మాసనం ప్రశ్నించగా.. గతంలో వాటిని కోర్టులు పరిగణనలోకి తీసుకున్న సందర్భాలున్నాయని చెప్పారు. న్యాయమూర్తులే చెప్పారన్నట్లుగా... ► హోంశాఖ కార్యదర్శి తరఫున హాజరైన ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. ఆ కథనం న్యాయమూర్తి స్వయంగాట్యాపింగ్ గురించి చెప్పినట్లుగా ఉందన్నారు. తనకు తెలిసినంత వరకు న్యాయమూర్తులు మీడియాతో మాట్లాడరని, ఆ పత్రిక మాత్రం వారే చెప్పారన్నట్లుగా కథనం ప్రచురించడాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. ఆ కథనం కోర్టు ధిక్కారమే అవుతుందన్నారు. ఆధారాలేమిటో అడగండి.. ► ట్యాపింగ్‌కు సంబంధించి ఆ కథనంలో ఎలాంటి ఆధారాలు చూపలేదని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకరరెడ్డి నివేదించారు. ► ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందనేందుకు ఆధారాలు ఏమిటో ఆ పత్రికను అడగాలని, ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చాలని పట్టుబట్టారు. గాలి పోగేసి రాసిన వార్తా కథనం ఆధారంగా దాఖలు చేసిన ఈ వ్యాజ్యంలో ఆ పత్రికను ప్రతివాదిగా చేర్చి తీరాలని, అప్పుడే వాస్తవాలు, కుట్ర బయటకు వస్తాయని ఏఏజీ పేర్కొన్నారు. ఏ దర్యాప్తునకు ఆదేశించినా తమకు ఇబ్బంది లేదని, ఆ కథనానికి ఆధారాలు ఏమిటో చూపించాల్సిన బాధ్యత ఆ పత్రికపై ఉందన్నారు. -
కుక్కల నుంచి రక్షణ కల్పించండి
సాక్షి, హైదరాబాద్: తమ గ్రామంలో 26 మందిని కుక్కలు కరిచాయని, వాటి నుంచి రక్షణ కల్పించడంతో పాటు రేబిస్ వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచేలా ఆదేశించాలని నల్లగొండ జిల్లా ముడుగులపల్లి మండలం కన్నెకల్ గ్రామానికి చెందిన ఉపేందర్‌రెడ్డి ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలుచేశారు. దీన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. కుక్కకాటుకు వినియోగించే రేబిస్ వ్యాక్సిన్‌ను అన్ని జిల్లాలకు ఎలా సరఫరా చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే కన్నెకల్ గ్రామంలో కుక్క కాటు బారిన పడిన వారిని తరలించేందుకు అంబులెన్స్, రేబిస్ వ్యాక్సిన్‌ను గ్రామస్తులకు అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. కన్నెకల్ గ్రామస్తులు తరచుగా కుక్కకాటుకు గురవుతున్నారని, రేబిస్ వ్యాక్సిన్ ఆ గ్రామంలో అందుబాటులో లేకపోవడంతో 10 కిలోమీటర్ల దూరంలోని మండల కేంద్రానికి వెళ్లాల్సి వస్తోందని పిటిషనర్ తరఫున వేణుధర్‌రెడ్డి నివేదించారు. కన్నెకల్‌లో పశువుల ఆస్పత్రితోపాటు హోమియో ఆస్పత్రి అందుబాటులో ఉన్నాయని, డాక్టర్, నర్సింగ్ సిబ్బందిని నియమించి రేబిస్ వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచేలా ఆదేశించాలని కోరారు. డాక్టర్‌ను నియమించాలా వద్దా అన్నది విధానపరమైన నిర్ణయమని, ఈ మేరకు ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంది. -
కుక్కలపై ఉన్న శ్రద్ధ పిల్లలపై ఏదీ?
