సరికొత్త టెక్నాలజీ.. సౌండ్ ద్వారానే ఫోన్లు ఛార్జింగ్ | Xiaomi Files Patent For Sound Charging Technology | Sakshi
Sakshi News home page

సరికొత్త టెక్నాలజీ.. సౌండ్ ద్వారానే ఫోన్లు ఛార్జింగ్

Published Thu, Jun 24 2021 8:16 PM | Last Updated on Thu, Jun 24 2021 8:51 PM

Xiaomi Files Patent For Sound Charging Technology - Sakshi

ప్రస్తుతం స్మార్ట్ యుగంలో ప్రతి రోజు ఎక్కడో ఒక చోట కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. రెండు రోజులో క్రితమే చైనాలో కేవలం ఒకే రోజులో 10 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. దీంతో ప్రపంచం ఒక్కసారిగా ఆశ్చర్య పోయింది. ఇప్పుడు మరోసారి సరికొత్త ఆవిష్కరణకు షియోమీ శ్రీకారం చుట్టింది. గత దశాబ్దం కాలంలో స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ స్క్రీన్ టెక్నాలజీ, ప్రాసెసింగ్ పవర్, వైర్ లెస్ కనెక్టివిటీ విషయాలలో సాంకేతిక పరిజ్ఞానం చాలా వేగంగా అభివృద్ది చెందింది. అయితే, బ్యాటరీ టెక్నాలజీ మాత్రం టెక్నాలజీ మాత్రం అనుకున్నంత వేగంగా అభివృద్ది చెందలేదు. గత ఏడాది నుంచి ఈ టెక్నాలజీలో పురోగతి కనిపిస్తుంది. 

మొబైల్ తయారీ కంపెనీలు ఛార్జింగ్ వేగంగా అయ్యేందుకు ఛార్జింగ్ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. చైనా మొబైల్ తయారీ దిగ్గజం షియోమీ ఈ మద్యనే 200వాట్ చార్జర్ ని అభివృద్ది చేసింది. అయితే ఈ కంపెనీ ఇప్పుడు 'సౌండ్ ఛార్జింగ్' టెక్నాలజీకి సంబంధించి పేటెంట్ కోసం దాఖలు చేసినట్లు సమాచారం. గిజ్ చైనా నివేదిక ప్రకారం, షియోమీ రాష్ట్ర సంస్థ చైనా నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అడ్మినిస్ట్రేషన్ కు పేటెంట్ కోసం దరఖాస్తు చేసింది.

ఈ పేటెంట్ టెక్నాలజీ ఒక పరికరాన్ని ధ్వని ద్వారా ఛార్జ్ చేయడానికి కంపెనీ కృషి చేస్తున్నట్లు తెలుస్తుంది. 'సౌండ్ ఛార్జింగ్' టెక్నాలజీలో రెండు ముఖ్యమైన భాగాలు ఉన్నట్లు పేటెంట్ ద్వారా తెలుస్తుంది. షియోమీ అభివృద్ది చేస్తున్న కాంటాక్ట్ లెస్ వైర్ లెస్ ఛార్జింగ్ మొదటి రూపం ఇది కాదు. జనవరిలో కంపెనీ తన 'ఎయిర్ ఛార్జ్' టెక్నాలజీని ఆవిష్కరించింది. ఈ టెక్నాలజీ ద్వారా గదిలో మనం ఎక్కడ స్మార్ట్ ఫోన్ ఉంచిన ఫోన్ చార్జ్ కానుంది. దీని ఛార్జ్ చేయడానికి బీమ్ ఫార్మింగ్ అనే ఫోకస్టింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. అయితే, ఈ కొత్త 'సౌండ్ ఛార్జింగ్' టెక్నాలజీని కొట్టి పారేస్తున్నారు.

చదవండి: బడ్జెట్‌లో రియల్ మీ 5జీ స్మార్ట్ ఫోన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement