
సాక్షి, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో అధికార పార్టీ టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు కొట్లాటకు దిగారు. అధికార పార్టీ చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌లా మధ్య శనివారం ప్రోటో కాల్ వివాదం తలెత్తింది. సర్దార్ వల్లభబాయ్ జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో పూలమాలలు వేసే క్రమంలో ప్రోటో కాల్ పాటించాలని వైస్ చైర్మన్ వాగ్వాదానికి దిగాడు. దీంతో అప్పటికే రెండు వర్గాలుగా విడిపోయిన కౌన్సిలర్లు అసభ్య పదజాలంతో నెట్టేసుకుంటు సంఘర్షణకు దిగారు. అక్కడే ఉన్న మరికొంత మంది కౌన్సిలర్లు అపేందుకు ప్రయత్నం చేసినా ఎవరూ ఆగలేదు. చదవండి: మజ్లిస్ మోచేతి నీళ్లు తాగుతున్నారు: కిషన్ రెడ్డి
అక్కడితో ఆగకుండా నాది టీఆర్‌ఎస్, నాది టీఆర్‌ఎస్ అనుకుంటూ సభ్య సమాజం ఇలాంటి వారిని నాయకులుగా ఎన్నుకున్నమా అనే విధంగా ప్రవర్తించారు. అయితే గత కొంత కాలంగా మున్సిపల్‌లో చైర్మన్ రామ తీర్థపు మాధవి, అతని భర్త రాజుకు వైస్ చైర్మన్ మధు రాజేందర్‌కు విభేదాలు కొనసాగుతున్నాయి .గతంలో ఎమ్యెల్యే దృష్టికి వెళ్లిన వారు పట్టించుకోకపోవడంతో గొడవలు ప్రారంభమయ్యాయి అనేది పలువురు వాదిస్తున్నారు. ఏది ఏమైనా ప్రజలకు సేవ చేయాల్సిన కౌన్సిలర్లు కొట్లాడుకోవడం, అందులోనే ఇద్దరూ అధికార పక్ష నాయకులు వాదులాడుకోవడం ఆశ్చర్యకరంగా మారింది. ఇక టీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లు తన్నుకోవడంపై అధిష్టానం, స్థానిక ఎమ్యెల్యే రమేష్ బాబు, జిల్లా మంత్రి కేటీఆర్ స్పందించలేదు. వాల్లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. చదవండి: దుబ్బాక ఉప ఎన్నిక: ఎవరి ధీమా వారిదే
Comments
Please login to add a commentAdd a comment