సాక్షి, హైదరాబాద్: ధనవంతుల కుక్క తప్పిపోతే పోలీసులు సర్వశక్తులనూ ఒడ్డి ఆ కుక్కను పట్టుకున్నారని, అదే పేద వాళ్ల పిల్లలు అదృశ్యమైతే వాళ్ల ఆచూకీ తెలుసుకునేందుకు ఆసక్తి చూపడం లేదంటూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. గతేడాది జూబ్లీహిల్స్‌లో ఓ ధనవంతుడి కుక్క తప్పిపోతే పోలీసులు దర్యాప్తు చేసి పట్టుకుని యజమానికి అప్పగించారని, అయితే రాష్ట్రం లో పిల్లలు అదృశ్యమైన కేసుల్ని పోలీసులు మూసేస్తున్నారని పిల్లో పేర్కొన్నారు. పిల్లల అదృశ్యం కేసుల్ని పూర్తిస్థాయిలో విచారించేలా ప్రతివాదులకు ఆదేశాలివ్వాలని, మూసేసిన కేసుల్ని తెరిచి విచారణ చేపట్టేలా ఉత్తర్వులివ్వాలంటూ న్యా యవాది రాపోలు భాస్కర్ పిల్ దాఖలు చేశారు. దేశంలో ఆడ పిల్లల ఆక్రమ రవాణా జరుగుతోందని, 8,057 వేల పైచిలుకు కేసులు నమోదైతే.. అందులో తెలంగాణలో 229 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇందులో 49 కేసుల్లోనే చార్జిషీటు దాఖలు చేశారన్నారు. తెలంగాణలో 2015 నుంచి 2018 మధ్య కాలంలో 2,122 మంది పిల్లలు అదృశ్యమైతే, అందులో 1,350 మంది బాలికలు ఉన్నారన్నారు. ఇంతవరకు వీరి ఆ చూకీ తెలియలేదన్నారు. పిల్లల ఆచూకీ తెలియక మనోవేదన తో కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతు న్న ఘటనలూ ఉన్నాయన్నా రు. 2015లో 407 మంది పిల్లలు, ఆ తర్వాత మూడేళ్లలో వరసగా 474, 681, 560 మంది చొప్పున పిల్లల అదృశ్యం కేసులు నమోదైతే, వారిలో అత్యధికంగా బాలికలే 1,350 మంది ఉన్నా రని తెలిపారు. పిల్లో ప్రతివాదులుగా హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను చేర్చారు. క్రిమినల్ కేసుల పరిష్కారం: పెండింగ్ కేసుల పరిష్కారంలో భాగంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి 24 క్రిమినల్ పిటిషన్లు, 43 మధ్యంతర దరఖాస్తులను పరిష్కరించారని హైకోర్టు రిజిస్ట్రార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ఆ దుకాణాలను సీజ్ చేయండి
* ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై హైకోర్టు సీరియస్ * వారి లెసైన్సులను రద్దు చేయాలని జీహెచ్ఎంసీకి ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకున్న వ్యాపారుల్లో... వాటిని తొలగిస్తామని హామీ ఇవ్వని వారి షాపులను సీజ్ చేసి, లెసైన్సులను రద్దు చేయాలని జీహెచ్ఎంసీని హైకోర్టు సోమవారం ఆదేశించింది. హైదరాబాద్‌లోని సిద్దంబర్‌బజార్, మహబూబ్‌గంజ్ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపునకు జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ లక్ష్మీనివాస్ అగర్వాల్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం... సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఏఎస్జీ) బి.మహేందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... ఆక్రమణల తొలగింపునకు 120 మంది వ్యాపారులు హామీ ఇచ్చారని, 33 మంది హామీ ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం... హామీ ఇవ్వని వారి దుకాణాలను సీజ్ చేసి, వారి లెసైన్సులను రద్దు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. -
కోర్టుకెక్కిన ‘కేపీఎస్సీ’ వివాదం
ప్రభుత్వ సిఫార్సు నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టులో పిల్ బెంగళూరు: కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమీషన్(కేపీఎస్సీ) అధ్యక్ష, సభ్యుల నియామకానికి సంబంధించి గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ల మధ్య తలెత్తిన వివాదం ఇప్పుడిక హైకోర్టుకు చేరింది. కేపీఎస్సీ అధ్యక్ష స్థానానికి వి.ఆర్.సుదర్శన్‌తో పాటు ఇత ర సభ్యుల నియామకానికి ప్రభుత్వం పంపిన సిఫార్సును ప్రశ్నిస్తూ సామాజిక కార్యకర్త టి.జె.అబ్రహాం హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని(పిల్) దాఖలు చేశా రు. రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన కేపీఎస్సీ అధ్యక్ష, సభ్యుల నియామకానికి గవర్నర్ ఆధ్వర్యంలో మార్గదర్శకాలను రూపొందించాలని, ఈ మార్గదర్శకాలు వె లువడే వరకు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన జాబితా ను పక్కన పెడుతూ గవర్నర్ ఆదేశాలు జారీ చేయాల్సిందిగా సూచించాలని ఈ వ్యాజ్యంలో కోరారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రానుంది.