బయ్యారం(ఖమ్మం): తగ్గిన ధరల అనుసారంగా పెట్రోల్ పోయకుండా పాతరేటునే కొనసాగిస్తున్న పెట్రోల్‌బంక్ సిబ్బందితో వాహనదారులు వాగ్వివాదానికి దిగారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బయ్యారంలోని అంబాభవాని పెట్రోల్‌బంక్‌లో శనివారం ఉదయం జరిగింది. బయ్యారంలో ఒక్కటే పెట్రోల్‌బంక్‌లో ఉండటంతో.. ఇతర మార్గంలేక తెల్లవారుజాము నుంచి వినియోగదారులు పాత రేటుకే పెట్రోల్ కొట్టించుకున్నారు. ఉదయం కొంతమంది వాహనదారులు ఈ విషయం పై గొడవకు దిగారు. దీంతో పరిస్థితి విషమిస్తుందని గ్రహించిన సిబ్బంది తాజా రేట్లకు పెట్రోల్ విక్రయిస్తున్నారు.