Vemulawada Municipality
-
టీఆర్ఎస్లో రచ్చ.. తన్నుకున్న కౌన్సిలర్లు
సాక్షి, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో అధికార పార్టీ టీఆర్ఎస్ కౌన్సిలర్లు కొట్లాటకు దిగారు. అధికార పార్టీ చైర్ పర్సన్, వైస్ చైర్మన్లా మధ్య శనివారం ప్రోటో కాల్ వివాదం తలెత్తింది. సర్దార్ వల్లభబాయ్ జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో పూలమాలలు వేసే క్రమంలో ప్రోటో కాల్ పాటించాలని వైస్ చైర్మన్ వాగ్వాదానికి దిగాడు. దీంతో అప్పటికే రెండు వర్గాలుగా విడిపోయిన కౌన్సిలర్లు అసభ్య పదజాలంతో నెట్టేసుకుంటు సంఘర్షణకు దిగారు. అక్కడే ఉన్న మరికొంత మంది కౌన్సిలర్లు అపేందుకు ప్రయత్నం చేసినా ఎవరూ ఆగలేదు. చదవండి: మజ్లిస్ మోచేతి నీళ్లు తాగుతున్నారు: కిషన్ రెడ్డి అక్కడితో ఆగకుండా నాది టీఆర్ఎస్, నాది టీఆర్ఎస్ అనుకుంటూ సభ్య సమాజం ఇలాంటి వారిని నాయకులుగా ఎన్నుకున్నమా అనే విధంగా ప్రవర్తించారు. అయితే గత కొంత కాలంగా మున్సిపల్లో చైర్మన్ రామ తీర్థపు మాధవి, అతని భర్త రాజుకు వైస్ చైర్మన్ మధు రాజేందర్‌కు విభేదాలు కొనసాగుతున్నాయి .గతంలో ఎమ్యెల్యే దృష్టికి వెళ్లిన వారు పట్టించుకోకపోవడంతో గొడవలు ప్రారంభమయ్యాయి అనేది పలువురు వాదిస్తున్నారు. ఏది ఏమైనా ప్రజలకు సేవ చేయాల్సిన కౌన్సిలర్లు కొట్లాడుకోవడం, అందులోనే ఇద్దరూ అధికార పక్ష నాయకులు వాదులాడుకోవడం ఆశ్చర్యకరంగా మారింది. ఇక టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు తన్నుకోవడంపై అధిష్టానం, స్థానిక ఎమ్యెల్యే రమేష్ బాబు, జిల్లా మంత్రి కేటీఆర్ స్పందించలేదు. వాల్లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. చదవండి: దుబ్బాక ఉప ఎన్నిక: ఎవరి ధీమా వారిదే -
కమలానికి షాక్
* బీజేపీని పట్టించుకోని ‘పట్టణ’ ఓటర్లు * నారాయణపేట్‌ను నిలబెట్టుకోవ టానికే ఆ పార్టీ పరిమితం * ఎక్కడా కనిపించని మోడీ హవా * ‘తెలంగాణ’ క్రెడిట్ కూడా ఓట్లు రాల్చని తీరు.. 19 మునిసిపాలిటీల్లో సున్నా * అసెంబ్లీ ఫలితాలూ ఇలాగే ఉంటాయోమోనని నేతల్లో ఆందోళన సాక్షి, హైదరాబాద్: మునిసిపల్ ఎన్నికల ఫలితాలు బీజేపీకి షాక్ ఇచ్చాయి. తెలంగాణకు ఆది నుంచి మద్దతు తెలిపిన పార్టీగా ఉన్న పేరును ఓట్లుగా మలచుకుని ఈసారి కనీసం నాలుగైదు పురపాలక సంఘాల్లో పాగా వేయాలనుకున్న ఆ పార్టీ ఆశలు వమ్మయ్యాయి. ‘తెలంగాణ’ క్రెడిట్‌ను కాంగ్రెస్, టీఆర్ఎస్కే కట్టబెట్టిన ఓటర్లు బీజేపీని పెద్దగా పట్టించుకోలేదు. అతికష్టమ్మీద మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట్ పురపాలక సంఘాన్ని నిలబెట్టుకున్న ఆ పార్టీ, కరీంనగర్ జిల్లా వేములవాడ మున్సిపాలిటీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మెజారిటీ స్థానాలను దక్కించుకున్నా, చైర్మన్ పదవి పొందటానికి రెండు స్థానాల(వార్డులు) దూరంలో ఆగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షమైన టీడీపీకి ఇక్కడ ఒక్క వార్డు కూడా దక్కకపోవటంతో స్వతంత్రుల మద్దతుతో చైర్మన్‌గిరీని దక్కించుకునే అవకాశం ఉంది. అలాగే... నల్లగొండ జిల్లా భువనగిరి మునిసిపాలిటీలో కాంగ్రెస్‌తో సమంగా ఎనిమిది వార్డులు దక్కించుకుంది. ఇక్కడ మిత్రపక్షమైన టీడీపీకి ఏడు వార్డులు రావటంతో రెండు కలిసి మునిసిపాలిటీని దక్కించుకున్నట్లయింది. మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆశలు పెట్టుకున్న మిగతా అన్ని చోట్లా ఆ పార్టీకి తీవ్ర నిరాశే మిగిలింది. అన్ని మునిసిపాలిటీలు కలిపి కేవలం 122 వార్డులు (కార్పొరేషన్లలో 10 డివిజన్లు అదనం) మాత్రమే దక్కటం బీజేపీ దయనీయ పరిస్థితికి నిదర్శనం. బీజేపీతో పోలిస్తే చాలా తక్కువ స్థానాల్లో పోటీ చేసిన మజ్లిస్‌కు 78 వార్డులు (కార్పొరేషన్లలో 18 అదనం) దక్కటం విశేషం. కనిపించని మోడీ ‘హవా’... తెలంగాణ సిద్ధించిన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో రెండు అంశాలు తమకు ఓట్లు కురిపిస్తాయని బీజేపీ ఆశించింది. తెలంగాణ తెచ్చిన పార్టీల్లో ఒకటిగా ప్రజల్లో ఉన్న గుర్తింపు, దేశవ్యాప్తంగా బలంగా ఉందంటున్న మోడీ ప్రభావంతో ఎక్కువ మునిసిపాలీటీల్లో పాగా వేయాలని కమలనాథులు కలలుగన్నారు. ఈ రెండూ పనిచేయలేదని తేలిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఫలితాలు ఇంతకంటే గొప్పగా ఉండవనే ఆందోళనలో పడిపోయారు. కార్పొరేషన్లలోనూ అదే తీరు... పురపాలక సంఘాల తరహాలోనే నగరపాలక సంస్థల్లోనూ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. బీజేీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న నిజామాబాద్ కార్పొరేషన్లో కేవలం ఆరు డివిజన్లే దక్కాయి. అదే మజ్లిస్ ఇక్కడ ఏకంగా 16 స్థానాలు దక్కించుకోవటాన్ని కమలనాథులు పెద్ద పరాభవంగా భావిస్తున్నారు. కరీంనగర్ అసెంబ్లీ సీటుపై గంపెడాశలు పెట్టుకున్న ఆ పార్టీ, అక్కడి కార్పొరేషన్లో కేవలం రెండు డివిజన్లతో సరిపెట్టుకుంది. రామగుండం కార్పొరేషన్లో కూడా రెండింటిని మాత్రమే దక్కించుకోగలిగింది. మూడు కార్పొరేషన్లు కలిపి పది డివిజన్లు రాగా... మజ్లిస్ పార్టీకి పద్దెనిమిది స్థానాలు దక్కటం విశేషం. పందొమ్మిది మున్సిపాలిటీల్లో సున్నా... ఈ ఎన్నికల్లో ఏకంగా పందొమ్మిది పురపాలక సంఘాల్లో బీజేపీ అసలు ఖాతానే తెరవలేకపోయింది. తొమ్మిది మునిసిపాలిటీల్లో ఒక్కో వార్డుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేట్ మునిసిపాలిటీని మాత్రమే నిలబెట్టుకుంది.