జెరూసలేం: ఇజ్రాయెల్‌లోని జెరుసలేంలోని అల్ అక్సా మసీదులో పోలీసులు, పాలస్తానీయుల మధ్య ఘర్షణలు జరిగాయి. రంజాన్ సందర్భంగా ముస్లింలు ఈ మసీదులోనే ప్రార్థనలు చేస్తారు. ఇక్కడ యూదులు, ముస్లింల మధ్య మత ఘర్షణలు జరుగుతుంటాయి.
శుక్రవారం మసీదులో ప్రార్థనల కోసం 60 వేల మంది ముస్లింలు వచ్చారు. గుడ్‌ఫ్రైడే కావడంతో అక్కడే ఉన్న చర్చికి యూదులు కూడా వేలాదిగా వచ్చారు. హమాస్‌కు మద్దతుగా రోడ్లెక్కారు. యూదుల పవిత్ర స్థలం ముగ్రాభి గేట్‌పైకి రాళ్లు విసిరారు. పోలీసులపైకీ రాళ్లు రువ్వుతూ రెచ్చగొట్టారు. లాఠీచార్జీలో 150 మందికి పైగా గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment