వాహన యజమానులతో సినీ నిర్మాతల చర్చలు సఫలం | Filmmakers managed to negotiate with the owners of the vehicle | Sakshi
Sakshi News home page

వాహన యజమానులతో సినీ నిర్మాతల చర్చలు సఫలం

Published Fri, May 13 2016 3:11 AM | Last Updated on Fri, Aug 17 2018 2:24 PM

వాహన యజమానులతో సినీ నిర్మాతల చర్చలు సఫలం - Sakshi

వాహన యజమానులతో సినీ నిర్మాతల చర్చలు సఫలం

సాక్షి, హైదరాబాద్: సినీరంగ ప్రముఖులు, వాహన యజమానుల మధ్య నెలకొన్న వివాదం సమసిపోయిందని, డిమాండ్‌కు తగ్గట్టుగానే వాహనాలు తీసుకుని అద్దె చెల్లిస్తామని నిర్మాతల మండలి సభ్యుడు డి.సురేశ్‌బాబు స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో వాహన యజమానులు, సినీ పరిశ్రమ ప్రముఖుల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయని నిర్మాత దిల్‌రాజు తెలిపారు. తాను చనిపోయినట్లు దుష్ర్పచారం చేస్తున్న వారిపై నటుడు వేణుమాధవ్ తలసానికి ఫిర్యాదు చేశారు. అనేక వ్యాధుల కారణంగా తాను చనిపోయినట్లు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్న వెబ్‌సైట్లు, చానెళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement