న్యూయార్క్: యెమెన్లో జరుగుతున్న ఘర్షణల్లో గత వారం రోజుల్లో 62 మంది చిన్నారులు ప్రాణాలుకోల్పోయినట్లు యూనిసెఫ్(అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి సంస్థ) ప్రకటించింది. మరో 30 మంది చిన్నారులు గాయాలపాలయినట్లు పేర్కొంది. గత కొన్ని రోజులుగా యెమెన్లో సుస్థిర పాలనకు భంగం వాటిల్లి ఉద్రిక్త పరిస్థితులతో అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితిని ప్రపంచ దేశాలతోపాటు ఐక్యరాజ్య సమితిలోని పలు విభాగాలు గమనిస్తున్నాయి.
ఈ సందర్భంగా యూనిసెఫ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ ' యెమెన్లో జరుగుతున్న ఘర్షణల కారణంగా విద్యా, ఆరోగ్య సంస్థల సేవలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎక్కడ ఏ బాంబులు పడతాయో తెలియని పరిస్థితుల మధ్య ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలి వెళుతుండగా చిన్నారులు తీవ్ర భయాందోళనల్లో కూరుకుపోయారు. మానవత రాహిత్యం చోటుచేసుకుంటుంది. ఇప్పటికే ఆ దేశంలో చిన్నారులు ఆహారలేమి, పోష్టికహారలోపంవంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏం జరిగినా చిన్నారలను రక్షించాల్సిన బాధ్యత వారి భవిష్యత్కు భద్రత కల్పించాల్సిన అవసరం ప్రతిఒక్కరికి ఉంది' అంటూ అందులో పేర్కొంది.
పాపం పసివాళ్లు.. యెమెన్లో 62 మంది మృతి
Published Wed, Apr 1 2015 8:33 AM | Last Updated on Sat, Sep 2 2017 11:42 PM
Advertisement
Advertisement